ఏపీకి కేంద్రం (Central Good News) వరుస తీపి కబుర్లు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక గుడ్ న్యూస్ లు తెలుపగా..తాజాగా మరో న్యూస్ అందజేసి రాష్ట్ర ప్రజలను సంతోష పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway)కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఏపీ నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు నిర్మించనున్నారు. ఈ మేరకు డీపీఆర్ రూపొందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. కేంద్రం ప్రధాన మంత్రి గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైవేను నిర్మిస్తున్నారు.
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఎన్‌హెచ్‌ఏఐ డిసెంబర్ చివరి వారానికి కన్సల్టెన్సీని ఖరారు చేస్తుంది. 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలుపెట్టి.. ఏడాదిన్నరలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.
వైజాగ్ నుండి ఖరగ్‌పూర్ మధ్య మొత్తం 783 కిలోమీటర్లు.. ఆరు లేన్లుగా ఈ హైవే ను నిర్మించనున్నారు. వైజాగ్ నుంచి ఖుర్దా రోడ్ (ఒడిశా) వరకు ఒక ప్యాకేజీగా.. అలాగే ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్‌పూర్ వరకు మరో ప్యాకేజీ కింద ఈ హైవే ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే విశాఖపట్నం, భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను అనుసంధానిస్తుంది. ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.
Read Also : Droupadi Murmu : పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి