Center: కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు( AP people) శుభవార్త తెలిపింది. ఏపిలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ విడుదల చేసింది. రూ.2,100 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించగా.. జిల్లాకు రూ.300 కోట్ల చొప్పున 7 జిల్లాలకు కేంద్రం సాయం అందించింది. 7 జిల్లాలకు రూ.1750 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరఫున పలు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు. ఈ విధానంతో పేదరిక నిర్మాలన సాధ్యమవుతుందని వివరించారు. దేశంలో తొలి పది శాతం మంది సంపన్నులు నిరు పేదలుగా ఉన్న 20 శాతం మందిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుందని అన్నారు. నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారులు ఉండాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లకు రహదారుల్ని అనుసంధానం చేస్తే రవాణా చాలు సులభతరం అవుతుందన్నారు. తయారీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరే సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు. హరిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌కూ ప్రాధాన్యం ఇస్తే.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుందన్నారు.
Read Also: Fish Aquarium: ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉందా ? ఇవి తెలుసుకోండి