Site icon HashtagU Telugu

AP Roads : ఏపీకి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు

Ap Roads Good News

Ap Roads Good News

ఏపీకి కేంద్ర ప్రభుత్వం (Central Govt ) వరుస గుడ్ న్యూస్ (Good News) లు అందిస్తుంది. ఇప్పటికే రైల్వే బడ్జెట్ (Railway Budget ) ను ప్రకటించగా..ఇప్పుడు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ. 252.42 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) ప్రకటించారు. ఈ నిధులతో శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వద్ద 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణం జారనుందని, సోషల్ మీడియా వేదికగా వివరాలను గడ్కరీ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ. 400 కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో 200.06 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయనున్నారు. అదనంగా, గుంటూరు-నల్లపాడు రైల్వే మార్గంలో రూ. 98 కోట్ల వ్యయంతో 4 వరుసల ఆర్వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌) నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత వరుసగా ఏపీకి నిధులు విడుదల కావడం, రాష్ట్ర అభివృద్ధిలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.

Read Also : Truth Bomb : ‘ట్రూత్ బాంబ్’ తుస్సు ..ఏదన్న జగనన్న ..?