Site icon HashtagU Telugu

CBN Project Fight : చంద్ర‌బాబు యుద్ధ‌భేరి!పెద్దిరెడ్డి సై!!

Cbn Projects Fight

Cbn Projects Fight

చంద్ర‌బాబు ప్రాజెక్టుల సంద‌ర్శ‌న హింసాత్మ‌కంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని వైసీపీ వ్యూహాత్మ‌కంగా బ‌య‌ట‌కు తీసుకొస్తోంది. పుంగనూరు బైపాస్ వ‌ద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌రం రాళ్ల‌దాడికి దిగారు. ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టేందుకు లాఠీ చార్జి చేశారు. ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. టియ‌ర్ గ్యాస్ ను ప్ర‌యోగించారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్ని ఘ‌ర్ష‌ణ ఎటువైపు దారితీస్తుందోన‌న్న ఆందోళ‌న కొన‌సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Project Fight) చిత్తూరు జిల్లా ఎప్పుడు వెళ్లినా ఇటీవ‌ల టెన్ష‌న్ నెల‌కొంటోంది. వై నాట్ 175 అంటూ వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ పెట్టారు. ఆ క్ర‌మంలో కుప్పం మీద ప్ర‌త్యేకంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి క‌న్నేశారు. ఆయ‌న వ‌ర్గీయులు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నను అడ్డుకునే ప్ర‌య‌త్నం ప‌లుమార్లు చేశారు. కొన్ని సంద‌ర్భాల్లో వాళ్లే జూనియ‌ర్ ఫ్లెక్సీల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా గంద‌ర‌గోళాన్ని సృష్టించారు. తాజాగా ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు యుద్ధ‌భేరి పేరుతో వెళ్లిన చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై పెద్దిరెడ్డి వ‌ర్గీయుల తిరుగుబాటు మొద‌లైయింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు (CBN Project Fight)

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు చంద్ర‌బాబు  (CBN Project Fight) నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఆ క్ర‌మంలో శుక్ర‌వారం చిత్తూరు జిల్లా పుంగ‌నూరుకు వెళ్లారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అడ్డాగా ఉంది. అక్క‌డికి రాకుండా చంద్ర‌బాబును అడ్డుకునే ప్ర‌య‌త్నం వైసీపీ శ్రేణులు చేయ‌డం వివాదానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల‌కు చంద్ర‌బాబు వెళ్లారు. అక్క‌డి ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌తలు స్వీక‌రించిన త‌రువాత చేసిన నిర్ల‌క్ష్యాన్ని ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌తిగా స్థానిక వైసీపీ లీడ‌ర్లు మీడియా వేదిక‌గా చంద్రబాబుకు కౌంట‌ర్ ఇస్తూ మాట్లాడారు.

పెద్దిరెడ్డి ఇలాఖాలో అడుగుపెట్టిన చంద్ర‌బాబు

ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ర్య‌ట‌న చిత్తూరు జిల్లా పుంగ‌నూరుకు చేరుకుంది. అక్క‌డి ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించ‌డంతో పాటు బ‌హిరంగ స‌భ పెట్టేందుకు టీడీపీ షెడ్యూల్ చేసింది. ఆ మేర‌కు రెండు రోజుల చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. అయితే, వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు మోహ‌రించారు.ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు వెళ్లే మార్గం వెంట వైసీపీ శ్రేణులు మోహ‌రించార‌ని స‌మాచారం అందుకున్న టీడీపీ క్యాడ‌ర్ ఆగ్ర‌హిస్తోంది. అధినేత చంద్ర‌బాబును ప్రాజ‌క్టుల (CBN Project Fight) వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డానికి మార్గాన్ని సుగ‌మం చేస్తోంది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య పోలీసులు స‌యోధ్య కుదుర్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Also Read : CBN Projects Heat : రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల వ‌ద్ద చంద్ర‌బాబు హీట్‌

వాస్త‌వంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు తిరుప‌తి యూనివ‌ర్సిటీ బ్యాచ్ మేట్స్. అప్ప‌టి నుంచి రాజ‌కీయ రైవ‌ల్స్ గా ఉన్నారు. యూనివ‌ర్సిటీ ఎన్నిక‌ల్లోనూ ఇద్ద‌రూ ఎత్తుగ‌డ‌లు వేసుకునే వాళ్లు. అప్ప‌టి నుంచి రాజ‌కీయ వైరం ఇద్ద‌రి మ‌ధ్యా ఉంది. అయితే, స్వ‌ర్గీయ వైఎస్ హ‌యాంలో పెద్దిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. దీంతో చంద్ర‌బాబు మీద ఎప్పుడూ పైచేయి సాధించ‌లేక‌పోయారు. కానీ, సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఫుల్ ప‌వ‌ర్స్ పెద్దిరెడ్డికి ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు మీద పైచేయిగా సాధించ‌డానికి ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ పోటీప‌డుతున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి చంద్ర‌బాబును ఓడించ‌డానికి పెద్దిరెడ్డికి బ్లూ ప్రింట్ వైసీపీ ఇచ్చింది.

Also Read : Political Proffessor CBN : రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ టైటిల్ తో చంద్ర‌బాబు `PPT`

రాజ‌కీయాల్లో 40ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు కూడా పులివెందుల మీద క‌న్నేశారు. అక్క‌డ నుంచి పోటీచేసే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఈసారి ఓడించాల‌ని ప్లాన్ చేశారు. ఆ క్ర‌మంలో త‌ర‌చూ పులివెందుల ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. అక్క‌డ బుధ‌వారం జ‌రిగిన మీటింగ్ కు పెద్ద సంఖ్య‌లో జ‌నం హాజ‌రు అయ్యారు. దాన్ని చూసిన టీడీపీ శ్రేణులు ఈసారి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే త‌ర‌హాలో వైసీపీ కూడా కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని టార్గెట్ చేసింది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖాలో అడుగుపెట్టిన చంద్ర‌బాబును అడ్డుకునే ప్ర‌య‌త్నం వైసీపీ చేయ‌డం గమనార్హం.