Site icon HashtagU Telugu

CBN Strategy : `పొత్తు`పై చంద్ర‌బాబు సాము! BJPకి దూరంగా.!

CBN Strategy

Delhi Cbn

CBN Strategy : తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉంటుందా? ఎన్డీయేలోకి టీడీపీ వెళుతుందా? ఈ ప‌రిణామాలు టీడీపీకి లాభ‌మా? న‌ష్ట‌మా? అనే చ‌ర్చ స‌ర్వ‌త్రా న‌డుస్తోంది. కానీ, చంద్ర‌బాబు మాత్రం వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. దేశ రాజ‌కీయ ప‌రిణామాల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు. ఏపీ 20ఏళ్లు వెన‌క్కు పోయింద‌ని భావిస్తోన్న ఆయ‌న దాన్ని పూడ్చాలంటే కేంద్ర స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని కోరుకుంటున్నారు. అందుకే, బీజేపీతో పొత్తుకు సై అంటున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. కానీ, తెర వెనుక జ‌రుగుతోన్న రాజ‌కీయం (CBN Strategy) వేర‌ని చంద్ర‌బాబు కోట‌రీలోని టాక్‌.

తెర వెనుక జ‌రుగుతోన్న రాజ‌కీయం వేర‌ని చంద్ర‌బాబు(CBN Strategy) 

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కాంగ్రెస్, బీజేపీల‌కు  (CBN Strategy) స‌మ‌దూరాన్ని పాటిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ భాగ‌స్వామ్యం కావ‌డానికి ఆచితూచి అడుగు వేస్తున్నారు. కార‌ణం మైనార్టీల ఓటు బ్యాంకు ప్ర‌ధానం. ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీలు టీడీపీకి దూరంగా ఉంటారు. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌తో పాటు కోస్తాంధ్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో ముస్లిం ఓటు బ్యాంకు గెలుపోట‌ముల‌ను నిర్దేశించేలా ఉంది. ఇప్పుడిప్పుడే ముస్లిం ఓట‌ర్లు టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యార‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంట‌కాగుతున్నార‌ని ముస్లిం ఓట‌ర్ల‌లో అస‌హ‌నం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, ఆ ఓట‌ర్లు చంద్ర‌బాబు వైపు మ‌ళ్లార‌ని అంచ‌నా.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీలు టీడీపీకి దూరం

హిందూ ఓట‌ర్లు ఎలాగూ టీడీపీ వైపు ఎక్కువ‌గా ఉంటారు. క్రిస్టియ‌న్ గా ముద్ర‌ప‌డ్డ‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఈసారి హిందూ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు దూరం అయ్యార‌ని తెలుస్తోంది. అలాగ‌ని, బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప‌రిస్థితి లేదు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అందుకే, ఆ రెండు పార్టీల‌ను ఏపీ ఓట‌ర్ల ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభ‌జించ‌డం ద్వారా తుడిచిపెట్టుకు పోయింది. విభ‌జ‌న‌కు స‌హ‌కారం అందించిన బీజేపీ మీద కోపం ఉన్న‌ప్ప‌టికీ ఆదుకుంటుంద‌ని 2019 వ‌ర‌కు న‌మ్మారు. కానీ, 2014 నుంచి 2019 వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల క్ర‌మంలో బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌మ‌ని తెగేసి చెబుతోన్న బీజేపీ మీద వ్యతిరేక‌త బాగా ఉంది. దానితో పాటు ప‌దేళ్ల మోడీ పాల‌నపై వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. అందుకే, హిందూ ఓట‌ర్ల పోల‌రైజేష‌న్ టీడీపీ వైపు  (CBN Strategy) ఉంటుందని ఆ పార్టీ కోర్ టీమ్ వేస్తోన్న అంచ‌నా.

హిందూ ఓట‌ర్లు ఎలాగూ టీడీపీ వైపు ఎక్కువ‌గా

ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే న‌ష్టం భారీగా ఉంటుంద‌ని టీడీపీ భావిస్తోంది. అప్పుడు వైసీపీ లాభ‌ప‌డుతుంద‌ని స‌ర్వేల సారాంశం. ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా దాట‌వేస్తోన్న బీజేపీ మీద అన్ని వ‌ర్గాలు కోపంగా ఉన్నారు. పైగా పోల‌వ‌రం, లోటు బడ్జెట్‌, రాజ‌ధాని అమ‌రావ‌తి, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు నిధులు త‌దిత‌రాల విష‌యంలో జ‌రిగిన అన్యాయంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు అంటే కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్టే. అలాగ‌ని, ఆ పార్టీని కాద‌ని ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం క‌ష్టంగా టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. కేంద్రం స‌హ‌కారం లేకుండా జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఇబ్బందులు ప‌డింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ పెద్ద‌లకు అనుగుణంగా న‌డుస్తుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, బీజేపీతో పూర్తిగా తెంచుకోకుండా  (CBN Strategy) క‌థ న‌డ‌పాల‌ని చంద్ర‌బాబు యోచ‌న‌గా ఉంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : YCP Sketch : TDP,JSP మ‌ధ్య‌లో సాయిరెడ్డి `అగ్గి`

జాతీయ రాజ‌కీయాల్లో ఎన్డీయేకు పోటీగా ఇండియా కూట‌మి ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి క‌నీసం 120 మంది ఎంపీలు వ‌స్తే చాలు బ‌ల‌మైన కూట‌మి త‌యారు అవుతోంది. ఈసారి బీజేపీకి గ‌తంలో మాదిరిగా ఎంపీ స్థానాలు వ‌చ్చే ప‌రిస్థితులు లేవ‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, చంద్ర‌బాబు ఢిల్లీ రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ కేవీపీ రామ‌చంద్ర‌రావు కూడా పిలుపు ఇస్తున్నారు. అలాగే, రేణుకా చౌద‌రి కూడా చంద్ర‌బాబు జూలు విదిలించే టైమ్ ఇదేనంటూ చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఇండియా కూట‌మికి హెడ్ గా నితీష్ ఉన్నారు. ఆయ‌న అత్యంత స‌న్నిహితునిగా చంద్ర‌బాబుకు ఉంటార‌ని అంద‌రికీ తెలిసిందే. పైగా ఇద్ద‌రి మైండ్ సెట్ దాదాపుగా ఒకేలా రాజ‌కీయాల్లో ఉంటుంద‌ని ఢిల్లీలో గుర్తింపు. అందుకే, బీజేపీతో ఎన్నిక‌ల వ‌ర‌కు న్యూట్ర‌ల్ గా  (CBN Strategy) ఉంటూ ఆ త‌రువాత ప‌రిస్థితుల ఆధారంగా ఈక్వేష‌న్ల‌ను మార్చుకోవాల‌ని చంద్ర‌బాబు టీమ్ అభిప్రాయం.

Also Read : CBN Dilemma : ఢిల్లీ బీజేపీ డేంజ‌ర్ గేమ్ ! జ‌గ‌న్ కోసం ప‌వ‌న్ CM నినాదం!!

ప్ర‌త్యేక హోదాపై తొలి సంత‌కం చేస్తాన‌ని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వం ఢిల్లీ పీఠంపై వ‌స్తే, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఖాయం. అదే జ‌రిగితే, ఏపీ ప్ర‌గ‌తి దూకుడుగా వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే, రాష్ట్రం కోసం చంద్ర‌బాబు ఎన్నిక‌ల త‌రువాత ఎవ‌రితో పొత్తు అనేది చూద్దామ‌న్న‌ట్టు మౌనంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వాళ్ల‌తోనే అంటూ బీజేపీతో క‌లిసి న‌డుస్తున్నారు. అదే త‌ర‌హాలో టీడీపీ కూడా అడుగులు వేయాల‌ని భావిస్తోంది. ఎన్నిక‌లకు ముందుగా ఎన్డీయేతో క‌లిస్తే వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు కంటే రాజ‌కీయ న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌ని బ‌ల‌మైన వాద‌న టీడీపీలోని ఒక గ్రూపు వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీకి దూరంగా ఉండ‌డానికి చంద్ర‌బాబు మొగ్గుచూపుతున్నార‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని చ‌ర్చ.