Site icon HashtagU Telugu

CBN-PM : మోడీ విజ‌న్ 2040కి చంద్ర‌బాబు స‌హ‌కారం! PMO నుంచి సంకేతాలు!

CBN-PM

Modi Babu

విజ‌న్ త‌యారు చేయ‌డం, దాని ప్ర‌కారం అభివృద్ధికి పునాదులు వేయ‌డం భ‌విష్య‌త్ గురించి ఆలోచించే లీడ‌ర్లు చేసే ప‌ని. ఆ దిశ‌గా అడుగులు వేసిన తొలి సీఎం చంద్ర‌బాబునాయుడు. ఆ త‌రువాత గుజ‌రాత్ సీఎంగా ప‌నిచేసిన మోడీ పేరు తెర‌పైకి వ‌స్తోంది. ఇప్పుడు ప్ర‌ధాన మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీ విజ‌న్ 2040 (CBN-PM)దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. దాన్ని త‌యారు చేయ‌డానికి నిపుణుల‌తో పాటు విజ‌న్(Vision) ఉన్న నాయ‌కుల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటున్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌న్ 2040 (CBN-PM)

దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక‌, వ్య‌వ‌సాయం, టెక్నాల‌జీ త‌దిత‌ర రంగాల్లోని నిపుణుల స‌ల‌హాల‌ను తీసుకుంటున్నారు. వాటిని క్రోడీక‌రించ‌డం ద్వారా విజ‌న్ 2040ను(CBN-PM) రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి నిష్ణాతుల‌ను మోడీ నియ‌మించార‌ని తెలుస్తోంది. ఆ టీమ్ అవ‌స‌ర‌మైన ఇన్ ఫుట్స్ ఇవ్వ‌డానికి దేశంలోని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌ధాని సూచించార‌ని తెలుస్తోంది. ఆ జాబితాలో చంద్ర‌బాబునాయుడు ఉన్నార‌ని పీఎంవో వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. విజ‌న‌రీగా పేరున్న చంద్ర‌బాబు ఇచ్చే విలువైన స‌మాచారాన్ని తీసుకోవాల‌ని సూచించారట‌. ఆ మేర‌కు మోడీ అనుచ‌రులు, పీఎంవో వ‌ర్గాల నుంచి టీడీపీ చీఫ్ కు సందేశం అందింద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

ఉమ్మ‌డి ఏపీ సీఎంగా చంద్ర‌బాబునాయుడు విజ‌న్ 2020ని త‌యారు చేయించారు. ఆయ‌న సీఎంగా రెండోసారి 1999లో బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత విజ‌న్ దిశ‌గా అడుగులు వేశారు. ఆ క్ర‌మంలో హైద‌రాబాద్ కు ప‌ట్టిన మ‌హ‌ర్ధ‌శ‌ను ఇప్పుడు చూస్తున్నాం. ఆనాడు ఆయ‌న త‌యారు చేసిన విజ‌న్ ను ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ప్పుబ‌ట్టాయి. దాన్నో 420 విజ‌న్ (Vision) గా తీసిపారేశారు. సీన్ క‌ట్ చేస్తే, 2004లో అధికారంలోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌స్తుతం తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా ఆనాడు చంద్ర‌బాబు వేసిన విజ‌న్ పునాదుల‌పై పాల‌న సాగిస్తున్నారు.

విజ‌న్ 2040, 2050ని రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి చంద్ర‌బాబు

ఉమ్మ‌డి రాష్ట్ర విడిపోయిన త‌రువాత తొలి సీఎంగా చంద్ర‌బాబునాయుడు ఏపీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌పంచంలోనే మొద‌టి స్థానంలో ఏపీని నిల‌పాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఆ దిశ‌గా విజ‌న్ 2050ని రూపొందించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా ఉండేలా ప్లాన్ చేశారు. నెంబ‌ర్ 1 రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిల‌పడానికి విజ‌న్ 2029 రూపొందించారు. ప్ర‌పంచంలోనే ఏపీని నెంబ‌ర్ 1గా నిలిపేలా విజ‌న్ 2050ను త‌యారు చేయించారు. దాన్ని అమ‌లు చేసే క్ర‌మంలో సింగ‌పూర్ క‌న్సార్టియంతో ఒప్పందాలు చేసుకున్నారు.

Also Read : ChandraBabuNaidu: బీజేపీ వద్దంటే..కాంగ్రెస్ కావాలంటుంది! రాహుల్ సభకు బాబుకు ఆహ్వానం

ఆర్థిక కేంద్రంగా విశాఖ‌, హార్డ‌వేర్ హాబ్ గా రాయ‌ల‌సీమ‌, కోస్ట‌ల కారిడార్ ఏర్పాటుతో కోస్తాకు సింగ‌పూర్ లుక్, ఆధ్యాత్మిక హ‌బ్ గా తిరుప‌తిని వినూత్నంగా తీర్చిదిద్దాల‌ని విజ‌న్ రూప‌క‌ల్ప‌న చేశారు. కానీ, 2019 ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న్ను తిర‌స్క‌రించారు. ఒక్క ఛాన్స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇచ్చారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు ర‌చించిన విజ‌న్ 2029, 2050 కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి. కానీ, ఆయ‌న విజ‌న్ ఎంత విలువైన‌దో ప్ర‌ధాని మోడీ గ్ర‌హించారు. దేశానికి విజ‌న్ 2040, 2050ని రూప‌క‌ల్ప‌న చేయ‌డానికి చంద్ర‌బాబు స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు విజ‌న్ రూప‌క‌ర్త‌ల‌ను ఆదేశించార‌ని ఢిల్లీ వ‌ర్గాల ద్వారా అందుతోన్న స‌మాచారం.