Site icon HashtagU Telugu

CBN Rally : చంద్ర‌బాబు పాద‌యాత్ర‌, 12న`రైతు పోరుబాట‌`

Cbn Rally

Cbn Rally

గ‌త వారం మాజీ సీఎం చంద్ర‌బాబు (CBN Rally) ఇచ్చిన 72 గంట‌ల అల్టిమేటంకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) స‌ర్కార్ కొంత మేర‌కు దిగొచ్చింది. వ‌రి ధాన్యం కొనుగోలు, బ‌స్తాల‌ను ఇవ్వ‌డం త‌దిత‌ర ప్రాథ‌మిక ప‌నుల‌ను చేప‌ట్టింది. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా త‌డిసిన ధాన్యం కొనుగోలుకు ముందుకొచ్చింది. కానీ, బీమా ఇవ్వ‌డానికి ముందుకు రాలేదు. అంతేకాదు, త‌డిసిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ శాస్త్రీయ‌బ‌ద్ధంలేదు. ఆ రెండు డిమాండ్ల‌తో ఈనెల 12వ తేదీన చంద్ర‌బాబు `రైతు కోసం పోరుబాట‌`కు  దిగుతున్నారు. వాస్త‌వంగా 13వ తేదీన దీక్ష‌కు దిగాల‌ని అనుకున్నారు. అయితే, ప్ర‌భుత్వం కొంత మేర‌కు స్పందించ‌డంతో పోరుబాట‌ను టీడీపీ ఎంచుకుంది.

ఈనెల 12వ తేదీన చంద్ర‌బాబు `రైతు కోసం పోరుబాట‌`(CBN Rally)

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో 12వ తేదీ రైతులతో భారీ నిర‌స‌న‌కు మాజీ సీఎం చంద్ర‌బాబు(CBN Rally) దిగుతున్నారు. ఆ నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర రైతుల‌తో క‌లిసి పాదయాత్రకు పూనుకున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల మీదుగా పాద‌యాత్ర సాగ‌నుంది. అందుకోసం ఆయ‌న 11వ‌ తేదీ సాయంత్రం ఉండవల్లి నుంచి తణుకు వెళ్లేలా షెడ్యూల్ చేసుకున్నారు. పెద్ద సంఖ్య‌ల‌తో రైతులు క‌దిలి రానున్నారు. సుమారు 3ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట న‌ష్టం వాటిల్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ఒక‌రిద్ద‌రు వెళ్లిన‌ప్ప‌టికీ మంత్రి నాగేశ్వ‌ర‌రావు`ఎర్రిపప్ప‌` అంటూ రైతుల‌ను దూషించడంతో దుమారం రేగింది.

తణుకు నియోజకవర్గంలో భారీ నిర‌స‌న‌ 

వాస్త‌వంగా ఈ నెల 4,5,6 తేదీల్లో చంద్ర‌బాబు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేశారు. ఆ సంద‌ర్భంగా అపారంగా న‌ష్ట‌పోయిన రైతుల బాధ‌ను చూసి చ‌లించిపోయారు. అందుకే, ప్ర‌భుత్వానికి 72 గంట‌ల అల్టిమేటం ఇచ్చారు. అప్ర‌మ‌త్తమైన ప్ర‌భుత్వం గోతాల‌ను ఇవ్వ‌డం, రైతుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం ప్రారంభించింది. స‌చివాల‌యంలో రివ్యూ మీటింగ్ పెట్టిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) రైతుల‌ను ఆదుకునేలా డైరెక్ష‌న్స్ యంత్రాంగానికి ఇచ్చారు. దీంతో ఈనెల 9వ తేదీన త‌ల‌పెట్టిన టీడీపీ కార్యాక్ర‌మాన్ని వాయిదా వేసుకున్నారు. అంతేకాదు, ఈనెల 13వ తేదీ దీక్ష‌ను మార్పు చేస్తూ ఈనెల 12వ తేదీన రైతు పోరుబాట పేరుతో పాద‌యాత్ర‌కు మాజీ సీఎం చంద్ర‌బాబు(CBN Rally) ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా టిడీపీ ఇచ్చిన పిలుపుకు భారీ స్థాయిలో రైతులు పోరుబాట‌కు క‌దిలి రానున్నారు.

12 కిలోమీటర్ల చంద్ర‌బాబు పాద‌యాత్ర‌ (CBN Rally)

త‌డిసిన ధాన్యంకు నూక వ‌స్తుంద‌ని చెబుతూ రైతుల నుంచి మిల్ల‌ర్లు డబ్బులు వ‌సూలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసి పంపిన ధాన్యం నుంచి 5 కేజీలు తరుగును మిల్ల‌ర్లు తీసేస్తున్నారు. ఇలా ప‌లు ర‌కాలుగా బ‌స్తాకు రూ. 300 రూపాయాలు రైతు న‌ష్ట‌పోతున్నాడు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు(CBN Rally) వ‌ద్ద రైతులు చెప్పుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. అంతేకాదు, ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది. కనీసం గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. రంద్రాలు పడ్డ గోతాలు ఇవ్వడం వల్ల కూడా రైతులు నష్టపోయారు.

Also Read : CBN – PK : గోదా`వ‌రి`లో `వారాహి` సైకిల్

రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు. వాళ్ల‌లో ఎక్కువ‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులు ఉంటారు. పొలంలో పంట ఉంటేనే పరిహారం ఇస్తామని ప్ర‌భుత్వం చెబుతోంది. ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల భారీన పడేది కాదు. ఈ సమస్యకు కారణం సిఎం జగన్ రెడ్డి (Jagan) అంటూ చంద్ర‌బాబు ఇటీవ‌ల గోదావ‌రి జిల్లాకు వెళ్లిన సంద‌ర్భంగా ఆరోపించారు. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు .

 Also Read : CBN Plan : మోడీతో బాల‌య్య భేటీ? భార‌త ర‌త్న, పొత్తు ఎజెండా!

పంట బీమా సొమ్ము ప్ర‌భుత్వం స‌కాలంలో చెల్లించ‌లేదు. ఫ‌లితంగా ప‌రిహారం వ‌స్తుందా? రాదా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈనెల 12వ తేదీన చంద్ర‌బాబు(CBN Rally) రైతుపోరు బాట‌కు దిగుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి పంట బీమా విష‌యంలో స్ప‌ష్ట‌మైన వైఖ‌రి తెలియ‌చేయాల‌ని డిమాండ్ చేస్తూ చంద్ర‌బాబు ఈ పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స‌గ‌టును ఉత్ప‌త్తి అవుతోంది. దానిలో 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉంది. ఇంటికొచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారని, మిగిలిన పంట కల్లాల్లోనే ఉందని చంద్ర‌బాబు గత వారం చేసిన పర్యటనలో తేల్చారు. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కావాల‌ని కోరుతూ పోరుబాట ప‌ట్టారు చంద్ర‌బాబు.

ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి…

ప్ర‌తి వారం ఏదో ఒక జిల్లాలో `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్నారు. ఈసారి పెందుర్తి, అనకాపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో మే 16, 17, 18 తేదీల్లో ఆ ప్రోగ్రామ్ ను నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. అక్క‌డ కూడా రైతు స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న గళం విప్ప‌నున్నారు.