ఏపీ అభివృద్ధి గురించి (CBN Projects) చర్చ జరగకుండా ఇప్పటి వరకు భావోద్వేగాలతో రాజకీయాన్ని వైసీపీ నడుపుతూ వచ్చింది. దాన్ని అధిగమించడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆధునిక దేవాయాలుగా చెప్పుకునే ప్రాజెక్టుల సందర్శనకు ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు పెన్నా నుంచి వంశధార ప్రాజెక్టు వరకు సందర్శించనున్నారు. ప్రతి రోజూ ప్రాజెక్టుల వద్ద పది రోజుల పాటు పడుకోనున్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు ప్రోగ్రామ్ డిజైన్(CBN Projects)
గత నాలుగు రోజులుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు (CBN Projects) ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఆధారాలతో సహా బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఖర్చును తెలియచేస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన నిధుల గురించి చెప్పారు. తొలి రోజు రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రాయలసీమద్రోహి జగన్ అనే టైటిల్ తో ఆ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి ఆయన చెప్పిన లెక్కలు బలంగా వెళ్లాయి.
ప్రాజెక్టులను పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి
రెండో రోజు కోస్తా ఆంధ్రా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను చంద్రబాబు (CBN Projects)బయటపెట్టారు. ప్రాజెక్టులను పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి కూడా చెప్పారు. పట్టిసీమతో సహా ఇప్పుడున్న ప్రభుత్వం మూలనపడేసిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన ఖర్చుతో పోల్చుకుంటే కనీసం సగం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. ఇక పోలవరం శని జగన్ అంటూ మూడోరోజు వివరించారు. ఆ ప్రాజెక్టు ఏపీ రాష్ట్రానికి జీవనాడి. అయినప్పటికీ దానిపై జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
Also Read : CBN Hitech Publicity : LED వాహనాలతో పల్లెకు చంద్రబాబు ప్రజెంటేషన్లు
జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఉంది. దానికి నిధులను కేంద్ర ప్రభుత్వం అందచేస్తోంది. సుమారు 70శాతం వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ 2001 నాటికి పూర్తి చేస్తామని తొలుత చెప్పింది. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ అసెంబ్లీలోనూ అధికారికంగా చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పోలవరం 2022 నాటికి. పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేశారు. సీన్ కట్ చేస్తే, ఇప్పుడున్న మంత్రి అంబటి రాంబాబు మాత్రం టైమ్ చెప్పలేమని అంటున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని (CBN Projects)రివర్స్ అటాక్ చేస్తున్నారు.
Also Read : CBN America Style : చంద్రబాబు అమెరికా తరహా ఎన్నికల ప్రచారం
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోలవరం విషయంలో చేసిన తప్పులను చంద్రబాబు ప్రజెంట్ చేశారు. టీవీల్లో సామాన్యులకు అర్థమయ్యేలా వివరించారు. గతం కంటే 5 అడుగుల ఎత్తును తగ్గిస్తూ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరగడంలేదు. పైగా ఆ ప్రాజెక్టును చూసేందుకు ఎవరూ వెళ్లకుండా ఆ ప్రాంతంలో నిషేధాన్ని విధించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఆ ప్రాజెక్టును సందర్శించడానికి ఆర్టీసీ బస్సులను వేశారు. ఇప్పుడంతా రివర్స్ గా ఉంది. ఇలాంటి పరిస్థితులను సామాన్యుల సైతం అర్థం చేసుకునేలా చంద్రబాబు (CBN Projects) పది రోజుల పాటు ప్రాజెక్టుల బాట పట్టారు.