Site icon HashtagU Telugu

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ

Centre Approves Financial P

Centre Approves Financial P

కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి (Visakhapatnam Steel Plant) కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఊపిరి పోసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం .. రూ. 11,440 కోట్ల (Rs 11,500 crore) ప్యాకేజీని ఈ కర్మాగారానికి అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూ. 17 వేల కోట్ల ప్యాకేజీగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి అధికారికంగా రూ. 11,440 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీపై ప్రధాని మోదీకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. 2023-24లో రూ. 4548.86 కోట్లు, 2022-23లో రూ. 2858.74 కోట్ల నష్టాలు చవిచూసింది. ముడిసరుకు కొరత, వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పులు పెరగడం వంటి కారణాలతో ఈ కర్మాగారం నష్టాల్లో పడేసింది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో కేంద్రం ముందుకు వచ్చి టీడీపీ ఒత్తిడి మేరకు భారీ ఆర్ధిక సాయం ప్రకటించి కార్మికుల్లో సంతోషం నింపింది.

Ram Gopal Varma: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. ఆ న‌టుడిపై ప్ర‌శంస‌లు!

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో రెండింటిని మాత్రమే నిర్వహిస్తున్నారు. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను ఏర్పాటు చేయడానికి రూ. 7,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఫర్నేసులతో నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఫర్నేసుల ద్వారా లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగాల్లో వినియోగించే అధిక నాణ్యత కలిగిన ఉక్కును ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా విదేశీ మార్కెట్లకు ఉక్కు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.

కేంద్ర ప్యాకేజీ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు. కేంద్రం నుండి అందిన ఆర్థిక సహాయం ద్వారా ప్లాంట్ నిర్వహణను మెరుగుపరచి, నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీతో పాటు నిర్వహణ ఖర్చుల కోసం రూ. 10,000 కోట్ల నిధులను వెచ్చించే అవకాశం ఉండటంతో, ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు పెరిగాయి.