Chandra Babu to Assembly: అనురాధ కోసం అసెంబ్లీకి చంద్రబాబు, వైసీపీకి టెన్షన్

టీడీపీ అధినేత చాణక్యం సీఎం జగన్మోహన్ రెడ్డి కి నిద్ర లేకుండా చేస్తుంది. సొంత పార్టీ ఎమ్యెల్యేల మీద నిఘా పెట్టుకున్నారు. అయినప్పటికీ గురువారం జరిగే..

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 09:52 PM IST

టీడీపీ అధినేత చాణక్యం సీఎం జగన్మోహన్ రెడ్డి కి నిద్ర లేకుండా చేస్తుంది. సొంత పార్టీ ఎమ్యెల్యేల మీద నిఘా పెట్టుకున్నారు. అయినప్పటికీ గురువారం జరిగే ఎంఎల్సీ పోలింగ్ పూర్తిగా ముగిసి ఫలితాలు వచ్చే వరకు వైసీపీ కి చుక్కలే. పట్టభద్రుల విజయం జోష్ తో ఉన్న టీడీపీ వైపు వైసీపీ రెబెల్స్ మొగ్గుచూపుతున్నారు. వాళ్ళు ఇద్దరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినా జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది. అందుకే ఉగాది మరుసటి రోజే వైసీపీ కి ఛాలెంజ్ ఎదురుకానుంది. మొత్తం ఏడు మంది ఎంఎల్సీ స్థానాలకు ఎనిమిది మంది పోటీలో ఉన్నారు. ఒకరిని గెలిపించుకునే బలం టీడీపీకి ఉన్నప్పటికీ వైసీపీ నలుగుర్ని అనధికారికంగా లాగేసుకుంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వైసీపీ రెబెల్స్ చంద్రబాబు (Chandra Babu) కు టచ్ లో ఉన్నారు.

ఇది వైసీపీ ఊహించని పరిణామం. హ్యాపీగా తాము నిలబెట్టిన అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారని వైసీపీ భావించింది. కానీ అలా కుదరకుండా చంద్రబాబు (Chandra Babu) అడ్డు చక్రం వేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాము నిలబెట్టిన ఏడుగురు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ని గెలిపించుకోవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే రెండు పార్టీలకు చాలా ముఖ్యం. తాము పోటీకి పెట్టిన ఒక్క సీటుని గెలుచుకుని వైసీపీకి మరోమారు గట్టి ఝలక్ ఇవ్వాలని తద్వారా ఏపీలో పొలిటికల్ సీన్ మొత్తం మారిందని జనాలకు సందేశం ఇవ్వాలని టీడీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. పరిస్థితులు కూడా ఎక్కువ టీడీపీకి అనుకూలంగా ఉండడం కూడా ఈ ఎన్నికల్లో చిత్రంగా చెప్పుకోవాలి.

వైసీపీకి ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేల బెడద ఉంది. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వణుకు పుట్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో అసంతృప్తి ఎమ్మెల్యేలను మంత్రులు బుజ్జగిస్తునట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక వైసీపీ అధినాయకత్వం కీలక ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది సభ్యుల అప్పగించి కధ సాఫీగా సాగిపోవాలని చూస్తోంది.

అప్పగించిన ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించే బాధ్యత మంత్రులకు వైసీపీ అధిష్టానం అప్పగించింది. అంటే ఎటు నుంచి ఏమి జరిగినా మంత్రులే ఇరుక్కుపోతారని అంటున్నారు. ఇక రెండు రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహించారని తెలుస్తోంది. అయితే నాలుగు సార్లు కూడా తప్పులే జరిగాయని పార్టీలో గుసగుసలు పోతున్నారు.

ఎలా ఓటు వేయాలన్నది తెలియక తప్పులు చేశారా లేక కావాలనే అలా చేశారా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్ గా ఉంది. దీంతో మరి కొద్ది గంటలలో పోలింగ్ ఉందనగా ఎలా ఓటు వెయ్యాలి అని ఎమ్మెల్యేలకు మంత్రులు పార్టీలోని ముఖ్య నేతలు దిశా నిర్దేశం చేస్తున్నారని భోగట్టా. ఇంకో వైపు చూస్తే విజయవాడలో పలు చోట్ల ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నారు.
టోటల్ గా చూస్తే వైసీపీలో టాప్ టూ బాటం అంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఒకే ఒక్క ఓటు దూరంలో టీడీపీ విజయం ఉంటే నాలుగు ఓట్ల తేడాతో వైసీపీ ఉందని తెలుస్తుంది. ఎవరు ఏ వైపు నుంచి కొంప ముంచుతారో తెలియని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 23న జరిగే ఈ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీకు అనుకూలం చేస్తాయన్నది 23న తేలిపోతుంది.

ఒకవేళ టీడీపీ ఓటమి పాలు అయితే 23 నంబర్తో మళ్లీ పొలిటికల్ ర్యాగింగ్ తప్పదు. వైసీపీ కనుక ఓటమి పాలు అయితే రివర్స్ లో ఎటాక్ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా 23 నంబర్ యాంటీ సెంటిమెంట్ మాత్రం ఏపీ పాలిటిక్స్ లో మరికొంతకాలం కొనసాగనుంది. విచిత్రంగా 23 నంబర్ డేట్ పోలింగ్ వచ్చింది. మార్చి 23న ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో వైసీపీ టీడీపీ మళ్ళీ ఢీ అంటూ దూకుడు పెంచాయి. చివరి నిముషంలో ఊహించని ట్విస్ట్ ఇస్తూ టీడీపీ ఒక అభ్యర్ధిని నిలబెట్టడంతో వైసీపీలో చెప్పలేని అలజడి చెలరేగుతోంది. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పరాజయాన్ని అందుకున్న చేదు అనుభవం కళ్ళ ముందే వైసీపీకి ఉంది. యాంటీ సెంటిమెంట్ డేట్ గా 23 నంబర్ ఉంది. 2019లో మే 23న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో బంపర్ విక్టరీ కొట్టగా కేవలం 23 సీట్లతో తెలుగుదేశం దారుణంగా చతికిలపడింది. దాంతో 23 నంబర్ అంటూ టీడీపీని పొలిటికల్ ర్యాంగింగ్ చేస్తూ వస్తోంది వైసీపీ. దీనికి చెక్ పెట్టేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ చేశారు. అనురాధ గెలుపు టీడీపి జోష్ ను మరింత  పెంచనుంది.

Also Read:  Kohli & Sharma: డేటింగ్ అనగానే సీరియస్ అయింది అనుష్కతో లవ్ స్టోరీపై కోహ్లీ