Central Minister : చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై కేంద్ర మంత్రి ఆరా.. టీడీపీ ఎంపీతో చిట్‌చాట్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌పై పార్టీల‌క‌తీతంగా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయి నేత‌లు స్పందించ‌గా..

  • Written By:
  • Updated On - September 21, 2023 / 05:59 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్‌పై పార్టీల‌క‌తీతంగా స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే జాతీయ స్థాయి నేత‌లు స్పందించ‌గా.. ప‌లువురు ఎంపీలు కూడా చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ని ఖండించారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ నేత‌లు కూడా టీడీపీ నేత‌ల వ‌ద్ద చంద్ర‌బాబు అరెస్ట్ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఆయ‌న అరెస్ట్ అక్ర‌మమంటూ వారు ఖండిస్తున్నారు. తాజాగా పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సైతం చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై ఆరా తీశారు. నితిన్ గ‌డ్క‌రీకి అత్యంత స‌న్నిహితంగా ఉండే టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ రోజు పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ఆయ‌న్ని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు అరెస్ట్‌పై కేశినేని నానిని అడిగి తెలుసుకున్నారు. అరెస్ట్ స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాలు, నంద్యాల నుంచి విజ‌య‌వాడ‌కు చంద్ర‌బాబుని తీసుకువ‌చ్చిన తీరు, సిట్ కార్యాల‌యంలో అర్థ‌రాత్రి వ‌ర‌కు విచార‌ణ పేరుతో చంద్ర‌బాబుని ఉంచిన వ్య‌వ‌హారాన్ని కేశినేని నాని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి వివ‌రించారు.చంద్ర‌బాబు గొప్ప నాయ‌కుడని.. త‌ప్పు చేసే వ్య‌క్తి కాద‌ని గ‌డ్క‌రీ తెలిపిన‌ట్లు ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. భ‌గ‌వంతుని ఆశీస్సుల‌తో అన్ని విఘ్నాలు తొలిగిపోయి క‌డిగిన ముత్యంలా బ‌య‌టికి వ‌స్తార‌ని గ‌డ్క‌రీ అన్నార‌ని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. అయితే మ‌రోవైపు బీజేపీ ప్రోద్భ‌లంతోనే చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్టార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు కూడా బీజేపీ,వైసీపీ, బీఆర్ఎస్ క‌లిసి కుట్ర‌పూరితంగానే చంద్ర‌బాబుని జైలుకు పంపార‌ని ఆరోపించారు.

https://x.com/kesineni_nani/status/1704786877797298216?s=20