CBN Vision : చంద్ర‌బాబు జీవితం మ‌లుపు, ఇందిరాగాంధీ మైమ‌ర‌పు!

ఒక ఐడియా (CBN Vision) జీవితాన్నే మార్చేసింది..' ఇదో బిజినెస్ స్లోగన్.45 ఏళ్ల క్రితం చంద్రబాబుకు

  • Written By:
  • Updated On - February 28, 2023 / 12:46 PM IST

‘ఒక ఐడియా (CBN Vision) జీవితాన్నే మార్చేసింది..’ ఇదో బిజినెస్ స్లోగన్. సరిగ్గా 45 ఏళ్ల క్రితం చంద్రబాబుకు వచ్చిన ఒక ఐడియా ఆయన జీవితాన్ని(Political life) మలుపు తిప్పింది. ఆ విషయాన్ని చంద్రబాబుకు యూనివర్సిటీలో సహచరునిగా ఉన్న ఒకరు పంచుకున్నారు. ఇప్పుడు ఆ అంశం సోషల్ మీడియా వ్యాప్తంగా నిండిపోయింది. అదేంటంటే, 45 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వాస్తవ సంఘటన. S.V.యూనివర్సిటీలో చంద్రబాబు N.S.U.I నాయకుడిగా ఉండేవారు. ఆ టైం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంవత్సరం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తిరుపతికి వస్తున్నారు. స్వాగత ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలని బాబుగారికి ఆయన రాజకీయ గురువు రాజగోపాల్ నాయుడు గారు చెప్పారు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటా మీరు మీ కార్యక్రమాలు చూసుకోండని బాబు తనదైన శైలిలో రాజగోపాల్ నాయుడుకి చెప్పారు. ఆయన కార్యదక్షత రాజగోపాల్ కు గ తెలుసు కనుక ధీమాగా ఉన్నారు.

45 ఏళ్ల క్రితం చంద్రబాబుకు వచ్చిన ఒక ఐడియా (CBN Vision)

వచ్చేది ప్రధానమంత్రి అందునా ఇందిరాగాంధీ,ఆమెకు అందరిలా .. ఎప్పటిలా…..రొటీన్ గా కాకుండా వినూత్నమైన రీతిలో గ్రాండ్  ఆహ్వానం చెప్పాలని(CBN Vision) నిర్ణయించు కున్నారు చంద్రబాబు.అనుకున్నదే తడవుగా ఆయనకొక ఉపాయం తట్టింది.(ఆ ఐడియానే ఆయన భవిష్యత్తుకు కాంతిరేఖ అని అప్పటికి బాబుకి తెలియదు)సరే అ ఉపాయాన్ని ఆచరణలో పెట్టడానికి అప్పటి సహచరులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్ధి ఇంకొందరు మిత్రులతో పాటు తమ్ముడు రామ్మూర్తి నాయుడు లతో ఓ ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంతరంగిక సమావేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఎక్కడైనా రెండు గ్రూపులు ఉంటాయిగా.. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఓ గ్రూప్ లీడర్ రాజగోపాల్ నాయుడు అయితే మరో గ్రూప్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమరనాధ్ రెడ్డి.వీళ్ళ ప్లాన్ ఆ వర్గానికి తెలియకుండా ఉండేందుకే ఆ రహస్యశమావేశం.

ఇందిరాగాంధీ కు వినూత్నమైన రీతిలో గ్రాండ్  ఆహ్వానం

ఆ సమావేశంలో చంద్రబాబు ఆలోచన సహచరులతో పంచుకున్నారు. వారు కూడా అది చాలా వినూత్నమైన ఆలోచన తప్పకుండా మనం సక్సెస్ చేసితీరాలి అని సంకల్పించుకున్నారు.వెంటనే తిరుపతి పరిసర ప్రాంతాలని కొన్ని రూట్లుగా విభజించుకుని ఒక్కో రూటుకు ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పి మరుసటి రోజు కోయంబత్తూరు రైలు ఎక్కారు చంద్రబాబు. కోయంబత్తూరు ఎందుకంటారా…?అప్పట్లో టీ-షర్టుల మీద పేర్లు ప్రింట్ చేసే టెక్నాలజీ అక్కడే ఉండేది మరి.టీ-షర్టుల మీద చంద్రబాబు నాయుడు NSUI అని పేరు ప్రింట్ చేపించుకున్న “తొలిఘనుడు” కూడా చంద్రబాబు (Political life)  కావటం విశేషం.

Also Read : CBN : గ‌న్న‌వ‌రం ఎపిసోడ్ పై చంద్ర‌బాబు క‌ల‌త‌! రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌!!

ఆ రోజుల్లో 2-వీలర్సంటే సైకిళ్ళు కాక సువేగా,హీరో మెజస్టిక్ మోపెడ్లు ఎక్కువ వాడేవారు ఎవరో బాగా సంపన్నులయితే రాజ్దుత్ ,జావా మోటార్ సైకిళ్ళు వాడేవారు. కానీ వాటితో బైక్ ర్యాలీలు భారీగా జరిగినట్లు భారతదేశ చరిత్రలో లేదు. లేనిది సృష్టించడమేగా చంద్ర బాబు (CBN Vision) ప్రత్యేకత.తిరుపతిలోని బైక్ షోరూంలతో పాటు,మెకానిక్ షెడ్లకి వెళ్ళి ఈ బైక్ లు వాడేవారి వివరాలు సేకరించి ఎక్కడెక్కడో ఉన్న వారి ఇళ్ళకు వెళ్ళి బైకు తో సహా వారు ర్యాలీలో పాల్గొనేలా ఒప్పంచడమే బాబు టీమ్ మెంబర్ల పని. మొత్తం మీద విపరీతంగా శ్రమించి సేకరించిన 300 మోటార్ సైకిళ్ళతో ర్యాలీ ప్లాన్ చేసి… ఆ ర్యాలీ కూడా ఇందిరాగాంధీ తిరుపతిలో ప్రయాణించే ఓపెన్ టాప్ జీప్ ముందే ఉండేలా చూడాలన్న బాధ్యతను రాజగోపాల్ నాయుడు మీద నెట్టేశారు.

రెడ్ బుల్లెట్ మీద తిరిగిన చంద్రభాబు నాయుడు 

మొత్తానికి ప్రధానమంత్రి రక్షణ సిబ్బందితో మాట్లాడారో, ఇందిరాగాంధీ తోనే మాట్లాడారో గానీ ప్రధాని వాహనం ఎదురుగా అంత భారీ ర్యాలీకి అనుమతివడం కూడా అప్పట్లో ఓ రికార్డ్ అని చెప్పుకునేవారంట.
ర్యాలీకి అనుకున్న విధంగా పర్మిషన్ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగిన బాబు తనకి ముందు 300 బైకులు లు ఉండేలా ఇందిరాగాంధీ ఓపెన్ టాప్ జీప్ ముందు తాను ఉండేలా ప్లాన్ చేసుకొని రెడ్ కలర్ బుల్లెట్ మీద రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రధానమంత్రిని ఘన స్వాగతంతో తిరుపతి పట్టణంలో తిప్పారు. ఆ స్వాగతానికి ముగ్దురాలైన ఇందిరాగాంధీ ఈ ర్యాలీ ఎవరు ఏర్పాటు చేశారు?రెడ్ బుల్లెట్ మీద తిరిగిన కుర్రోడు ఎవరని రాజగోపాల్ నాయుడుని అడిగితే … ఈ ర్యాలీ ప్లాన్ ,సక్సెస్ చేయడం మొత్తం బాధ్యత ఆ కుర్రోడే (Political life)చూసుకున్నాడు. అతని పేరు చంద్రభాబు నాయుడు NSUI ప్రెసిడెంట్ అని చెప్పారంట.

Also Read : TDP Radio : మోడీ `మ‌న్ కీ బాత్` త‌ర‌హాలో రేడియో ద్వారా చంద్ర‌బాబు వాయిస్

వెంటనే ఆవిడ బాబుగారిని పిలిపించుకుని అభినందనలు తెలిపి వచ్చే వారం డిల్లీ వచ్చి తనని కలవమని అపాయింట్ మెంట్ ఇచ్చేశారు.ఆ తర్వాత భాబు డిల్లీ వెళ్ళడం అక్కడ ఆయనను చంద్రగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేసి బీ ఫారం ఇవ్వమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పడం వెనువెంటనే జరిగిపోయాయి.ఈ పరిణామాలన్నింటికీ ఖంగుతిన్న అమర్ నాధ్ రెడ్డి బాబుకు సీటివ్వకుండా అడ్డుకోవాలని,సీటు వచ్చాక కూడా ఆయనని ఓడించాలని చేయని ప్రయత్నాల్లేవంటే అతిశయోక్తి కాదు.ఇందిరాగాంధీ డైరెక్ట్ క్యాండిడేట్ అనేనేమో తొలిసారి M.LA. కాగానే అడక్కుండానే బొన స్ గా చంద్రబాబుకు (CBN Vision) మంత్రి పదవి కూడా ఇచ్చేశారు .తన ప్రతిభా పాటవాలతో తొలిసారే ఇందిరాగాంధీ అంతటి వ్యక్తిని ఆకర్షించిన బాబు కాలక్రమంలో అవిడతోనే పోరాడాల్సి రావడం, దేనినైనా ఎదుర్కోగల సత్తాగల వ్యక్తిత్వం ఆయనది. అలాంటి ఆయనకి ఇప్పుడున్న నాయకులు పెద్ద లెక్క కాదని చంద్రబాబు చిన్ననాటి మిత్రుడు రాసిన 45 ఏళ్ల నాటి అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : TDP Old : తెలుగుదేశం వైపు 70ప్ల‌స్ ! క‌న్నా చేరిక‌తో 1983 బ్యాచ్ యాక్టివ్ !