AP and TS: అసెంబ్లీ స్థానాల పెంపుపై ‘కేంద్రం’ రియాక్షన్ ఇదే!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు.

Published By: HashtagU Telugu Desk
Ap And Ts

Ap And Ts

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకు పెంచలేదు. అసెంబ్లీ స్థానాలను పెంచాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నా కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. అసెంబ్లీ స్థానాల పెంపుపై తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలిపింది. నియోజకవర్గాల పెంపుపై 2026 వరకు వేచి ఉండాలని చెప్పింది.

విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలకు పెంచుకోవచ్చని తెలిపింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సమాధానంతో… తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే కనీసం మరో నాలుగేళ్లు ఆగాల్సిందేననే విషయం స్పష్టమవుతోంది.

  Last Updated: 27 Jul 2022, 04:04 PM IST