Janasena Formation Day : జనసేన ప్రస్థానంపై చంద్రబాబు ట్వీట్

Janasena Formation Day : పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రాజకీయ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని, సేవా నిబద్ధత, విలువలతో దేశానికి ఆదర్శంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Cbn Pawan

Cbn Pawan

జనసేన పార్టీ (Janasenaparty) స్థాపనకు నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కి, జనసైనికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన రాజకీయ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని, సేవా నిబద్ధత, విలువలతో దేశానికి ఆదర్శంగా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ, జనసేన పార్టీకి మరింత బలంగా ముందుకు సాగే శక్తి కలగాలని ఆకాంక్షించారు.

Janasena Formation Day : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్న – లోకేష్

ఈ సందర్భంగా ఏపీ ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోందని, ఆ పార్టీ కృషి ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ అనుబంధం గట్టిగా కొనసాగుతోందని, టీడీపీ-జనసేన కూటమి ద్వారా రాష్ట్రానికి మెరుగైన పాలన అందించేందుకు కలిసి కృషి చేస్తామని వెల్లడించారు.

Jana Sena Formation Meeting : పవన్ కళ్యాణ్ ప్రసంగం పై ఉత్కంఠ

మరోవైపు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురం వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారీ జనసందోహం కారణంగా పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోతున్నారు. సభా ప్రాంగణం వద్ద భారీ గందరగోళం నెలకొనడంతో జనసేన నేతలు కార్యకర్తలకు సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగించనున్నారు.

  Last Updated: 14 Mar 2025, 07:04 PM IST