Site icon HashtagU Telugu

CBN Politics : మ‌ళ్లీ పాత క‌థ‌! పరాయి వాళ్ల‌కు రెడ్ కార్పెట్!

CBN Politics

Tdp Radio

`నేను మారాను మీరు మారండి.. గ‌తంలో మాదిరిగా ఈసారి ఉండ‌దు అన్ని విధాలా ఆందుకుంటా..`(CBN Politics) ఇలాంటి మాట‌లు గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబు నుంచి క్యాడ‌ర్ వింటోంది. యువ‌త‌కు 40శాతం టిక్కెట్లు ఇవ్వ‌డం ద్వారా కొత్త ర‌క్తాన్ని పార్టీకి ఎక్కిస్తానంటూ చెబుతుంటారు. కొత్త త‌రం చంద్ర‌బాబు మాట‌ను ఈసారి కూడా న‌మ్ముతోంది. పాత త‌రం మాత్రం ఇవ‌న్నీ గ‌తంలో చెప్పిన మాట‌ల‌కు భిన్నం ఏముంది? అంటూ మాట్లాడుకోవ‌డం టీడీపీలో ష‌రా మామూలుగా మారింది. అందుకు బ‌లం చేకూరేలా ఇప్పుడు పార్టీ కార్య‌క‌లాపాలు క‌నిపిస్తున్నాయ‌ని కీల‌క లీడ‌ర్లు కొంద‌రు నొచ్చుకుంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణగా శుక్ర‌వారం జ‌రిగిన ఐటీడీపీ స‌మావేశాన్ని గుర్తు చేస్తున్నారు.

నేను మారాను మీరు మారండి (CBN Politics)

తెలుగు దేశం పార్టీకి చ‌దువుకున్న యువ‌త ఎక్కువ‌గా ఉంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల్లో ప‌నిచేసే యువ‌కులు పార్టీ కోసం ప‌నిచేస్తుంటారు. అందుకే, ఐటీ విభాగాన్ని కూడా పెట్టారు. వాళ్ల సేవ‌ల‌ను పార్టీకి వినియోగించుకోవ‌డానికి ఐ టీడీపీని కూడా ప్రారంభించారు. దాని ద్వారా పార్టీ భావ‌జాలాన్ని, కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అందుకు అబ్బుర‌ప‌డిన చంద్ర‌బాబు వాళ్ల‌ను(CBN Politics) ప్ర‌శంసించారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. సుదీర్ఘ‌కాలం ప‌నిచేస్తోన్న తెలుగు సైనికుల‌ను ప్రేక్ష‌కులుగా చేసి ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన రాజేష్ అలియాస్ మ‌హాసేన రాజేష్ చంద్ర‌బాబు ప‌క్క‌న కుర్చీలో ద‌ర్జాగా కూర్చున్నారు. ఆయ‌న ఐటీడీపీ సైన్యాధిప‌తిగా ఫోక‌స్ అయింది.

Also Read : CBN P4 Formula :విజ‌న్ 2047కు చంద్ర‌బాబు పీ4 ఫార్ములా

2019 ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేశాడు రాజేష్. ఆయ‌న పేరుకు మ‌హాసేన అనే నామ‌క‌ర‌ణం ముందు తగిలించారు. దానికి అత‌ను ఫౌండ‌ర్ గా భావించాలి. దాని లక్ష్యం ఏమిటో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోక‌స్ అవుతూ ద‌ళిత కార్డ్ ను త‌గిలించుకున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డానికి చంద్ర‌బాబును ఇష్టానుసారంగా దుర్భాష‌లాడారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌ను కూడా చేసిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిల‌తో స‌హా వ్య‌క్తిగ‌త జీవితంపై అప్ప‌ట్లో విషం చిమ్మార‌ని తాజాగా శ్రీరెడ్డి ఆరోపణ‌ల‌కు దిగారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత రాజేష్ కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. దీంతో 2022 నుంచి పవ‌న్ కు అనుకూలంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియోలు పెట్టారు. దీంతో ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేర‌తార‌ని అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు (CBN Politics)అత‌న్ని ఆహ్వానించారు. ఇలాంటి వాళ్ల‌ను (జూపూడీతో స‌హా) చాలా మందిని చంద్ర‌బాబు చేర‌దీశారు. పార్టీలో ప‌నిచేసే వాళ్ల‌ను కాద‌ని ప్రాధాన్యం ఇచ్చారు.

ఐటీడీపీ సైన్యాధిప‌తిగా మ‌హాసేన రాజేష్  ఫోక‌స్

ఉమ్మ‌డి ఏపీ తొలి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబు (CBN Politics)క్యాబినెట్లో సొంత పార్టీ వాళ్ల‌ను కాద‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ప్ర‌తిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకుని ముగ్గురికి మంత్రి ప‌దవులు క‌ట్ట‌బెట్టారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు పార్టీ కోసం ప‌నిచేసిన లీడ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వుల‌ను ఇవ్వ‌లేక‌పోయారు. అంతేకాదు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ఎస్సీ,ఎస్టీలు, బీసీలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని జూపూడి ప్ర‌భాక‌ర్ లాంటి వాళ్ల‌ను వైసీపీ నుంచి తీసుకుని రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌వుల‌ను ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా సుమారు 30 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని వాళ్ల‌కు దాదాపుగా టిక్కెట్లు ఇచ్చారు. ఫ‌లితంగా అప్ప‌టి వ‌ర‌కు భారీ గా ఖ‌ర్చుపెట్టి పార్టీని కాపాడుకుంటూ వ‌చ్చిన వాళ్ల‌కు టిక్కెట్ల ఇవ్వ‌డానికి లేకుండా పోయింది. అలాంటి ప‌రిస్థితి తిరిగి ఇప్పుడు క‌నిపిస్తోంది.

సొంత పార్టీ వాళ్ల‌ను కాద‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు

అధికారంలో ఉండే పార్టీ మీద సాధార‌ణంగా వ్య‌తిరేక‌త ఉంటుంది. ప్ర‌త్యేకించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, ఆయ‌న వాల‌కంపై సొంత పార్టీలోనే అసంతృప్తివాదులుగా చాలా మంది ఉన్నారు. కనీసం 50 నుంచి 60 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ ఇవ్వ‌లేన‌ని కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొఖానే చెప్పేశారు. ఆ విష‌యాన్ని ఉద‌య‌గిరి ఎమ్మెల్యే స్వానుభ‌వంతో మీడియాకు వివ‌రించారు. అధికార పార్టీ నుంచి టిక్కెట్ ను పొంద‌లేని వాళ్లు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. వాళ్ల‌ను చంద్ర‌బాబు(CBN Politics) ఆహ్వానిస్తూ టిక్కెట్ల‌ను ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డ‌డం సొంత పార్టీలోని వాళ్ల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి టీడీపీలో దాదాపుగా చేరిన‌ట్టే. వాళ్ల‌కు టిక్కెట్ల‌ను కూడా ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిగ్న‌ల్ ఇచ్చారు. అంతేకాదు, వాళ్ల కుటుంబీకుల‌కు కూడా టిక్కెట్ల‌ను పొంద‌డానికి చంద్ర‌బాబు నుంచి సానుకూల మార్గాన్ని క్రియేట్ చేసుకున్నార‌ని టాక్. దీంతో 40శాతం యువ‌త‌కు టిక్కెట్లు అంటే సొంత పార్టీలోని సీనియ‌ర్ల పిల్ల‌ల‌కు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన లీడ‌ర్ల వార‌సుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

అధికార‌ప‌క్షం మీద వ్య‌తిరేక‌త కార‌ణంగా అధికారంలోకి వ‌స్తున్నామ‌ని టీడీపీ విశ్వ‌సిస్తోంది. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌నాన్ని చూసి క్యాడ‌ర్ కూడా ఉత్సాహంగా ఉంది. కానీ, చంద్ర‌బాబు మునుప‌టి మాదిరిగా చేస్తే లాభం ఏమిటి? అనే ప్ర‌శ్న సొంత పార్టీలోనే మొద‌ల‌యింది. అందుకు త‌గిన విధంగా ఆయ‌న కార్య‌క‌లాపాలు ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని పార్టీలోని టాక్. అధికార‌ప‌క్షం నుంచి వ‌చ్చే లీడ‌ర్ల‌కు టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే, రాబోవు రోజుల్లో పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని చ‌ర్చించుకుంటున్నారు. చంద్ర‌బాబు (CBN Politics) మార‌లేద‌ని పునుప‌టిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని లోలోన మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా సొంత పార్టీ వాళ్ల‌ను కాద‌ని ఇత‌ర పార్టీల లీడ‌ర్ల మీద మోజు త‌గ్గించుకోవాల‌ని కోరుకుంటున్నారు.

Also Read : TDP : చంద్ర‌బాబు కొంప‌ముంచుతున్న టీడీపీ సోష‌ల్ మీడియా