Site icon HashtagU Telugu

BJP Alliance in AP : బిజెపి మంత్రులతో ముగిసిన బాబు భేటీ..ఖరారైన స్థానాలు ఇవే..

Central Minister Shekhawat

Central Minister Shekhawat

పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబదించి ఈరోజు బిజెపి కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat) బృందంతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ల భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై మూడు పార్టీల నేతలు చర్చించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

మరి ఈ స్థానాలపై టిడిపి – జనసేన పార్టీ నేతలు , శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ముఖ్యంగా జనసేన శ్రేణులు ఇప్పటికే 23 సీట్లేనా అని మండిపడుతున్నారు. ఇక ఈ భేటీ తర్వాత మరో రెండు సీట్లు తగ్గడం తో ఇంకెంత ఆగ్రహం వ్యక్తం చేస్తారో చూడాలి. 175 స్థానాలకు కేవలం 23 కు మాత్రమే పోటీ చేయడం అటు అధికార పార్టీ వైసీపీ సైతం విపరీతంగా విమర్శలు , సెటైర్లు వేస్తూ వచ్చింది. అలాగే ఇంతకాలం పార్టీ ని నమ్ముకున్న జనసేన నేతలు , కాపు నేతలు సైతం పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ లో చేరిపోయారు. మరి ఉన్న కొద్దీ మంది కూడా ఇప్పుడు ఉంటారో..ఉండరో..అసలు ఆ 21 టిక్కెట్లు కూడా ఎవరికీ ఇస్తారో ఎవరికీ ఎవ్వరో..చూడాలి. ఇక పార్లమెంట్ టికెట్స్ కూడా మూడు అనుకుంటే ఇప్పుడు 2 తగ్గింది. అందులో ఒకటి పవన్ కల్యాణే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన ఒకటి ఎవరికీ ఇస్తారో అనేది చూడాలి. జనసేన పార్టీ లో అసెంబ్లీ సీటు రాకపోతే పార్లమెంట్ టికెట్ అయినా దక్కించుకోవాలని చాలామందే ఎదురుచూస్తున్నారు. మరి వారింది ఆ ఒక్క స్థానం తో ఎలా కూల్ చేస్తారో పవన్ కళ్యాణ్ కే తెలియాలి. ఏది ఏమైనప్పటికి జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్..తాను గద్దె దిగే స్థాయికి చేరుకోడుగా అంటూ అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Dharani Portal: ధ‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల గ‌డువు పెంపు