CBN Projects Heat : రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల వ‌ద్ద చంద్ర‌బాబు హీట్‌

ప్రాజెక్టుల బాట ప‌ట్టిన చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ వ్యాప్తంగా రాజ‌కీయాన్ని (CBN Projects Heat) హీటెక్కించారు. ఒక‌టో తేదీ నుంచిసంద‌ర్శించ‌నున్నారు.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 04:15 PM IST

ప్రాజెక్టుల బాట ప‌ట్టిన చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ వ్యాప్తంగా రాజ‌కీయాన్ని (CBN Projects Heat) హీటెక్కించారు. ఆయ‌న ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి ప‌ది రోజుల పాటు ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించ‌నున్నారు. అక్క‌డే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద స‌మీక్షిస్తారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్ర‌ణాళిక‌ను టీడీపీ విడుద‌ల చేసింది. దీంతో రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల వ‌ద్ద‌కు వెళుతున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. రాయ‌ల‌సీమ‌కు ద్రోహిగా చంద్ర‌బాబును చిత్రీక‌రిస్తూ, అడ్డుకునే ప్ర‌య‌త్నం వైసీపీ చేస్తోంది. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వార్ షురూ కానుంది.

చంద్రబాబు అడుగుపెడితే క్షామంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి (CBN Projects Heat)

క్షేమంగా ఉన్న అనంతపురం జిల్లాలో చంద్రబాబు అడుగుపెడితే క్షామం వస్తుందంటూ వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి (CBN Projects Heat) సెంట‌మెంట్ ను రేకెత్తిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాయలసీమలోని ప్రాజెక్టుల పరిశీలనకు రానున్న చంద్రబాబు మూడో తారీఖు ఉమ్మడి అనంతపురం జిల్లాలో బైరవానితిప్పే, హంద్రీనీవా కాలువ, పేరూరు డ్యామ్, కియా పరిశ్రమల వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే వర్షం ప‌డ‌ద‌ని సెంటిమెంట్ ను రాజేస్తున్నారు ప్ర‌కాష్ రెడ్డి. అనంతపురం జిల్లాకు రావద్దంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో చంద్రబాబు పర్యటన పొలిటికల్ హీట్ పెంచింది.

Also Read : Priya Fix TDP : మాజీ మంత్రుల గుట్టుర‌ట్టు 

చంద్రబాబు రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పోలీసులు చంద్రబాబు పర్యటన వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆయన పర్యటించే ప్రాంతాల రూట్ మ్యాప్, తదితర వివరాలను పరిశీలించిన పోలీసులు తదుపరి చర్యలు, బందోబస్తుకు ప్లాన్ (CBN Projects Heat) చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే రాయ‌లసీమ ద్రోహి జ‌గ‌న్ అంటూ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చారు చంద్ర‌బాబు. దాని కొన‌సాగింపుగా క్షేత్ర‌స్థాయికి వెళుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ల‌క్ష్యం చేసిన జ‌గ‌న్ కార‌ణంగా రాయ‌ల‌సీమ ఎడారిగా మారింద‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్నారు. ఆ విష‌యాన్ని ప్రాజెక్టుల వ‌ద్ద‌కు వెళ్లి చెబితే, సామాన్యులు మ‌రింత లోతుగా ఆలోచిస్తార‌ని చంద్ర‌బాబు ఈ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు.

అనంతపురం జిల్లా పోలీసులు చంద్రబాబు పర్యటన వివరాలు

ఏపీ అభివృద్ధి గురించి చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టి వ‌ర‌కు భావోద్వేగాల‌తో రాజ‌కీయాన్ని వైసీపీ న‌డుపుతూ వ‌చ్చింది. దాన్ని అధిగ‌మించ‌డానికి చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఆధునిక దేవాయాలుగా చెప్పుకునే ప్రాజెక్టుల సంద‌ర్శ‌నకు ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల నుంచి.(CBN Projects Heat) ప్రారంభించి ఉత్త‌రాంధ్ర‌లోని వంశధార ప్రాజెక్టు వ‌ర‌కు సంద‌ర్శించ‌నున్నారు. ప్ర‌తి రోజూ ప్రాజెక్టుల వ‌ద్ద ప‌ది రోజుల పాటు ప‌డుకోనున్నారు. సామాన్యుల‌కు సైతం అర్థ‌మ‌య్యేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Also Read : Political Proffessor CBN : రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ టైటిల్ తో చంద్ర‌బాబు `PPT`

గ‌త నాలుగు రోజులుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా చంద్ర‌బాబు ప్రాజెక్టులపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌ట్టారు. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన ఖ‌ర్చును తెలియ‌చేస్తూ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌ర్కార్ ప్రాజెక్టుల‌కు ఖ‌ర్చు పెట్టిన నిధుల గురించి చెప్పారు. తొలి రోజు రాయ‌లసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల  (CBN Projects Heat)నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌ట్టారు. రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ అనే టైటిల్ తో ఆ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ప్ర‌జ‌ల్లోకి ఆయ‌న చెప్పిన లెక్క‌లు బ‌లంగా వెళ్లాయి.

ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా ప్రాజెక్టులపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యాన్ని (CBN Projects Heat)

రెండో రోజు కోస్తా ఆంధ్రా ప్రాజెక్టుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టారు. ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌కుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అప్పుల గురించి కూడా చెప్పారు. ప‌ట్టిసీమ‌తో స‌హా ఇప్పుడున్న ప్ర‌భుత్వం మూల‌న‌ప‌డేసింద‌ని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో చేసిన ఖ‌ర్చుతో పోల్చుకుంటే క‌నీసం స‌గం కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్రాజెక్టుల కోసం ఖ‌ర్చు చేయ‌లేదు. ఇక పోల‌వ‌రం శ‌ని జ‌గ‌న్ అంటూ మూడోరోజు వివ‌రించారు. ఆ ప్రాజెక్టు ఏపీ రాష్ట్రానికి జీవ‌నాడి. అయిన‌ప్ప‌టికీ దానిపై జ‌గ‌న్ నిర్ల‌క్ష్యాన్ని  (CBN Projects Heat)ఎండ‌గట్టారు.

Also Read : CBN Hitech Publicity : LED వాహ‌నాల‌తో ప‌ల్లెకు చంద్ర‌బాబు ప్ర‌జెంటేష‌న్లు

జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం ఉంది. దానికి నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అంద‌చేస్తోంది. సుమారు 70శాతం వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు పూర్తి చేసింది. ఆ త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ 2001 నాటికి పూర్తి చేస్తామ‌ని తొలుత చెప్పింది. ఆ రోజు ఇరిగేష‌న్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ అసెంబ్లీలోనూ అధికారికంగా చెప్పారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా పోల‌వ‌రం 2022 నాటికి. పూర్తి చేస్తామ‌ని అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేశారు. సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడున్న మంత్రి అంబ‌టి రాంబాబు మాత్రం టైమ్ (CBN Projects Heat) చెప్ప‌లేమ‌ని అంటున్నారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నామ‌ని రివ‌ర్స్ అటాక్ చేస్తున్నారు.

చంద్ర‌బాబు ప‌ది రోజుల పాటు ప్రాజెక్టుల బాట

ప్ర‌స్తుతం ఉన్న ప్రభుత్వం పోల‌వ‌రం విష‌యంలో చేసిన త‌ప్పులను చంద్ర‌బాబు ప్ర‌జెంట్ చేశారు. టీవీల్లో సామాన్యులకు అర్థ‌మ‌య్యేలా వివ‌రించారు. గ‌తం కంటే 5 అడుగుల ఎత్తును త‌గ్గిస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జ‌ర‌గ‌డంలేదు. పైగా ఆ ప్రాజెక్టును చూసేందుకు ఎవ‌రూ వెళ్ల‌కుండా ఆ ప్రాంతంలో నిషేధాన్ని విధించారు. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా ఆ ప్రాజెక్టును సంద‌ర్శించ‌డానికి ఆర్టీసీ బ‌స్సుల‌ను వేశారు. ఇప్పుడంతా రివ‌ర్స్ గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌ను సామాన్యుల సైతం అర్థం చేసుకునేలా చంద్ర‌బాబు ప‌ది రోజుల పాటు ప్రాజెక్టుల బాట ప‌ట్టారు. ఆ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. ప్ర‌తిగా వైసీపీ క్యాడ‌ర్ (CBN Projects Heat) మోహ‌రించింది. ఆయ‌న ప‌ర్య‌ట‌న అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. పోలీసులు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకున్నారు.