CBN Social Media : పొత్తు కోసం చంద్ర‌బాబుపై ఐటీ ప్ర‌యోగం?

ఎన్నిక‌ల‌ త‌రుణంలో చంద్ర‌బాబును లోబ‌రుచుకోవ‌డానికి పన్నాగాల‌ను బీజేపీ ర‌చించింద‌ని సోష‌ల్ మీడియా(CBN Social Media)కోడైకూస్తోంది.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 01:59 PM IST

ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును లోబ‌రుచుకోవ‌డానికి పన్నాగాల‌ను బీజేపీ ర‌చించింద‌ని సోష‌ల్ మీడియా(CBN Social Media)కోడైకూస్తోంది. ఆదాయ‌ప‌న్నుల శాఖ‌(ఐటీ) చంద్ర‌బాబుకు నోటీసులు ఇవ్వ‌డం వెనుక రాజ‌కీయ డ్రామా చాలా ఉందని చెబుతోంది. పొత్తు దిశ‌గా అడుగులు వేస్తోన్న క్ర‌మంలో బీజేపీ తాను అనుకున్న విధంగా రాజ‌కీయాన్ని మ‌లుపు తిప్పుకోవ‌డానికి ప్లాన్ చేసింద‌ని వినికిడి. క‌నీసం 5లోక్ స‌భ‌, 10 అసెంబ్లీ స్థానాల‌ను ఆశిస్తోన్న బీజేపీ ఆ దిశ‌గా చంద్ర‌బాబును ఒప్పించ‌డానికి ఐటీశాఖ‌ను ప్ర‌యోగించింద‌ని టీడీపీ సోష‌ల్ వారియ‌ర్స్ పెడుతోన్న పోస్ట్ ల సారాంశం.

పొత్తు కోసం బీజేపీ ఐటీ ప్ర‌యోగం (CBN Social Media)

ఐటీశాఖ నుంచి నోటీసుల‌ను చంద్ర‌బాబు అందుకున్నారు. ఆయ‌న సీఎంగా ప‌నిచేసిన 2014 నుంచి 2019 మ‌ధ్య లావాదేవీలను త‌వ్వి తీసింది. అప్ప‌ట్లో కాంట్రాక్టుల కేటాయించిన సంద‌ర్భంలో ముడుపులు చేతులు మారాయ‌ని నిర్థారిస్తోంది. అవ‌న్నీ అక్ర‌మ ముడుపులుగా ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబుకు  చేరాయ‌ని నోటీసుల్లోని సారాంశం. లెక్క‌లు లేని ఫండ్స్ కింద ప‌రిగ‌ణిస్తూ నోటీసులు జారీ చేశారు. వాటికి స‌మాధానం ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు అండ్ టీమ్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదంతా పొలిటిక‌ల్ గేమ్ లో భాగంగా బీజేపీ చేస్తోన్న ప్ర‌క్రియ‌గా టీడీపీ వ‌ర్గీయులు భావిస్తూ సోష‌ల్ మీడియా (CBN Social Media ) వేదిక‌గా వాస్త‌వాల‌ను బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

చంద్ర‌బాబు కుటుంబీకులు ప్ర‌తి ఏడాది ఆస్తులు ప్ర‌క‌టిస్తున్నారు

వాస్త‌వంగా చంద్ర‌బాబు కుటుంబీకులు ప్ర‌తి ఏడాది ఆస్తులు, అంత‌స్తుల గురించి బ‌య‌ట‌పెడుతోంది. మీడియా ముఖంగా ప‌దేళ్లుగా ప్ర‌తి ఏడాది ఆస్తుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అంత‌కంటే , ఎక్కువ ఉన్నట్టు ఎవ‌రైనా చూపిస్తే, ఆస్తుల‌ను రాసిస్తామ‌ని కూడా ఛాలెంజ్ చేసిన (CBN Social Media ) సంద‌ర్భాలు అనేకం. అధినేత చంద్ర‌బాబు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్ తో పాటు భువ‌నేశ్వ‌రి, బ్ర‌హ్మ‌ణి, దేవాన్ష్ ఆస్తుల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. పార్టీలోని ఇత‌ర నాయ‌కులు కూడా ఆస్తుల‌ను ప్ర‌తి ఏడాది ప్ర‌క‌టించాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా ఎవ‌రూ చంద్ర‌బాబు పిలుపుకు స్పందించి ఆస్తుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఇక ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌లు చంద్ర‌బాబు ఛాలెంజ్ ను ఏనాడూ స్వీక‌రించ‌లేదు.

Also Read : TDP Manifesto: చంద్రబాబు దూకుడు.. దసరాకు టీడీపీ మేనిఫెస్టో!

ప్ర‌తి ఏడాది రాష్ట్రలో ఆడిట్ జ‌రుగుతోంది. ఆ సంద‌ర్భంగా కాంట్రాక్టులకు సంబంధించిన లావాదేవీలను కూడా ఆడిట్ చేయ‌డం జ‌రుగుతుంది. ఎప్పుడో ప‌దేళ్ల క్రితం జ‌రిగిన కాంట్రాక్టు ప‌నుల్లోని అవినీతి అంటూ ఐటీశాఖ నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న అధికారం కోల్పోయి కూడా నాలుగున్న‌రేళ్లు అవుతోంది. అప్ప‌టి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని అవినీతిని ఇప్పుడు ఐటీశాఖ గుర్తించ‌డం హైలెట్‌. ఆ మేర‌కు నోటీసులు జారీ చేయ‌డం కేంద్రంలోని పెద్ద‌లు చేసే పెత్తనం తాలూకూ ప్ర‌క్రియ‌కు నిద‌ర్శ‌నం. ప‌లు రాష్ట్రాల్లోనూ ఇదే త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్థి పార్టీల మీద సీబీఐ, ఐటీ, ఈడీల‌ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ వాటిని ప్ర‌త్యర్థి పార్టీలను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి ఉప‌యోగించారు. అదే విష‌యాన్ని కేసీఆర్ చెబుతూ వాషింగ్ పౌడ‌ర్ నిర్మా సూత్రం అంటూ చ‌మ‌త్క‌రించారు.

Also Read : CBN Happy : చంద్ర‌బాబుకు మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ జోష్

పొత్తుల కోసం కూడా కేంద్ర సంస్థ‌ల‌ను మోడీ అండ్ కో ప్ర‌యోగిస్తుంద‌న్న సోషల్ మీడియా పోస్ట్ లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఏపీలో బీజేపీకి ఒక శాతం ఓటు బ్యాంకు మాత్ర‌మే ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మునిగిపోతామ‌ని ఎవ‌రికి వారే ప్ర‌ధాన పార్టీల అధిప‌తులు దూరంగా ఉంటున్నారు. కానీ, ఏపీలో కింగ్ మేక‌ర్, తెలంగాణ‌లో కింగ్ కావాల‌ని బీజేపీ క‌ల‌లు కంటోంది. దానికి స్కెచ్ వేసిన బీజేపీ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఎలాగైనా టీడీపీతో పొత్తుపెట్టుకుని 5లోక్ స‌భ‌, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తుంద‌ట‌. ఇక డిసెంబ‌ర్లో ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ద్వారా తెలంగాణ‌లో రాజ్యాధికారం సాధించాల‌ని స్కెచ్ వేసింద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ప‌రోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టిందని తెలుస్తోంది. అందుకు స‌మ్మ‌తించ‌ని చంద్ర‌బాబు మీద ఇప్పుడు ఐటీ రూపంలో బీజేపీ బుస‌లు కొడుతుంద‌ని టాక్‌.