Site icon HashtagU Telugu

CBN : వైసీపీకి షాకింగ్, ప్ర‌చారానికి ర‌జ‌నీకాంత్?

Cbn

Cbn

`అనుకున్న‌దొక్క‌టి..అయిన‌దొక్క‌టి..`అంటూ సినిమాలోని హిట్ సాంగ్‌. దాన్ని వైసీపీ నేత‌ల‌కు వ‌ర్తింప చేస్తే(CBN) ర‌జినీకాంత్ ఎపిసోడ్ కు అతికిన‌ట్టు స‌రిపోయేలా ఉంది. ఆ పార్టీని, జ‌గన్మోహ‌న్ రెడ్డి గురించిగానీ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కపోయిన‌ప్ప‌టికీ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) ను గ‌త వారం రోజులుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌తిగా త‌లైవా ఫ్యాన్స్ వైసీపీని టార్గెట్ చేసింది. ఇరు గ్రూపుల మ‌ధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ర‌జ‌నీకాంత్ వైసీపీకి షాక్ త‌గిలే సంకేతాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌చారానికి రోబో దిగుతుంద‌ని స‌మాచారం అందుకున్న వైసీపీ ఇప్పుడు సైలెంట్ అయింది.

ర‌జినీకాంత్ ఎపిసోడ్ వైసీపీ నేత‌ల‌కు..(CBN)

విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు ఏప్రిల్ 28న జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఆ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్(Rajanikanth) హాజ‌ర‌య్యారు. అక్క‌డ స్వ‌ర్గీయ నంద‌మూరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు (CBN) 2020 విజ‌న్ గురించి చెబుతూ హైద‌రాబాద్ అభివృద్ధిని ఉద‌హ‌రించారు. లేటెస్ట్ గా త‌యారు చేసిన విజ‌న్ 2047 సాకారం కావాలంటే చంద్ర‌బాబు అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న విలువ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల కంటే బ‌య‌ట వాళ్ల‌కు బాగా తెలుస‌ని అన్నారు. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద వైసీపీ ఆయ‌న్ను టార్గెట్ చేసింది.

వ్య‌క్తిగ‌త జీవితాన్ని అవ‌మాన‌ప‌రుస్తూ కామెంట్ల‌తో

రాజ‌కీయంగానే కాకుండా ర‌జ‌నీకాంత్ (Rajanikanth) వ్య‌క్తిగ‌త జీవితంలోకి కూడా వైసీపీ నేత‌లు వెళ్లారు. ఆయ‌న సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో వ‌చ్చిన గాసిప్స్ ను బ‌య‌ట‌కు తీశారు. సిల్క్ స్మిత ను కూడా ఆయ‌న సినీ జీవితంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచార‌ని ట్రోల్స్ వేగం పెంచారు. ఆనాడు వైస్రాయ్ హోట‌ల్ వేదిక‌గా చంద్ర‌బాబు(CBN) అండ్ టీమ్ తో ఉన్న ర‌జ‌నీకాంత్ ఫోటోను సోష‌ల్ మీడియాకు ఎక్కించారు. దాన్ని వైర‌ల్ చేస్తూ ర‌జ‌నీకాంత్ వ‌య‌స్సును, ఆకారాన్ని, వ్య‌క్తిగ‌త జీవితాన్ని అవ‌మాన‌ప‌రుస్తూ కామెంట్ల‌తో సోష‌ల్ మీడియాను ముంచేశారు. ఆ పార్టీ లీడ‌ర్ ల‌క్ష్మీపార్వ‌తి, రోజా, పోసాని ముర‌ళీకృష్ణ‌, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమ‌ర్నాథ్ అంద‌రూ మూకుమ్మ‌డిగా మీడియాకు ఎక్కారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పై వ్య‌క్తిత్వ హ‌న‌నం చేస్తూ గ‌తంలో ఆయ‌న చేసిన కొన్ని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌ను బ‌య‌ట‌కు లాగారు.

Also Read : Operation Balineni: CBN, PK భేటీ వెనుక ఆపరేషన్ ‘బాలినేని’..?

వారం నుంచి మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతోన్న ర‌చ్చ‌ను చూసిన టీడీపీ జాతీయ అధినేత చంద్ర‌బాబునాయుడు(CBN) మ‌న‌స్తాపం చెందారు. త‌న కార‌ణంగా ర‌జ‌నీకాంత్ ప‌లు ర‌కాల మాట‌లు ప‌డుతున్నార‌ని బాధ ప‌డ్డారు. ప‌లు ర‌కాలుగా జ‌రుగుతోన్న ర‌చ్చ కార‌ణంగా ర‌జనీకాంత్ (Rajanikanth) బాధ‌ప‌డుతుంటార‌ని ఫోన్ చేసి సారీ కూడా చెప్పారు. కానీ, ర‌జ‌నీ మాత్రం చాలా లైట్ గా తీసుకున్నాడ‌ట‌. అలాంటి కామెంట్ల‌ను అస‌లు ప‌ట్టించుకోన‌ని చంద్ర‌బాబుతో అన్నార‌ని తెలిసింది. అంతేకాదు, ఏపీ భ‌విష్యత్ కోసం రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి దిగుతాన‌ని సంకేతాలు కూడా ఇచ్చార‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. అదే జ‌రిగితే, దారిన పోయేదాన్ని క‌దిలించి త‌న్నించుకున్న చందంగా ర‌జ‌నీ రూపంలో వైసీపీకి డామేజ్ జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.

Also Read : NCBN : జగన్ బొమ్మ ఉండాల్సింది మన గోడలపై కాదు.. పోలీస్ స్టేషన్ లో.. ! – చంద్ర‌బాబు