Chaddi Gang : ఏపీలో చ‌డ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు

ఏపీలో మ‌రోసారి చ‌డ్డీ గ్యాంగ్ హాల్చ‌ల్ చేస్తుంది. తిరుప‌తిలో చ‌డ్డీ గ్యాంగ్ నేరాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో పోలీసులు

  • Written By:
  • Updated On - November 22, 2023 / 10:59 AM IST

ఏపీలో మ‌రోసారి చ‌డ్డీ గ్యాంగ్ హాల్చ‌ల్ చేస్తుంది. తిరుప‌తిలో చ‌డ్డీ గ్యాంగ్ నేరాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, వ్యాపారాలను తరచూ టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న చడ్డీ గ్యాంగ్ మరోసారి తిరుపతిలో హాల్చ‌ల్ చేసింది. శివార్లలోని నివాసాలు, వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా సంచరిస్తోందని జిల్లా పోలీసులు నిర్వాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ముఠాలో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. గతేడాది తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం చడ్డీ గ్యాంగ్ జిల్లా పోలీసులను ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఈ సంవత్సరం కూడా వార్షిక పండుగ ముగిసిన మూడు వారాల తర్వాత వారి కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా తిరుపతి-రేణిగుంట రహదారిలోని ఓ కార్ షోరూంలో చడ్డీ ముఠాకు చెందిన ముగ్గురు దొంగతనానికి ప్రయత్నించారు. శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘ‌ట‌న రికార్డు అయింది. రాడ్లు, ఆయుధాలతో వారు బ్యాక్‌డోర్ ద్వారా లోపలికి ప్రవేశించారు. అయితే షోరూమ్‌లో విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఖాళీ చేతులతో వెనుతిరిగారు. నగర శివార్లలోని శ్రీవారి విల్లాస్‌లోని ఓ ఇంటిపై శనివారం అర్థరాత్రి ముఠా దాడి చేసింది. ఎంఆర్‌ పల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతేడాది ఇదే తరహాలో రూ.4 లక్షల చోరీ జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ఈ సంఘటనలు నగరం సరిహద్దులో ఉన్న ఇళ్ళు మరియు వాణిజ్య భవనాలపైనే జ‌రుగుతున్నాయి. చడ్డీ గ్యాంగ్‌లో ఆరు నుండి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారని, వారు శివారు ప్రాంతాల్లోని ఇళ్లు, షాపుల‌నే టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చడ్డీ ముఠా సభ్యులు గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఉన్నార‌ని తెలిపారు వారి నేర కార్యకలాపాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వరకు ఉంటాయ‌న్నారు. చ‌డ్డీ గ్యాంగ్ నేరాల‌పై తిరుపతి పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read:  Gaddam Vinod : గడ్డం వినోద్ నివాసంలో ఈడీ సోదాలు.. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై ఇన్వెస్టిగేషన్

తిరుచానూరు, రేణిగుంట, ఎంఆర్ పల్లె, అలిపిరి వాసులు అనుమానాస్పద వ్య‌క్తులు, కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. భద్రతను మెరుగుపరచడానికి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయమని ఇంటి యజమానులకు సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో నిఘా పెంచాలని, పెట్రోలింగ్‌ను పెంచాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో చడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ఇంటి వద్దకు వస్తే అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి పోలీసులు కోరారు.