Visakha Railway Zone: ఏపీకి గుడ్‌న్యూస్.. విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం ఆమోదం..!

  • Written By:
  • Publish Date - March 26, 2022 / 10:57 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా విశాక రైల్యే జోన్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తెలిపారు. ఈ క్ర‌మంలో కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.

ఇక విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొత్త రైల్వే జోన్ , రాయగడ డివిజన్ కోసం బడ్జెట్ లో 170 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూమిని కూడా ఎంపిక చేశామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ చెప్పారు.

దీంతో ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి భూమి సర్వే చేపట్టాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రైల్వే ఆఫీసు లేఅవుట్‌, నివాస సముదాయాలు, ప్రాథమిక కార్యకలాపాలను చేపట్టాలని రైల్వేశాఖ నిర్దేశించింది. ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టి, క్రమంగా అవసరమయ్యే నూతన భవనాల్ని నిర్మించుకోవాలని డీపీఆర్‌లో సూచించారు. ఈ దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడాలంటే రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు కావాలి. అయితే అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.