Chandrababu : 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచింది – చంద్రబాబు

39ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిపించటమే కాకుండా లోకేశ్ కు 92వేల మెజారిటీని నియోజకవర్గ ప్రజలు కట్టబెట్టారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 10:48 AM IST

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచిందన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (జులై 1) ఉదయం నుంచి ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పాల్గొని.. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ తో సహా పలువురు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేసి భారీ విజయం సాధించారు. గాజువాక, భీమిలతో పాటు మంగళగిరిలోనూ 90వేలకుపైగా మెజారిటీ వచ్చింది. కుప్పంలో 60వేలు మెజారిటీవస్తే గొప్ప మెజారిటీ అనుకునేవాడిని. 39ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిపించటమే కాకుండా లోకేశ్ కు 92వేల మెజారిటీని నియోజకవర్గ ప్రజలు కట్టబెట్టారు. మునుపెన్నడూ మంగళగిరిలో ఏ ఎమ్మెల్యేకిరాని మెజారిటీ లోకేశ్ కే వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నియోజకవర్గం లో ఎప్పుడూలేనంతగా భారీ మెజార్టీని ఇచ్చారు కాబట్టి.. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వానిది, టీడీపీది అని చంద్రబాబు అన్నారు. లోకేశ్ తో ఇంకా బాగా పనిచేయించుకోండి అంటూ ప్రజలతో చంద్రబాబు ఛలోక్తులు విసిరారు.

Read Also :  Ashadha 2024: ఆషాడ మాసంలో ఈ చెట్టును పూజిస్తే చాలు.. అంతా విజయమే!