CBN Tour : `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` మ‌ళ్లీ మొద‌లు! తూ.గో జిల్లాకు చంద్ర‌బాబు!

చంద్ర‌బాబునాయుడు(CBN Tour) ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 06:24 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు(CBN Tour) ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఆ క్ర‌మంలో `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ రెండో విడ‌త‌కు సిద్ద‌మ‌య్యారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల‌కు బుధ‌వారం వెళ్ల‌నున్నారు. ఆయ‌న పర్యటనలో మునుప‌టి మాదిరిగా రోడ్ షోల‌ను(Road Shows) ఏర్పాటు చేశారు. జీవో నెంబ‌ర్ 1 అమ‌లులో ఉన్న క్ర‌మంలో గ‌తంలో మాదిరిగా జ‌నం వ‌స్తే పోలీస్ ఏం చేస్తారు? అనేది ప్ర‌శ్న‌.

`ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ రెండో విడ‌త‌ (CBN Tour)

`ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ కు పెద్ద సంఖ్య‌లో జనం వ‌చ్చిన నేప‌థ్యం ఉంది. మునుపెన్న‌డూ లేనివిధంగా చంద్ర‌బాబు(CBN Tours) స‌భ‌ల‌కు తండోప‌తండాలుగా జ‌నం రావ‌డాన్ని చూశాం. స్వ‌చ్ఛందంగా ప్ర‌జ‌లు రావడం టీడీపీకి సైతం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే, అక‌స్మాత్తుగా నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు కేంద్రంగా జ‌రిగిన ప్రోగ్రామ్ లో(Road Shows) తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ రెండు స‌భ‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌ర‌ణించారు. ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 1 ను జారీ చేసింది. దానిపై అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య న్యాయ పోరాటం జ‌రుగుతోంది.

Also Read : Target CBN : చంద్ర‌బాబు టార్గెట్ గా `GVL` వాయిస్! BRS,YCP కి పరోక్ష మేలు!

స్లీప‌ర్ సెల్స్ కార‌ణంగా తొక్కిస‌లాట జ‌రిగింద‌ని టీడీపీ భావిస్తోంది. వైసీపీ వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు(CBN Tours) స‌భ‌ల‌ను ఆపాల‌ని తొక్కిసలాట‌ను క్రియేట్ చేసింద‌ని విశ్వ‌సిస్తోంది. గ‌త నెలంతా తొక్కిస‌లాట మీద వైసీపీ, టీడీపీ మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జ‌రిగింది. జీవో నెంబ‌ర్ 1 జారీ చేసిన మ‌రుస‌టి రోజే కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు వెళ్లారు. అక్క‌డ పోలీసులు చంద్ర‌బాబును అడ్డుకున్నారు.ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా మూడు రోజుల పాటు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో(Road Shows) ప‌ర్య‌టించారు. అయితే, గ‌తంలో మాదిరిగా జ‌నం రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయిన‌ప్ప‌టికీ తండోప‌తండాలు ప్ర‌జ‌లు రావ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి అంతుచిక్క‌డంలేదు.

తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు

జీవో నెంబ‌ర్ 1 విడుద‌ల చేసిన త‌రువాత జ‌రిగిన కుప్పం త‌రువాత తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు చంద్ర‌బాబు(CBN Tour) వెళుతున్నారు. మూడు రోజుల పాటు అక్క‌డే రోడ్ షోల‌ను నిర్వ‌హిస్తారు. అయితే, పోలీసులు అడ్డుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఆ క్ర‌మంలో తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న ఉద్రిక్త‌త‌కు దారితీయ‌నుంది. పోలీసుల నుంచి వ‌చ్చే ప‌రిణామాల‌ను ముందుగా ఊహిస్తోన్న క్యాడ‌ర్ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా చంద్ర‌బాబుకు నీరాజ‌నాలు ప‌ల‌క‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : CBN Power : టీడీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం! ఆ నాలుగు కండీష‌న్లు అప్లై!!

ఒంగోలు కేంద్రంగా మ‌హానాడు నిర్వ‌హించిన‌ప్ప‌టి నుంచి స్వ‌చ్చంధంగా టీడీపీ స‌భ‌ల‌కు జ‌నం వ‌స్తున్నారు. ప‌లు జిల్లాల్లో చంద్ర‌బాబు మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించారు. ప్ర‌తి జిల్లాలోనూ మూడు రోజుల పాటు మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాది పొడ‌వునా జ‌ర‌ప‌డానికి చంద్ర‌బాబు (CBN Tours)  పిలుపు ఇచ్చిన క్ర‌మంలో మినీ మ‌హానాడులు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా కూడా జ‌నం పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఆ త‌రువాత బాదుడేబాదుడు కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించారు. ఆ స‌భ‌ల‌కు జ‌నం నుంచి సానుకూలం స్పంద‌న ల‌భించింది. ఆ తరువాత డిజైన్ చేసిన `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..` కార్య‌క్ర‌మం అనూహ్య విజ‌యాన్ని ప్రోగ్రామ్ ప్రారంభంలోనే అందుకుంది. అయితే, యాదృశ్చికంగా జ‌రిగిన తొక్కిస‌లాట ఆ ప్రోగ్రామ్ కు తాత్కాలిక బ్రేక్ వేసింది.

సింగిల్ జ‌డ్జి త్వ‌ర‌లోనే నివేదిక‌ను..

గుంటూరు, కందుకూరు స‌భ‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట(Road Shows) మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం విచార‌ణకు ఆదేశించింది. నెల రోజుల లోపు రిటైర్డ్ జ‌డ్జితో విచార‌ణ ముగించాల‌ని స‌ర్కార్ ప్లాన్ చేసింది. ఆ మేర‌కు సింగిల్ జ‌డ్జి త్వ‌ర‌లోనే నివేదిక‌ను అంద‌చేయ‌బోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఆపేసిన `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి…` ప్రోగ్రామ్ ను తిరిగి తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ప్రారంభించ‌బోతున్నారు. అందుకోసం టీడీపీ క్యాడ‌ర్ భారీ ఏర్పాట్లు చేస్తుండ‌గా, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏమి చేస్తుంది? అనేది చూడాలి.