Site icon HashtagU Telugu

Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం

Ap Capital

Ap Capital

ఏపీ రాజధాని అమరావతే (Amaravati) అని కేంద్రం (Central Govt) మరోసారి స్పష్టం చేసి జగన్ (Jagan) కు షాక్ ఇచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది తప్ప ఏపీకి మాత్రం రాజధాని లేదు. ఏపీ రాజధాని (AP Capital ) ఏది అంటే ఎవరికీ కూడా స్పష్టమైన అవగాహన లేదు. కొందరు విజయవాడ అంటే మరికొందరు విశాఖ అంటారు. ఇంకొందరు అమరావతి రాజధాని అని చెపుతుంటారు. కానీ ఇప్పుడు కేంద్రం… అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం చేసింది. అంతేకాదు అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా 28 రాష్ట్రాల రాజధానుల మాస్టర్‌ ప్లాన్‌ను కేంద్రం ఆమోదించింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం దక్కింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొంది కేంద్రం. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ… రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తమన్నారు. ఏపీ రాజధాని అమరావతి తో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు.

Read Also : Telangana CM : తెలంగాణ కొత్త సీఎం ప్రకటన ఈరోజు లేనట్లే..