CBN TDP : టార్గెట్ 160 దిశ‌గా చంద్ర‌బాబు, రీజిన‌ల్ ఎత్తుగ‌డ.!

రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను అనుకూలంగా మ‌లుచుకుంటూ చంద్ర‌బాబు(CBN TDP) దూకుడు పెంచారు.

  • Written By:
  • Publish Date - April 1, 2023 / 12:04 PM IST

ఏపీ రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌ను ఎప్ప‌టికప్పుడు అనుకూలంగా మ‌లుచుకుంటూ చంద్ర‌బాబు(CBN TDP) దూకుడు పెంచారు. ప్రాంతీయ స‌మావేశాల‌ను నిర్వ‌హించడానికి తాజాగా ప్లాన్ చేశారు. మూడు ప్రాంతాల‌ను ఆరు రీజియ‌న్ల‌గా(Regional meetings) విభ‌జిస్తూ ఈ భేటీల‌ను అక్క‌డ ఉండే లీడ‌ర్ల‌కు పెట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో కీల‌క‌ర స‌మావేశాల‌ను ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేస్తోన్న రాజ‌కీయా అడుగుల‌ను గ‌మినిస్తూ ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్న టాక్ బలంగా వినిపిస్తోంది. అక్టోబ‌ర్ ప్రాంతంలో అసెంబ్లీని ర‌ద్దు చేసి తెలంగాణ‌తో పాటు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్లాన్ చేస్తున్న‌ట్టు ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. అందుకే, చంద్ర‌బాబు ముంద‌స్తుగా పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు.

చంద్ర‌బాబు ప్రాంతీయ స‌మావేశాల‌ దూకుడు  (CBN TDP) 

రెండేళ్ల క్రిత‌మే చంద్ర‌బాబు (CBN TDP) ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు వ‌చ్చే అవకాశం ఉంద‌ని గ‌త ఏడాది ప్ర‌తి వేదిక‌పైనా చెప్పారు. అదే స‌మ‌యంలో ఏడాదికో, ఏడాదిన్న‌ర‌కో వ‌చ్చే ఎన్నిక‌లంటూ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి గ‌త ఏడాది మాట జారారు. దీంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని చాలా మంది విశ్వసించారు. ఆ మేర‌కు తెలుగుదేశం పార్టీ స‌న్న‌ద్ధం అవుతూ వ‌స్తోంది. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాన్ని గ‌త ఏడాది విజ‌య‌వంతం చేశారు. ఆ త‌రువాత చార్జిషీట్ ల‌ను మంత్రుల మీద విడుద‌ల చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల దందాల‌ను క‌ర‌ప‌త్రాల రూపంలో పంచారు. అధినేత చంద్ర‌బాబు మిని మ‌హానాడు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. చంద్ర‌బాబు స‌భ‌లు అనూహ్యంగా విజ‌య‌వంతం అయ్యాయి. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అడ్డుకునేలా ప్ర‌భుత్వం జీవోల‌ను తీసుకొచ్చింది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెం1 ప్ర‌కారం స‌భలు, స‌మావేశాల‌ను ముంద‌స్తు అనుమ‌తి లేకుండా పెట్ట‌కూడ‌దు. నిర్దేశిత ప్రాంతాల్లో పోలీసులు సూచించిన మేర‌కు జ‌నం ఉండాలి. ప‌లు కండీష‌న్ల మ‌ధ్య స‌భ‌ల‌ను నిర్వ‌హించే ప‌రిస్థితిని తీసుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న కుప్పం వెళ్లి స‌భ‌ల‌ను పెట్టారు. ఆ త‌రువాత ఒక‌టి రెండు చోట్ల స‌భ‌ల‌ను పెట్టిన‌ప్ప‌టికీ క్ర‌మంగా సైలెంట్ అయ్యారు. పార్టీ ఆఫీస్ లోనే ఉంటూ రివ్యూ మీటింగ్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు, పార్ల‌మెంట్ ఇంచార్జిల‌ను నియ‌మిస్తున్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ల‌కు ఎమ్మెల్యే స్థానాల‌ను ప్ర‌క‌టించారు. మ‌రికొన్ని చోట్ల ఇంచార్జిల‌ను మారుస్తున్నారు. ఇత‌ర పార్టీల వాళ్లు కూడా టీడీపీ వైపు చూసేలా చేయ‌డంలో చంద్ర‌బాబు విజ‌య‌వంతం అయ్యారు.

Also Read : YCP-CBN : జ‌గ‌న్ `స్వ‌ర‌`ల‌హ‌రి, టీడీపీ బ‌హుప‌రాక్‌!

ప్ర‌స్తుతం న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రో 40 మంది ట‌చ్ లో ఉన్నార‌ని టీడీపీ చెబుతోంది. సరిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న టీడీపీ ఇంచార్జిల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఒక వేళ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు టిక్కెట్ ఇస్తార‌న్న సందేహం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డానికి చంద్ర‌బాబు(CBN TDP) రీజిన‌ల్ స‌మావేశాల‌ను పెడుతున్నారు. ఆ స‌మావేశాల్లో దిశానిర్దేశం ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం నెలకొన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి స‌మాయాత్తం అయ్యారు. దానితో పాటు టిక్కెట్ల‌ను కూడా ముందుగా అన్ని చోట్ల ప్ర‌క‌టించ‌డంతో పాటు పొత్తు అంశంపై కూడా ప‌రోక్షంగా ఇవ్వ‌నున్నారు. కేవ‌లం 30 స్థానాల్లో మాత్ర‌మే నువ్వా? నేనా? అనే రీతిలో పోటీ ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. ఆ నియోజ‌క‌వ‌ర్గాలపై ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌నున్నారు. అందుకే, ఈ రీజిన‌ల్(Regional) స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు