Site icon HashtagU Telugu

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్..చంద్రబాబు ఎమోషనల్

CBN world economic forum conference

CBN world economic forum conference

కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి (Visakhapatnam Steel Plant) కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఊపిరి పోసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం .. రూ. 11,440 కోట్ల (Rs 11,500 crore) ప్యాకేజీని ఈ కర్మాగారానికి అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రూ. 17 వేల కోట్ల ప్యాకేజీగా ప్రచారం జరిగినప్పటికీ, చివరికి అధికారికంగా రూ. 11,440 కోట్లకు ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ” విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గర్వించదగిన, భావోద్వేగ సమయం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఆ కృషికి కేంద్రం స్పందించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బతికించడం కోసం రూ.11,440 కోట్లు ఆర్థిక మద్దతు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ విషయంలో మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వికసిత్ భారత్ – వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్‌లో నేనూ భాగస్వామిని అవుతా. ” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Nithya Menon : పీరియడ్స్‌ అని చెప్పిన వారు వినలేదట – నిత్యామీనన్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో రెండింటిని మాత్రమే నిర్వహిస్తున్నారు. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ను పునరుద్ధరించేందుకు కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను ఏర్పాటు చేయడానికి రూ. 7,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ఫర్నేసులతో నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఫర్నేసుల ద్వారా లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగాల్లో వినియోగించే అధిక నాణ్యత కలిగిన ఉక్కును ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా విదేశీ మార్కెట్లకు ఉక్కు ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.

కేంద్ర ప్యాకేజీ ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పునరుజ్జీవం పొందే అవకాశం ఉందని అంత భావిస్తున్నారు. కేంద్రం నుండి అందిన ఆర్థిక సహాయం ద్వారా ప్లాంట్ నిర్వహణను మెరుగుపరచి, నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీతో పాటు నిర్వహణ ఖర్చుల కోసం రూ. 10,000 కోట్ల నిధులను వెచ్చించే అవకాశం ఉండటంతో, ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు పెరిగాయి.