CBN Sankranthi : సంబురాలకు నారావారిప‌ల్లెకు నంద‌మూరి, నారా ఫ్యామిలీ

సంక్రాంతి సంబురాల‌కు నారావారిప‌ల్లె (CBN Sankranthi) ముస్తాబు అయింది.

  • Written By:
  • Updated On - January 13, 2023 / 05:17 PM IST

సంక్రాంతి సంబురాల‌కు నారావారిప‌ల్లె (CBN Sankranthi) ముస్తాబు అయింది. మూడేళ్ల త‌రువాత మ‌ళ్లీ ఆ గ్రామంలో పండుగ క‌ళ నెల‌కొంది. నంద‌మూరి, నారా(nara) కుటుంబాల పండుగ కోలాహ‌లం ప‌రిస‌ర గ్రామ ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షిస్తోంది. కొత్త అల్లుళ్లు, కోడ‌ళ్లు సంద‌డి చేస్తూ సంక్రాంతి పండుగ అంద‌రి లోగిళ్ల‌ను కాంతివంతంగా మార్చుతుంది. అలాంటి సంద‌డి నంద‌మూరి, నారా కుటుంబం త‌ర‌లి వెళ్ల‌డంతో నారావారిప‌ల్లెలో కనిపిస్తోంది. ఒక‌రోజు ముందుగానే బ్రాహ్మ‌ణి, లోకేష్‌, దేవాన్ష్‌, చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి (CBN Sankranthi)  గ్రామానికి చేరుకున్నారు. బాల‌క్రిష్ణ‌, వ‌సుంధ‌ర శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం బ‌య‌లుదేరి హైద‌రాబాద్ నుంచి నారావారిప‌ల్లెకు చేరుకున్నారు.

సంక్రాంతి సంబురాల‌కు నారావారిప‌ల్లె (CBN Sankranthi)

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లె(nara) నుంచి. తెలుగువారికి భోగి-సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. భోగి- సంక్రాంతి- కనుమ మూడు రోజుల సంక్రాంతి పండుగ తెలుగునాట పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలను పంచే అతి పెద్ద పండుగగా అభివ‌ర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ పల్లె సీమలకు తరలివచ్చి ఆత్మీయతను పంచుకునే విశిష్టమైన పండుగ అని చంద్రబాబు వెల్లడించారు.

Also Read : Makar Sankranthi: మకర సంక్రాంతి జనవరి14వ తేదీనా ? 15వ తేదీనా? శుభ ముహూర్తం, పూజా విధానాలివీ!

`సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ విదేశాల నుండి స్వగ్రామాలకు తరలి వస్తున్న ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మీరు గ్రామాభివృద్దికి ఇతోధికంగా సహాయం చేయాలని కోరుతున్నాను. ఈ పండగ సందర్భంగా ఆ దిశగా సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాను.”ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించాం. అందులో భాగంగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికాం. ఆర్థిక స్థోమత లేని వారి ఇంట్లో కూడా పండుగ శోభ కనిపించాలని సంక్రాంతి కానుకలు ఇచ్చాం.` అంటూ చంద్ర‌బాబు గుర్తు చేశారు.

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు

`ఒక్క సంక్రాంతికే కాదు. రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకి కూడా పండుగ కానుకలిచ్చాం. 1 కోటి 17 లక్షల కుటుంబాలకు సంక్రాంతి కానుక ఇచ్చాం. 12 లక్షల మందికి రంజాన్ కానుక, 18 లక్షల మందికి క్రిస్మస్ కానుకలు కూడా అందించాం. ఏడాదికి రూ.350 కోట్లు ఖర్చు చేసి పేదల ఇంట కూడా పండుగ సంతోషాన్ని నింపాం. ప్రభుత్వం ఇచ్చిన ఆ చిరు కానుకే పండగపూట పేదల మనసులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంటూ చంద్ర‌బాబు వివ‌రించారు. సంక్రాంతి అంటేనే సాగు, సౌభాగ్యాలకు పట్టం కట్టే పండుగ. రైతుల కృషి ఫలించి పంటలు ఇళ్లకు చేరే సంతోష సమయం. సాగు వ్యయం తగ్గించి, పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే అన్నదాతకు అసలైన సంక్రాంతి అని భావించాం. నాటి ప్రభుత్వంలో 58.29 లక్షల మంది రైతులకు రూ. 15,279 కోట్ల రుణమాఫీ చేసినా, అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చినా, పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అమలు చేసినా వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే మా ఆలోచన. రైతు రథం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీలతో రైతన్నలకు తోడుగా నిలిచాం.

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నాటి ఆ స్ఫూర్తి మళ్ళీ తెలుగువారిలో కలగాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుంటేనే నిజమైన పండుగ అనే సిద్ధాంతాన్ని నమ్మి రాష్ట్రాభివృద్దిలో మీరంతా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ…తెలుగు ప్రజలందరికీ మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను” అని చంద్రబాబు తన ప్రకటనలో తెలిపారు.

Also Read : Sankranthi:సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తున్న బాలయ్య