CBN Skill Development Case : ఏపీ హైకోర్టు లో జరిగిన వాదనలు…

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 04:28 PM IST

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case )లో చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబదించిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition) ఈరోజు ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), హరీష్ సాల్వేలు (Harish Salve) వాదించారు. మరి ఈ ఇద్దరూ ఏం వాదించారు..? ఎలా వాదించారు..? అనేది చూస్తే..

హరీశ్‌ సాల్వే(Harish Salve) వాదనలు చూస్తే.. అసలు ఈ ఫిర్యాదే ఓ అభూత కల్పనని హైకోర్టు న్యాయమూర్తి వద్దకు విన్నవించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఎ కింద తగిన అనుమతులు తీసుకోలేదు. ఈ ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధమైనది. గతంలో వచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్‌ జనరల్‌ తప్పుగా అన్వయించారు. సెక్షన్‌ 17ఎ పూర్తివివరాలు తెలిసి కూడా తప్పనిసరి అనుమతులను తీసుకోలేదు” అని వాదించారు.

ఇది కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలి. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు. హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీన్ని ప్రతీకారపూర్వక కేసుగానే పరిగణించాలి. ప్రాజెక్టులో 90శాతం ప్రైవేటు సంస్థ.. 10శాతం ప్రభుత్వం భరిస్తుంది. యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసుకు ప్రాతిపదికైన ప్రాజెక్టు రిపోర్టులు, వాటి విలువ మదింపు చేశారు. వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి” అని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హరీశ్‌ సాల్వే కోర్టుకు చదివి వినిపించారు.

Read Also : Minister Botsa Satyanarayana : చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త బాధ్య‌త ప్ర‌భుత్వానిదే – మంత్రి బొత్స‌

ఇక సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra) వాదనలు చూస్తే.. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు. కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. అవినీతి నిరోధక చట్టం క్రింద ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి. 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసినప్పుడు ఇలాగే జరిగింది. కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని లూథ్రా వాదించారు. ప్రస్తుతం కోర్ట్ లో ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వాదనలు విన్న కోర్ట్..తుది తీర్పు ఇవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈరోజు , రేపు తీర్పు వచ్చే ఛాన్స్ కనపడడం లేదు.