Site icon HashtagU Telugu

Cell Phone Thieves : ఏలూరు జిల్లాలో సెల్ ఫోన్ల చోరీ కేసు.. రూ.22 ల‌క్ష‌ల విలువైన ఫోన్లు రిక‌వ‌రీ

eluru police

eluru police

ఏలూరు జిల్లాలో ఇటీవ‌ల కాలంలో మొబైల్ ఫోన్లు ఎక్కువ‌గా చోరీకు గుర‌వుతున్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే దీనిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన జిల్లా పోలీసులు ఫిర్యాదుల‌కు ప్రత్యేకంగా వాట్స‌ప్ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాట్సాప్ నంబర్ 9550351100 ద్వారా వచ్చిన కంప్లైంట్లు త్వరితగతిన పరిష్కరిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మ తెలిపారు. ఇటీవల రికవరీ చేసిన మొబైల్స్ 105 వీటి విలువ సుమారు 22 లక్షలు ఉంటుందని .. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. మరొక 168 సెల్ ఫోన్లు ఇతర రాష్ట్రాల్లో గుర్తించామని త్వరలో వాటిని కూడా రికవరీ చేస్తామని తెలిపారు. దొంగతనానికి పాల్పడి 3 వ్యక్తులు పాత నేరస్తులుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. రద్దీ ప్రాంతాలైన బస్టాండ్ రైల్వే స్టేషన్ రైతు బజార్ మార్కెట్ లు ఇటువంటి ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు..