Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీ కీ కేంద్రం గుడ్ న్యూస్ .. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద..?

Andhra Pradesh Secretariat

Andhra Pradesh Secretariat

ఆంధ్రప్రదేశ్‌కు ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.879.08 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది.ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపికి 2022-23లో ఇప్పటి వరకు రూ.6153.58 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటన లో పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ…దేశంలో 14 రాష్ట్రాలకు ఏడో విడత కింద రూ.7,183.42 కోట్ల రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలకు రూ.50,283.92 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల చేసినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.