CBN Power : టీడీపీ అధికారంలోకి రావ‌డం ఖాయం! ఆ నాలుగు కండీష‌న్లు అప్లై!!

స్వ‌యంకృతాపరాధం చేసుకుంటే త‌ప్ప టీడీపీ (CBN Power) ఏపీలో గెలుస్తుంద‌ని స‌ర్వేలు సూచిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - February 11, 2023 / 03:26 PM IST

స్వ‌యంకృతాపరాధం చేసుకుంటే త‌ప్ప టీడీపీ (CBN Power) ఏపీలో గెలుస్తుంద‌ని స‌ర్వేలు ఏక‌ప‌క్షంగా సూచిస్తున్నాయి. ఆ పార్టీ చేసే త‌ప్పుల‌ను కూడా స‌ర్వే సంస్త‌లు ఉటంకిస్తున్నాయి. వాటిలో ప్ర‌ధానంగా టిక్కెట్లు ఇచ్చే క్ర‌మంలో డ‌బ్బుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం. తెలుగుదేశం పార్టీ (TDP)అధికారంలోకి వ‌స్తుంద‌ని అధికారులు, అన‌ధికారుల్లోకి బ‌లంగా వెళ్లింది. దీంతో ఆశావ‌హుల సంఖ్య పెరిగింది. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు ఇంటికి క్యూ క‌డుతున్నారు. అయితే, గెలిచే అభ్య‌ర్థుల‌కు కాకుండా పార్టీ విరాళం భారీగా ఇచ్చే వాళ్ల వైపు టీడీపీ అధిష్టానం మొగ్గుచూతుంద‌ని స‌మాచారం. స‌రిగ్గా ఇక్క‌డే టీడీపీ విజ‌యాన్ని స‌ర్వే సంస్థ‌లు పాయింటౌట్ చేయ‌డం సీరియ‌స్ అంశంగా క‌నిపిస్తోంది.

స్వ‌యంకృతాపరాధం చేసుకుంటే త‌ప్ప టీడీపీ ఏపీలో గెలుస్తుంద‌ని స‌ర్వేలు..(CBN Power) 

మ‌రో అంశం బీజేపీ పొత్తు. టీడీపీ అధినేత(CBN Power) గ‌త కొంత కాలంగా బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఆప‌న్న‌హ‌స్తం అందిస్తే చాల‌న్న‌ట్టు భావిస్తున్నారు. ఆ విష‌యం మీడియాలో బాగా ఫోక‌స్ అయింది. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం చంద్ర‌బాబు త‌ప్పుచేసిన‌ట్టేన‌ని స‌ర్వేల సారాంశం. ప్ర‌త్యేకించి ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో భారీగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రైవేటీక‌రించ‌డానికి బీజేపీ ముందుకెళుతోంది. ఆ ప్ర‌య‌త్నానికి వైసీపీ కూడా ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ఇస్తోంది. దీంతో ఆ రెండు పార్టీల మీద అక్క‌డి ఓట‌ర్లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌ర్వేల అంచ‌నా. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ (TDP) ఒక వేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మునిగిపోతుంద‌ని ప్ర‌జానాడి ఆధారంగా చెబుతున్నాయి. అలాగే, రాయ‌ల‌సీమ ప్రాంతానికి ప్ర‌త్యేక నిధులు ఇవ్వ‌లేద‌ని ఆగ్ర‌హం అక్క‌డ ఓట‌ర్ల‌లో ఉంద‌ట‌. అక్క‌డ కూడా బీజేపీతో పెట్టుకుంటే టీడీపీ న‌ష్ట‌పోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు బీజేపీకి దూరం కావ‌డం బెట‌ర‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు..

కాపుల‌కు రిజ‌ర్వేషన్ మూడో ప్ర‌ధానం అంశంగా క‌నిపిస్తోంది. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు ఇస్తాన‌ని గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. దీంతో అతి పెద్ద సెక్టార్ గా ఉన్న అగ్ర‌వ‌ర్ణ పేద‌లు టీడీపీకి(TDP) దూరం అయ్యారు. ఇప్పుడే ఇదే అంశాన్ని ప్ర‌త్య‌ర్థులు తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ల ఎపిసోడ్ మొత్తాన్ని చంద్ర‌బాబు మీద నెట్టేయ‌డానికి చూస్తున్నారు. అందుకే, లోకేష్ పాద‌యాత్ర‌లో కోవ‌ర్టుల మాదిరిగా కొంద‌రు కాపులు దూరి రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌శ్నిస్తున్నారు. గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రుగుతోన్న యువ‌గ‌ళం సంద‌ర్భంగా రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకొస్తున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టిస్తే ఈసారి ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉంది. స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు టీడీపీకి దూరం కావ‌డానికి కాపు రిజ‌ర్వేష‌న్లు అత్యంత డేంజ‌ర్ అంశంగా క‌నిపిస్తోంది. బ‌లిజ , తెల‌గ‌,శెట్టి బ‌లిజ, ఒంట‌రి కులాలు కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు. అంతేకాదు, బ్రాహ్మ‌ణ‌, వైశ్య‌, రెడ్డి, క‌మ్మ త‌దిత‌ర ఉన్నత‌ వ‌ర్గాల్లోని పేద కుటుంబాల‌కు చెందిన యువ‌త సీరియ‌స్ గా ఉంది. అందుకే ఈ అంశాన్ని మ‌ధ్యేమార్గంగా తీసుకురాలేక‌పోతే టీడీపీ ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న స‌ర్వేల అంచ‌నా.

తెలుగుదేశం పార్టీ  ఒంటరిగా అధికారంలోకి..(TDP)

ఇక నాలుగో అంశం ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే లీడ‌ర్ల‌ను తీసుకుని టిక్కెట్ల‌ను ఇవ్వ‌డం. తాజా స‌ర్వేల ప్ర‌కారం తెలుగుదేశం పార్టీ (CBN Power) ఎలాంటి స్వ‌యంకృతాప‌రాధం చేయ‌క‌పోతే ఒంటరిగా అధికారంలోకి రానుంది. క‌నీసం 95 నుంచి 100 స్థానాల వ‌ర‌కు ఒంటిరిగా గెలుస్తుంద‌ని స‌ర్వేల అంచ‌నా. ఇప్పుడున్న వ్య‌తిరేక‌త ప్ర‌భుత్వం మీద రాబోవు రోజుల్లో ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. ఆ దిశ‌గా అంచ‌నా వేస్తే క‌నీసం 100 నుంచి 110 స్థానాల వ‌ర‌కు సునాయాసంగా గెలుచుకోవ‌చ్చ‌ని స‌ర్వేల సారాంశం. అయితే, నువ్వా? నేనా? అనేలా పోటీ జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాలు క‌నీసం 30 నుంచి 35 స్థానాల‌ను ఉన్నాయ‌ని తేల్చారు. వాటిలో ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేని ప‌రిస్థితుల్లో టీడీపీ (TDP) ఉంది. ఆ స్థానాల్లో చంద్ర‌బాబు చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే 130 స్థానాల వ‌ర‌కు టీడీపీ గెలుచుకోగ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వాళ్ల‌ను, డ‌బ్బు ఎక్కువ విరాళంగా ఇచ్చే వాళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తే మాత్రం క‌నీసం 30 నుంచి 40 స్థానాల వ‌ర‌కు చేజార్చుకోవాల్సి వ‌స్తుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

Also Read : CBN-Jagan : TDP సానుభూతి మీడియా అత్యుత్సాహం, ప‌క్క‌లో బ‌ల్లెంలా JSP !

బీజేపీ, జ‌న‌సేన‌కు దూరంగా ఉంటూ క‌మ్యూనిస్ట్ ల‌ను క‌లుపుకుని వెళితే రెండందాల చంద్ర‌బాబుకు మేల‌ని రాజ‌కీయ పండితుల ఉవాచ‌. ప్ర‌స్తుతం బీజేపీ చెబుతున్న‌ట్టు బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే, ఎక్క‌డా డిపాజిట్లు దక్కే ప‌రిస్థితి లేద‌ని స‌ర్వేల సారంశం. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు రాజ‌కీయంగా జ‌న‌సేన పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల‌తో వీర‌మ‌ర‌ణం త‌ప్ప‌దు. తెలుగుదేశం పార్టీ(TDP)తో పొత్తు పెట్టుకుంటే జ‌న‌సేన‌కు లాభం. ఆ పార్టీకి గుర్తింపు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. అదే జ‌రిగితే, భ‌విష్య‌త్ లో ప‌ర్మినెంట్ గా ప‌క్క‌లో బ‌ల్లెంలా టీడీపీకి జ‌నసేన ఉంటుంది. అందుకే, క‌మ్యూనిస్ట్ ల వ‌ర‌కు పొత్తుపెట్టుకుని వెళితే చంద్ర‌బాబుకు రెండందాల లాభ‌మ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు స్వ‌యంకృతాప‌రాధం చేయ‌కుండా ఉండాలంటే బీజేపీ, జ‌న‌సేన‌ను వ‌దులుకోవాలి. డబ్బుకు కాకుండా గెలుపు గుర్రాల‌ను ఎంచుకోవాలి. నువ్వా? నేనా? అనేలా ఉన్న చోట్ల రాజీ ప‌డ‌కుండా అభ్య‌ర్థుల ఎంపిక ఉండాలి. ఇత‌ర పార్టీల వాళ్ల‌ను తీసుకున్న‌ప్ప‌టికీ టిక్కెట్లు ఇవ్వ‌కుండా దూరంగా పెట్టాలి. ఈ అంశాల‌ను చంద్ర‌బాబు(CBN Power) ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? అంటే లేద‌ని ప్ర‌స్తుతం చెప్పుకోవాలి.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌