Site icon HashtagU Telugu

Chandrababu: మీరు గెలిపిస్తే సరే.. లేదంటే ఇదే నా చివరి ఎన్నిక!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏపీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీలో సీనియర్ నాయకుడినైన నన్ను, నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పి బయటికొచ్చాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తాను అని చెప్పాను. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బాబు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు తనను, తన భార్యను అవమానించారని. అందుకే ఆవేదనతో సభలోనుంచి బయటకు వచేశానని తెలిపారు. అయితే వచ్చేముందు అసెంబ్లీలో శపథం చేశానని, మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించానని ఆయన గుర్తు చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుందని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతామున్నది కౌరవ సభ అని, టీడీపీని గెలిపించి పంపితే మళ్ళీ గౌరవ సభగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. దీనికి ముందుగా కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Also Read:  CM KCR: సీఎం కేసీఆర్‌ హామీ.. టీఆర్‌ఎస్‌లో కలకలం..!

ఇక కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి జిల్లాలో టీడీపీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలునిచ్చారు. కాగా బుధవారం కోడుమూరు, దేవనకొండ, పత్తికొండలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గురువారం ఆదోని, ఎమ్మిగనూరులో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Exit mobile version