CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?

చంద్ర‌బాబు దూకుడు త‌గ్గించారు. వ్యూహాత్మ‌క మౌనం(CBN Vision 2024 )పాటిస్తున్నారు. ఎంపీ,ఎమ్మెల్యే ఎంపిక మీద క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 10, 2023 / 03:52 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు త‌గ్గించారు. వ్యూహాత్మ‌క మౌనం(CBN Vision 2024 )పాటిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఎంపిక మీద క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఐ ప్యాక్ టీమ్ లీడ‌ర్ రాబిన్ సింగ్ ఇస్తోన్న రిపోర్ట్స్ ను ప‌రిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిలో ఉన్నారు. అందుకే, ఆయ‌న క్షేత్రస్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు ప్ర‌స్తుతానికి దూరంగా ఉన్నారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ను సెట్ చేసిన ఆయ‌న ఉభ‌య గోదావ‌రి, గుంటూరు, కృష్ణా, ప్ర‌కాశం జిల్లాలను స‌రిచేసే క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు(CBN Vision 2024 )

హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన త‌రువాత వీలున్నంత సైలెంట్ గా (CBN Vision 2024 )చంద్ర‌బాబు ఉంటున్నారు. ఢిల్లీ పెద్ద‌లు వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా పురంధ‌రేశ్వరి నియామ‌కం వెనుక దాగిన వ్యూహాల‌ను అధ్య‌య‌నం చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని స‌భ్యులు చంద్ర‌బాబు, పురంధ‌రేశ్వ‌రి. పైగా ఇద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ వైరం ఉంది. ఆ విష‌యాల‌న్నీ తెలిసి కూడా పురంధ‌రేశ్వ‌రికి ఏపీ బీజేపీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ కూట‌మి

ఎన్డీయేలో భాగ‌స్వామి కావాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన జ‌రిగే ఎన్టీయే స‌మావేశం తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను మార్చ‌నుంది. ఆ స‌మావేశానికి చంద్ర‌బాబు హాజ‌రు కావ‌డం జ‌రిగితే, జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ కూట‌మి ఏర్ప‌డిన‌ట్టే. తెలుగు రాష్ట్రాల్లో ఆ కూట‌మి దూకుడుగా వెళుతుంది. ఫ‌లితంగా బీజేపీ అనుకున్న విధంగా తెలంగాణ‌లో కింగ్ ఏపీలో కింగ్ మేక‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. అందుకే,పూర్తి క్లారిటీ వ‌చ్చే వ‌ర‌కు చంద్ర‌బాబు జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను (CBN Vision 2024 )నిశితంగా ప‌రిశీలిస్తున్నారు.

లోకేష్ కు ప్ర‌త్యేక టీమ్

ప్ర‌స్తుతం లోకేష్ యువ‌గ‌ళం నెల్లూరు జిల్లా వ‌రకు చేరింది. ఆయ‌న చేస్తోన్న యాత్ర‌కు పార్టీ అంచ‌నాల‌కు అనుగుణంగా ఫ‌లితం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. యువ‌త‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం లోకేష్ చేస్తున్నారు. అమెరికా త‌ర‌హాలో టౌన్ హాల్ మీటింగ్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. మినీ మేనిఫెస్టోను వివ‌రిస్తూ యువ‌గ‌ళం ముందుకు సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ కు ప్ర‌త్యేక టీమ్ ఏర్ప‌డింది. రాబోవు రోజుల్లో పార్టీని న‌డిపే స‌త్తా ఉన్న లీడ‌ర్ గా ఫోక‌స్ అవుతున్నారు. ఇదే చంద్ర‌బాబుకు కావాల్సింది కూడా. మ‌రో వైపు ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..ప్రోగ్రామ్ సూప‌ర్ హిట్ అయింది. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు, మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగారు చంద్ర‌బాబు(CBN Vision 2024 ).

Also Read : NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి స‌మావేశం.. టీడీపీకి ఆహ్వానం!

గ‌తంలో మాదిరిగా మూడు, నాలుగు విడ‌త‌లుగా అభ్య‌ర్థుల ఖారారు లేకుండా, ఒకేసారి ప్ర‌క‌టించ‌డానికి చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అనూహ్య రీతిలో ఈసారి చంద్ర‌బాబు ఎంపిక చేసే అభ్య‌ర్థుల జాబితా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే నాయ‌కుల‌కు గుడ్డిగా టిక్కెట్ల ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. గెలిచే వాళ్ల‌కు మాత్రమే టిక్కెట్లు ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నెల్లూరు జిల్లా వైసీపీ నుంచి చాలా మంది లీడ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒక‌రిద్ద‌రు గెలిచే వాళ్ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌ల్లో పోటీచేసే. (CBN Vision 2024 )అవ‌కాశం ఇచ్చారు.

Also Read : CBN strategy : జ‌గ‌న్ పై కేసీఆర్ `భూ` చ‌క్రాన్ని వ‌దిలిన‌ చంద్ర‌బాబు

నెల్లూరు జిల్లా వ‌ర‌కు సెట్ చేసిన చంద్ర‌బాబు ప్రకాశం జిల్లా మీద క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అక్క‌డ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు కూడా ముగిసింద‌ని వినికిడి. ఒక వేళ ఆయ‌న పార్టీలోకి వ‌స్తే, ఎంపీ అభ్య‌ర్థిగా ఒంగోలు నుంచి బ‌రిలోకి దింపాల‌ని యోచిస్తున్నారు. ఇక మిగిలిన చోట్ల అభ్య‌ర్థుల విష‌యంలో స్వ‌ల్ప మార్పులు చేస్తే స‌రిపోతుంద‌ని భావిస్తున్నారు. ఇక గుంటూరు , కృష్ణా జిల్లాల టీడీపీలో గ్రూప్ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా స‌రిచేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ  (CBN Vision 2024 )అయిన‌ట్టే. ఏ రోజు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ రెడీగా ఉండేలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా పార్టీని సెట్ చేయ‌డం బిజీగా ఉన్నారు. ఆ విష‌యం తెలియ‌ని కొంద‌రు చంద్ర‌బాబు వెనుక‌బ‌డ్డార‌ని భావిస్తే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.