Site icon HashtagU Telugu

Parent-Teacher Meeting : విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు , లోకేష్

Chandrababu And Lokesh Had

Chandrababu And Lokesh Had

ఏపీ వ్యాప్తంగా శనివారం పేరెంట్స్ – టీచర్స్ మెగా సమావేశాన్ని (Parent-Teacher Meeting) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawankalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minster Lokesh)లు పాల్గొన్నారు.

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. సీఎం ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రగతి నివేదికలను పరిశీలించారు. విద్యార్థుల విద్యాభ్యాస సామర్థ్యాలను పరీక్షించి, వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు విని పాఠశాల అభివృద్ధి పై దృష్టి సారించారు.

ఎలక్ట్రానిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయ్యారని, మాయమాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ వల్ల మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజులో 24 గంటలూ ఫోన్ చూడడం అనేది ఒక వ్యసనం అని, ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇవాళ నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతుందని అన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబరు 7న పేరెంట్-టీచర్ సమావేశం జరుగుతుందని, పేరెంట్-టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు. సమావేశం అనంతరం పిల్లలతో కలిసి చంద్రబాబు , లోకేష్ భోజనం చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

Read Also : Parent-Teacher Meeting : విద్యార్థులతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్