`నా ఆలోచనా విధానం దద్దమ్మలకు అర్థంకాదు..` అంటూ చంద్రబాబు (CBN Trend)విశ్వరూపం చూపించారు. నిజమే, ఆయన విజన్ ను అర్థం చేసుకోవడం సామాన్యులకు మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ల కు కూడా బోధపడదు. రెండున్న దశాబ్దాల క్రితం విజన్ 2020 అంటే ఆయన్ను 420 అన్నారు. ఆయన ఆలోచనను అర్థం చేసుకోలేని ప్రత్యర్థులు 420 అంటూ ముద్రవేశారు. రోడ్ల పై ఫ్లైవోర్లు కట్టడం ఏమిటి? ఆయనో పిచ్చి తుగ్లక్ అంటూ విమర్శించారు. అంతేకాదు, ఆయన్ను కాల్చేయాలని కూడా కొందరు నోరుపారేసుకున్నారు. దాన్ని ఓటర్లు నమ్మారు.
చంద్రబాబు విశ్వరూపం(CBN Trend)
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 65శాతం రెవెన్యూ ఆంధ్రా, రాయసీమ నుంచి వచ్చేది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ప్రాంతం నుంచి కేవలం 35శాతం మాత్రమే రాబడి ఉండేది. స్వర్గీయ ఎన్టీఆర్ సీఎంగా పదవీచ్యుతుడి అయ్యే నాటికి ఉమ్మడి ఏపీ పూర్తిగా ఏపీ నుంచి వచ్చే ఆదాయం మీద ఆధారపడేది. ఆ తరువాత చంద్రబాబు (CBN Trend)ఉమ్మడి ఏపీ ఆదాయాలను మార్చేశారు. రెండోసారి ఆయన 1999 ఎన్నికల్లో గెలిచిన తరువాత సంస్కరణలను వేగవంతం చేశారు. హైదరాబాద్ ను ఏపీ రాజధానిగా ప్రపంచ పటంలో పెట్టడడమే కాదు, 2020 కల్లా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలపాలని విజన్ రచించారు. దాన్ని నిరసిస్తూ అప్పట్లో ఉన్న విపక్షాలు మూకుమ్మడిగా చంద్రబాబు మీద రాజకీయదాడికి దిగారు.
హైటెక్ సీఎం చంద్రబాబు అంటూ ముద్ర
విద్యుత్ సంస్కరణలను చేపట్టారు. ఐటీ సెక్టార్ ను ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఓట్ల రూపంలో చూస్తే పెద్దగా ఉపయోగంలేకపోయినప్పటికీ అప్పట్లో అన్ని రంగాల కంటే ఐటీ రంగానికి పెద్దపీఠ వేశారు. దీంతో వ్యవసాయరంగం కుంటుపడింది. గ్రామీణాభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి అంతా ఏపీ రాజధాని హైదరాబాద్ చుట్టూ పరుగుపెట్టింది. ఆ అభివృద్ధి అప్పట్లో కేవలం ఒకశాతం ప్రజలకు మాత్రమే ప్రత్యక్షంగా అందింది. దాన్ని ఆసరగా చేసుకుని చంద్రబాబు మీద విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. హైటెక్ సీఎం(CBN Trend) అంటూ ముద్రవేశారు. సామాన్యులకు అందుబాటులో ఆయన ప్రాధాన్యాలు ఉండవని ప్రచారం చేశారు. పిచ్చి తుగ్లక్ పరిపాలన చేస్తున్నారని ప్రజాక్షేత్రంలోకి విపక్షాలు వెళ్లాయి.
పేదల వ్యతిరేకి ముద్రను విజయవంతంగా విపక్షాలు వేయగలిగాయి.
ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న తొలి పదేళ్లలో ఎనిమిదేళ్లు కరువు తాండవించింది. అయినప్పటికీ పనికి ఆహారపథకం రూపంలో అందరికీ ఉపాథి కల్పించారు. వర్షాభావం ఉన్నప్పటికీ మంచినీళ్లను వీలున్నంత వరకు సరఫరా చేసేలా చూశారు. కానీ, విపక్షాల ప్రచారాన్ని సామాన్యులు నమ్మారు. యువత కూడా చంద్రబాబును (CBN Trend)ముందుచూపును అర్థం చేసుకోలేకపోయింది. సీన్ కట్ చేస్తే, 2004 ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓడిపోయింది. ఆనాటికి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఆదాయం సుమారు 55శాతం, ఏపీ ఆదాయం 45శాతంకు పడిపోయింది. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రబాబు అనుయాయులు భూములు కొనుగోలు చేసుకుని ధరలు పెంచుకోవడానికి అభివృద్ధి అంతా కేంద్రీకృతం చేశారని చిలువలుపలువలుగా ప్రచారం చేశారు. ఆయన పేదల వ్యతిరేకి ముద్రను విజయవంతంగా విపక్షాలు వేయగలిగాయి.
చంద్రబాబు ఆనాడు తయారు చేసిన విజన్ 2020 ఫలాలను (CBN Trend)
సీన్ కట్ చేస్తే, 25 ఏళ్ల తరువాత చంద్రబాబు ఆనాడు తయారు చేసిన విజన్ 2020 ఫలాలను చూస్తున్నాం. ఎకరం రూ. 100 కోట్ల పలుకుతుందని కేసీఆర్ గర్వంగా చెబుతోన్న దాని వెనుక చంద్రబాబు ముందుచూపు ఉంది. నిరంతరం విద్యుత్ సరఫరా, మంచినీళ్లు సరఫరా చంద్రబాబు (CBN Trend) విజన్ పుణ్యమే. ఆయన సీఎంగా ఉన్నప్పుడే కృష్ణా జలాలను నగరానికి మొదటి ఫేజ్ లో తీసుకొచ్చారు. రెండో ఫేజ్ మధ్యలో మూడో ఫేజ్ ప్రారంభం కాకముందే చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ తరువాత అవే ప్రాజెక్టులను కంటిన్యూ చేయడం ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ల కొరత తీరింది. ఇక చంద్రబాబు చేసిన విద్యుత్ సంస్కరణల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ ను అమ్ముకోవాలి. కానీ, ఇప్పటికీ కొనుగోలు చేస్తోంది.
Also Read : CBN Prediction : మంచిరోజులు!చంద్రబాబు ఆశాభావం!
వాస్తవాలను వక్రీకరించడం ద్వారా రాజకీయాల్లో గెలుపోటములను మార్చేయడానికి అవకాశం ఉంది. కానీ, చంద్రబాబు విజన్ 2020 ఫలాలు ప్రస్తుతం కళ్లెదుట కనిపిస్తున్నాయి. అందుకే, వాటిని చూసైనా అర్థం చేసుకోండని ఏపీ ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం ఆయన వంగివంగి దండం పెట్టి ఓట్లను అడిగారు. అయినప్పటికీ విజయవాడ, గుంటూరు పరిధిలోని ఓటర్లు కూడా చంద్రబాబును ఆదరించలేదు. ఎకరం రూ. 8లక్షల నుంచి రూ. 10లక్షల ఉండే భూమి ధర రూ. 10కోట్లకు పోయినప్పటికీ అక్కడి ప్రజలు చంద్రబాబు విజన్ ను తెలుసుకోలేకపోయారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు ప్రతిపక్షం చేసిన ప్రచారాన్ని నమ్మింది. చంద్రబాబు విజన్ గురించి ఆలోచించలేదు.
Also Read : Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్
ప్రాజెక్టుల పర్యటనలో ఉన్న చంద్రబాబు శ్రీకాకుళం వేదికగా ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆలోచనను అర్థం చేసుకోండని చెబుతున్నారు. అధికారపక్షంలోని దద్దమ్మలకు తన ఆలోచనను అర్థం చేసుకునే స్థాయిలేదని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం టీడీపీని ఈసారి గెలిపించాలని కోరారు. ఉద్యోగ కల్పన అంటే ఏమిటో చూపిస్థానని శపథం చేశారు. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తానని ప్రామిస్ చేస్తున్నారు. శారీరక శ్రమకు బదులుగా స్మార్ట్ గా సంపాదన పెంచుకోవడం ఎలా? అనేది నేర్పిస్తానని చెబుతున్నారు. సంపదను సృష్టిస్తూ పేదలకు పంచుతానని ప్రమాణం చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్రహించడానికి ఏడాదికి ప్రతి రైతుకు రూ. 20వేలు ఇస్తానని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఉండదని అప్రమత్తం చేస్తున్నారు. భావితరాలను గుర్తించుకుని ప్రజలు ముందుకు రావాలని కోరడం చంద్రబాబు ప్రసంగాల్లోని కొత్తదనం.