CBN Power : అధికార మార్పుపై అంచ‌నా, చంద్ర‌బాబుతో IAS,IPSల ర‌హ‌స్య‌ భేటీ

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప‌డిపోనుంద‌ని అంచ‌నా వేస్తోన్న కొంద‌రు కీల‌క అధికారులు ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు(CBN Power) పంచ‌కు చేరుతున్నారు.

  • Written By:
  • Updated On - January 19, 2023 / 02:58 PM IST

అధికారం ఉన్న వైపు అధికారులు ఉంటారు. అంతేకాదు, అధికారం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన వెంట‌నే ఫోక‌ల్ పోస్టుల కోసం క‌ర్చీఫ్ వేస్తారు. స‌హ‌జంగా అధికార యంత్రాంగం అనుస‌రించే ప‌ద్ధ‌తి అది. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప‌డిపోనుంద‌ని అంచ‌నా వేస్తోన్న కొంద‌రు కీల‌క అధికారులు ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు(CBN Power) పంచ‌కు చేరుతున్నారు. కొంద‌రు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు(IAS-IPS) చాటుగా హైద‌రాబాద్ వ‌చ్చి బాబు ముందు మోకారిల్లుతున్నార‌ని టాక్‌. దీంతో అధికారంలోకి వ‌చ్చేస్తున్నామ‌న్న ధీమా టీడీపీ వ‌ర్గాల్లోనూ పెరిగింది.

 ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు పంచ‌కు అధికారులు (CBN Power) 

ఇటీవ‌ల చంద్ర‌బాబు రోడ్ షోల‌కు(CBN Power) హాజ‌రైన జ‌నాన్ని చూశాం. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త కార‌ణంగా చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం తండోతండాలుగా వ‌స్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ స‌భ‌ల‌ను అధికారులు ద‌గ్గ‌రుండి చూశారు. స్వ‌చ్చంధంగా జ‌నం త‌ర‌లి రావ‌డాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు వేదిక‌గా జ‌రిగిన తొక్కిస‌లాట విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత జీవో నెంబ‌ర్ 1ను తీసుకురావ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం భ‌య‌ప‌డింద‌ని అర్థం అయింది.  ఆ జీవోపై హైకోర్టు స్టే విధించ‌డంతో   తిరిగి రోడ్ షోల‌కు చంద్ర‌బాబు సిద్ధం అవుతున్నారు. ఆయ‌న స్పీడ్ ను చూసిన ఉద్యోగులు రాబోవు రోజుల్లో మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రాబోతుంద‌ని న‌మ్ముతున్నారు.

Also Read : CBN Kuppam : చంద్ర‌బాబుపై పోటీకి పెద్దిరెడ్డి సై, కుప్పంపై వైసీపీ మైండ్ గేమ్‌

మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో మ‌రింత క్లారిటీ అంద‌రికీ వ‌చ్చేసింది. టిడిపి ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న గోడ‌మీద పిల్లుల్లాంటి నేత‌లు కూడా చంద్ర‌బాబు, లోకేష్ ల‌ను క‌లిసి ఎందుకు దూరంగా ఉంటున్నామో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన లీడ‌ర్లు తిరిగి తెలుగుదేశంలోకి వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తోన్న కొంద‌రు ఐఏఎస్, ఐపీఎస్‌లు(IAS-IPS)  హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా క‌లుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్ర‌భుత్వంలో కీల‌క పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని వాపోతున్నారట‌. అనుబంధం, బంధుత్వాలు, స్నేహాల‌ను గుర్తుచేస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మంటూ భావిస్తూ ఫోక‌ల్ పోస్టులకు ఇప్ప‌టి నుంచే గురిపెడుతున్నారు.

ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ని ప‌సిగ‌ట్టిన అధికారులు

పోలీసుశాఖ‌లో ఓ ఐపీఎస్ బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా చంద్ర‌బాబు కాపాడార‌ని టాక్ ఉంది. ఆయ‌న వైసీపీ స‌ర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ చెల‌రేగిపోయాడు. సీన్ క‌ట్ చేస్తే చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా విడ‌త‌ల వారీగా క‌లుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉండ‌డం టీడీపీ వ‌ర్గాల్లోని ఇంట‌స్ట్రింగ్ చ‌ర్చ‌గా మారింది. సీఐడీలో ప‌నిచేస్తున్న కొంద‌రు చంద్ర‌బాబుని క‌లిసి ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు. ఓ ఉన్న‌తాధికారి ఆడించే ఆట‌లో పావులం అంటూ లెంప‌లు వేసుకుంటున్నార‌ట‌. ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ని ప‌సిగ‌ట్టిన అధికారులు చంద్ర‌బాబునాయుడిని ప‌ట్టుకుంటే క్ష‌మించి వ‌దిలేస్తార‌న్న‌ ధీమాతో హైద‌రాబాద్ లో అపాయింట్మెంట్ల కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు.

Also Read :CBN Arrow : గుడివాడ టీడీపీ అభ్య‌ర్థిగా తార‌క‌ర‌త్న‌? `నంద‌మూరి`తో కొడాలికి చెక్!

రాజ‌కీయ స‌మీకర‌ణాలు, చంద్ర‌బాబు రోడ్ షోలు వెర‌సి ఏపీలో అధికారంలోకి టీడీపీ రాబోతుంద‌ని అంచ‌నా వేసే వాళ్ల
సంఖ్య పెరుగుతోంది. నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుకుంటోన్న అధికారులు ప్లేట్ మార్చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. వాళ్లు ఇప్పుడు చంద్ర‌బాబు ఆశీస్సుల కోసం హైదారాబాద్ ఇంటి వ‌ద్ద ప‌డిగాపులు కాస్తున్నారు. ర‌హ‌స్యంగా స‌మావేశం అవుతూ స్వామిభ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలుస్తోంది.