Site icon HashtagU Telugu

TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రెండో రోజు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం

chandrababu

chandrababu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. ఈ రోజు, రేపు కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.చంద్ర‌బాబు నాయుడు జైలు నుంచి వ‌చ్చిన తరువాత ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించారు. ఆ త‌రువాత ఆయ‌న కొన్ని పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తాజాగా చంద్ర‌బాబు నివాసంలో యాగాలు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా యాగాలు, య‌జ్ఞాలు నిర్వ‌హించ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల కోస‌మేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Also Read:  Human Trafficking: భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. కారణమిదే..?

Exit mobile version