Site icon HashtagU Telugu

Congress : భీమవరంలో రేవంత్ కూతురు నిమిషా రెడ్డి సంబ‌రాలు

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయంపై తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూతురు నిమిషా రెడ్డి, అల్లుడు శివారెడ్డి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తమ ఇంట్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి ముందు బాణ‌సంచా కాల్సి సంబ‌రాలు జ‌రిపారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు నిమిషా రెడ్డి, శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మిఠాయిలు పంచిపెట్టారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో విజయం సాధించినందుకు గానూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కాకినాడలోని తమ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. బీజేపీ కాకినాడ కన్వీనర్ జి.సత్యనారాయణ పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 64 సీట్ల‌తో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యేల‌తో సమావేశం నిర్వ‌హించి.. సీఎల్పీ నేత‌ను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎన్నుకున్న తరువాత సీఎం ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌నుంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భ‌ట్టి విక్ర‌మార్క రాజ్‌భ‌వ‌న్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని స‌మాచారం.

Also Read:  Seethakka : 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది మా మూలుగు ప్ర‌జ‌లే : కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌