CBN Plan : మోడీతో బాల‌య్య భేటీ? భార‌త ర‌త్న, పొత్తు ఎజెండా!

తెలుగుదేశం, బీజేపీ మ‌ధ్య జ‌రుగుతోన్న దోబూచులాట‌కు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాల‌క్రిష్ణ (CBN Plan) తెర‌దించ‌బోతున్నారు.

  • Written By:
  • Updated On - May 8, 2023 / 06:03 PM IST

తెలుగుదేశం, బీజేపీ మ‌ధ్య జ‌రుగుతోన్న దోబూచులాట‌కు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాల‌క్రిష్ణ (CBN Plan) తెర‌దించ‌బోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బ‌లోపేతం కోసం ఆయ‌న లైజ‌నింగ్ చేయ‌బోతున్నార‌ని టీడీపీలోని టాక్‌. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో బాల‌య్య(Balakrishna) క‌ల‌వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. వాళ్లిద్ద‌రి భేటీ త‌రువాత ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో పెను సంచల‌నం జ‌ర‌గ‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

న‌రేంద్ర మోడీతో బాల‌య్య క‌ల‌వ‌బోతున్నార‌ని..(CBN Plan

తెలుగుదేశం పార్టీలో నంద‌మూరి, నారా అభిమానుల మ‌ధ్య స‌న్న‌ని గీత ఉంద‌ని లోతుగా అధ్య‌య‌నం చేసే వాళ్ల‌కు క‌నిపిస్తోంది. దాన్ని చాలా వ‌ర‌కు ఇటీవ‌ల చెరిపేసిన‌ప్ప‌టికీ త‌ర‌చూ జూనియ‌ర్ రూపంలో పొడ‌చూపుతోంది. ఆ గ్యాప్ ను శాశ్వ‌తంగా భ‌ర్తీ చేయ‌డానికి నంద‌మూరి బాల‌క్రిష్ణ (Balakrishna) పూర్తిస్థాయిలో రంగంలోకి దిగ‌బోతున్నార‌ని టాక్‌. అందులో భాగంగా ఢిల్లీ రాజ‌కీయ వేదిక‌పై కీ రోల్ పోషించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి అసెంబ్లీ కంటే బాల‌య్య‌ను లోక్ స‌భ‌కు పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు (CBN Plan) భావిస్తున్నార‌ట‌. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖ‌రారు అయితే, ఎంపీగా బాల‌య్య బ‌రిలోకి దిగుతార‌ని అభిమానుల్లోని వినికిడి. ఇదంతా మోడీ, బాల‌య్య భేటీ త‌రువాత డిసైడ్ అవుతుంద‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌.

అసెంబ్లీ కంటే బాల‌య్య‌ను లోక్ స‌భ‌కు పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ (NTR) అంటే ప్ర‌ధాని మోడీకి అన‌లేని ప్రేమ‌. పార్ల‌మెంట్ లోపల‌, బ‌య‌ట ప‌లు సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ ను ప్ర‌శ‌సించారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పోరాడిన యోధుడంటూ లోక్ స‌భ‌లో ఎన్టీఆర్ ను కొనియాడారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారానికి ఏపీ వ‌చ్చిన మోడీ ప్ర‌త్యేకించి నంద‌మూరి కుటుంబాన్ని ప్ర‌స్తావించారు. అంతేకాదు, బాల‌క్రిష్ణ(Balakrishna) గురించి కూడా మాట్లాడారు. అంటే, బాల‌య్య గురించి మోడీకి ముందుగానే తెలుసున్న‌మాట‌. అయితే, ఏపీలోని ప‌రిస్థితుల దృష్ట్యా ఎన్డీయేతో టీడీపీ విడిపోయిన త‌రువాత ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మ‌ళ్లీ ఎన్డీయేలో భాగ‌స్వామి కావాల‌ని చంద్ర‌బాబు (CBN Plan) ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆచితూచి అడుగు వేస్తున్నారు.

ఎన్డీయేలో భాగ‌స్వామి కావాల‌ని చంద్ర‌బాబు (CBN Plan)

బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుంద‌ని సంకేతాలు ఇస్తోన్న లీడ‌ర్ల మీద చ‌ర్య‌లకు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఉప‌క్ర‌మిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుంద‌ని మీడియాకు సంకేతాలు ఇచ్చారు. అంతే, వెంట‌నే ఆయ‌న‌కు షోకాజ్ నోటీసులు ఏపీ బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణాసంఘం జారీ చేసింది. సంజాయిషీ చెప్పుకునే ప‌రిస్థితి విష్ణుకుమార్ రాజుకు వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితులు టీడీపీ, బీజేపీ మ‌ధ్య ఉన్న‌ప్పుడు ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు సాధ్య‌మా? అనే సందిగ్ధం నెల‌కొంది. జన‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan kalyan)పొత్తు దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ బీజేపీ స‌సేమిరా అంటోంది. బీజేపీ, టీడీపీ, జన‌సేన పొత్తుకు ప‌వ‌న్ ప‌లు ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, వ‌ర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు బాల‌య్య (Balakrishna) రంగంలోకి దిగ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న అవార్డ్

క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఏ రోజైనా బాల‌య్య ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని (Naredra Modi) క‌లిసే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఎన్డీఆర్ శ‌త‌జ‌యంతి వేడుకుల సంద‌ర్భంగా ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న అవార్డ్ (Bharata Ratna)ఇవ్వాల‌ని కోర‌డానికి ఢిల్లీ వెళ‌తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌కు కేవ‌లం బ‌హిరంగ స‌భ‌లు, ప‌లు వేదిక‌ల‌పై మాత్ర‌మే భార‌త‌ర‌త్న అవార్డ్ ప్ర‌స్తావ‌న వ‌చ్చేది. కానీ, సీరియ‌స్ లైజ‌నింగ్ కేంద్రంతో ఎప్పుడూ జ‌రిపిన దాఖ‌లాలు లేవు. ఈసారి బాల‌య్య నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో(Naredra Modi) క‌లిసి ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని కోర‌నున‌ప్న‌ట్టు స‌మాచారం. అందుకే, ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుకుల సంద‌ర్భంగా సోమ‌వారం సికింద్రాబాద్ లో జ‌రిగిన వేడుక‌ల్లో భార‌త ర‌త్న గురించి  బాల‌య్య ప్ర‌స్తావించారు.

Also Read : CBN : వైసీపీకి షాకింగ్, ప్ర‌చారానికి ర‌జ‌నీకాంత్?

రాజ‌కీయంగా, సినిమా ప‌రంగా అనేక మందికి స్వ‌ర్గీయ ఎన్టీఆర్(NTR) లైఫ్ ఇచ్చారు. సినీ, రాజ‌కీయ రంగాల్లో పెను సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్న మొట్ట‌మొద‌టి రాజ‌కీయ హీరో ఆయ‌న‌. స‌రిగ్గా ఇదే న‌రేంద్ర మోడీకి (Narendra Modi) న‌చ్చే పాయింట్. అందుకే, ఎన్టీఆర్ కు భార‌త ర‌త్నం (Bharata Ratna) ఈసారి ప్ర‌క‌టించ‌డానికి ఛాన్స్ ఉంది. అయితే, బాల‌క్రిష్ణ (Balakrishna) ఢిల్లీ వెళితే మ‌రింత ఈజీ అవుతుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని భావ‌న‌. ఇటీవ‌ల మోడీ, అమిత్ షా ఇద్ద‌రూ జూనియ‌ర్ ను ప‌లు సంద‌ర్బాల్లో పిలిపించుకున్నారు. ఆయ‌న‌తో ఏమి మాట్లాడారు? అనేది ఇతిమిద్ధంగా తెలియ‌న‌ప్ప‌టికీ రాజ‌కీయ ప్ర‌స్తావ‌న వ‌చ్చింద‌ని మాత్రం తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు బాల‌య్య స్వ‌యంగా మోడీని కలిస్తే, స్వామి కార్యం స్వ‌కార్యం మాదిరిగా ఎన్టీఆర్ కు భార‌త ర‌త్నం, పొత్తుల అంశం కూడా చ‌ర్చించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీ కోర్ టీమ్ (CBN Plan)లోని ఆలోచ‌న‌గా ఉందని తెలుస్తోంది.

Also Read : YCP-TDP : జ‌గ‌న్ న‌జ‌ర్,చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌పై జీవో నెంబ‌ర్ 1