Amaravati : అమ‌రావ‌తే రాజ‌ధాని.. స్ప‌ష్టం చేసిన కేంద్రం

ఏపీ రాజ‌ధానిపై కేంద్రం త‌న వైఖ‌రిని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా జీవీఎల్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్రం రాజ‌ధానిపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 11:46 AM IST

ఏపీ రాజ‌ధానిపై కేంద్రం త‌న వైఖ‌రిని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా జీవీఎల్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్రం రాజ‌ధానిపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదది జీవీఎల్ నరసింహారావు ప్ర‌స్తావించ‌గా.. రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనని కేంద్రం తేల్చేసింది. కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ప్రకారం ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాల‌న్న జీవీఎల్ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మొదట ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మాకు సమాచారం ఇచ్చారని కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 3 రాజధానులని, పాలనా రాజధానిగా విశాఖపట్నం, జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి అని తర్వాత చెప్పారన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద‌రాయ్‌. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు తాము కూడా వార్తల ద్వారా తెలుసుకున్నామ‌ని, త‌మ‌ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు