Chalo Assembly :తిర‌గ‌బ‌డ్డ ఏపీ జ‌నం,బాబు ప్ర‌జా ఉద్య‌మం.!

క్విట్ ఇండియా త‌ర‌హా ఉద్య‌మం(Chalo Assembly) ఏపీలో క్విట్ జ‌గ‌న్ పోరాటం చేయాల‌ని

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 04:49 PM IST

క్విట్ ఇండియా త‌ర‌హా ఉద్య‌మం(Chalo Assembly) ఏపీలో క్విట్ జ‌గ‌న్ (Jagan)పోరాటం చేయాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుకు ప్ర‌జ‌ల నుంచి ఇప్పుడు స్పంద‌న క‌నిపిస్తోంది. ఏపీ స‌ర్కార్ మీద తిర‌గ‌బ‌డ్డ జ‌నంతో సోమ‌వారం విజ‌య‌వాడ ద‌ద్ద‌రిల్లింది. జీవో నెంబ‌ర్ 1 ను నిరసిస్తూ ప్ర‌జా, పౌర‌, క‌మ్యూనిస్ట్ లు ఇచ్చిన `అసెంబ్లీ ముట్ట‌డి` రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు ఉద్య‌మ‌కారుల‌ను ఎక్క‌డికక్క‌డ అరెస్ట్ లు చేసిన‌ప్ప‌టికీ విజ‌య‌వాడకు జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. వాళ్ల‌ను అదుపులోకి తీసుకోవ‌డానికి పోలీసులు ఇబ్బందులు ప‌డ్డారు. క‌మ్యూనిస్ట్, ప్ర‌జా సంఘాల నాయ‌కుల‌ను హౌస్ అరెస్ట్ లు చేశారు.

 క్విట్ జ‌గ‌న్ పోరాటం చేయాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు (Chalo Assembly)

అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశా వ‌ర్క‌ర్లు రోడ్ల మీద‌కు  వ‌చ్చారు. వాళ్లు త‌ల‌పెట్టిన ఛ‌లో అసెంబ్లీ(Chalo Assembly) కార్య‌క్ర‌మానికి వేలాది మంది మ‌హిళ‌లు త‌ర‌లి వ‌చ్చారు. సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ముందుకు రావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ నిన‌దించారు. మ‌హిళ‌ల్ని అదుపు చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితికి పోలీసులు వెళ్లారు. జిల్లాల్లోనూ మ‌హిళ‌లు రోడ్ల మీద‌కు రావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్వాడీ, ఆశావ‌ర్క‌ర్ల హ‌డావుడి క‌నిపించింది. జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద స‌మాంత‌రంగా ఉద్య‌మిస్తూ `ఛ‌లో అసెంబ్లీ` కార్య‌క్ర‌మాన్ని మ‌హిళ‌లు త‌ల‌పెట్టారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త అంటే ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే స‌మ‌యంలో ఏపీ లాయ‌ర్లు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. భారీ సంఖ్య‌లో న్యాయ‌వాదులు `ఛ‌లో విజ‌య‌వాడ` కార్య‌క్ర‌మానికి దిగ‌డంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాళ్ల‌తో సంప్ర‌దింపులు జ‌రప‌డం ద్వారా ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

అంగ‌న్వాడీ, ఆశావ‌ర్క‌ర్ల `ఛ‌లో అసెంబ్లీ`

జీవో నెంబరు వన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, వామపక్ష పార్టీలు సోమ‌వారం `చలో అసెంబ్లీ`(Chalo Assembly) కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. అయితే పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడ బయలుదేరిన నేతలను జిల్లాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. . ఆదివారం రాత్రి ప‌లువురు వామపక్ష, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అసెంబ్లీ ముట్ట‌డి కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు కూడా పాల్గొననుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని, వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు (Jagan)హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read : Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్

అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, వామపక్ష పార్టీలు , న్యాయ‌వాదులు సంయుక్తంగా సోమవారం `ఛలో విజయవాడ` కు(Chalo Assembly) పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివస్తున్న వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు.

అంగన్‌వాడీల అరెస్టులను ఖండించిన టీడీపీ, వామపక్షాల

అంగన్‌వాడీల అరెస్టులను ఖండించిన సీపీఎం, ప్రభుత్వ (Jagan)దమనకాండను ఖండించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పిలుపు మేరకు ఆందోళనకు వస్తున్న మహిళలను దౌర్జన్యంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. పెత్తందారులపై యుద్ధం అంటూ పేద మహిళ అంగన్‌వాడీలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు. ముందస్తు అనుమతి కోరినా.. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్టు విచక్షణారహితంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంగన్‌వాడీల కోర్కెలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా(Chalo Assembly) ప్రకటన చేయాలని, సీఎం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు.

`అసెంబ్లీ ముట్ట‌డి, ఛ‌లో అసెంబ్లీ, ఛ‌లో విజ‌య‌వాడ ప్ర‌జాఉద్య‌మం (Chalo Assembly)

ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించి, టీడీపీ, వామపక్షాల వారిని ఎవరినీ విజయవాడవైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ(Jagan) ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఛలో అసెంబ్లీ, ఛలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు‌ పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. వందలాది మందికి‌ ముందుగా నోటీసులు పంపించారు. పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం మీద `అసెంబ్లీ ముట్ట‌డి, ఛ‌లో అసెంబ్లీ, (Chalo Assembly)ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాల‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల ఇచ్చిన ప్ర‌జాఉద్య‌మం పిలుపు విజ‌య‌వాడ కేంద్రంగా సోమ‌వారం క‌నిపించింది.

Also Read : AP Assembly : ఏపీ అంసెంబ్లీలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..?