అందర్నీ కోటీశ్వరులుగా మార్చడం సాధ్యమా? నమ్మ శక్యమా? (CBN P4 Vision) అంటే ఔనంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఆయన విజన్ గురించి తెలిసిన వాళ్లు నమ్ముతున్నారు. ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబు చెప్పేవన్నీ 420 మాటలు అంటూ కొట్టిపారేస్తున్నారు. అందుకే, ఆయన శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కోటీశ్వరులుగా అందర్నీ ఎలా మార్చడానికి అవకాశం ఉందో తెలియచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రగతి సాధించాలంటే పీ4 ఫార్ములా అవసరమని చెబుతున్నారు. దానితో అందర్నీ కోటీశ్వరులుగా మార్చడం సాధ్యమంటున్నారు.
అందర్నీ కోటీశ్వరులుగా మార్చడం సాధ్యమా? నమ్మ శక్యమా? (CBN P4 Vision)
పేదలు, అసంఘటిత కార్మికులు జీవితాంతం పనిచేసినా కోటీశ్వరులు కావడం కష్టం. వాళ్లను పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీ)కి అనుసంధానం చేస్తే కోటీశ్వరులుగా (CBN P4 Vision) మారతారని చంద్రబాబు చెబుతున్నారు. ఎలా అంటే, ప్రభుత్వానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్లను భాగస్వాములుగా చేస్తారు. దీంతో పేదలు, అసంఘటిత కార్మికులు కూడా పారిశ్రామికవేత్తలుగా మారతారు. వాళ్లకు బ్యాంకు అకౌంట్, పాన్ కార్డ్ తదితరాలన్నీ వస్తాయి. ఆ తరువాత వాళ్లే పీపీపీపీ మోడ్ ను కంటిన్యూ చేస్తారు. ఫలితంగా అనతికాలంలోనే కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు శాస్త్రీయబద్ధంగా చెబుతున్నారు.
పీపీపీపీ పద్దతిని అనుసరించడం ద్వారా కోటీశ్వరులుగా
పూర్ టూ రిచ్ పద్ధతిలో ఒక టాపీ కూలీని ఉదాహరణగా తీసుకుందాం. సహజంగా అతను అసంఘటిత కార్మికునిగా జీవనం సాగిస్తుంటాడు. అతన్ని పీపీపీ మోడ్ కు అనుసంధానం చేస్తారు. దీంతో అతను చిన్న కాంట్రాక్టర్ గా గుర్తింపు పొందుతాడు. అతని పేరుతో బ్యాంకుల్లో లావాదేవీలు జరుగుతాయి. ఫలితంగా ఆ తరువాత జరిగే పనులను నేరుగా కాంట్రాక్ట్ కు అతనే తీసుకుంటాడు. అలా అతని పరపతి పెరుగుతోంది. కోటీశ్వరునిగా మారతాడు. ఇలా ప్రతి రంగంలోనూ పూర్, పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్ షిప్ (పీపీపీపీ) పద్దతిని అనుసరించడం ద్వారా కోటీశ్వరులుగా అందర్నీ మార్చడానికి అవకాశం (CBN P4 Vision) ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
పీ4 ఫార్ములాతో విజన్ 2047 దిశగా చంద్రబాబు
పీ4(పీపీపీపీ) పద్ధతిని దేశ వ్యాప్తంగా అమలు చేయడం ద్వారా విజన్ 2047 సాకారం అవుతుందని చంద్రబాబు చెబుతున్నారు. భారతదేశానికి రోల్ మోడల్ గా ఏపీని తయారు చేయాలని ఆయన తపన పడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. దాని కోసం పీ4 ఫార్ములా ఉపయోగపడుతుందని చంద్రబాబు (CBN P4 Vision) విశ్వసిస్తున్నారు. ఆ మేరకు ఇటీవల జీ 20 సమావేశంలో చంద్రబాబు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే పీ 4 ఫార్ములాను ఏపీలో అమలు చేసి చూపించాలని ఆయన భావిస్తున్నారు.
Also Read : CBN New Alliance : BJP, జనసేనకు చంద్రబాబు జలక్ ?
ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో 22 ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్ 2020 రచించారు. దాన్ని తొలి రోజుల్లో ప్రత్యర్థులు విమర్శించారు. ఆ విజన్ ను 420గా కొట్టిపారేశారు. కానీ, చంద్రబాబు మాత్రం ఆ విజన్ ప్రకారం హైదరాబాద్ కు పునాదులు వేశారు. అప్పట్లో విమర్శించిన వాళ్లు ఇప్పుడు చంద్రబాబు విజన్ ను శభాష్ అంటున్నారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరంగా హైదరాబాద్ ఉంది. అందుకే, చంద్రబాబు విజన్ ను ఎవరూ కాదనలేరని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ప్రత్యర్థులు సైతం చంద్రబాబు విజన్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కొత్తగా పీ4 ఫార్ములాతో విజన్ 2047 దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దానికి ప్రజలు సహకరిస్తే, అందర్నీ కోటీశ్వరులుగా (CBN P4 Vision) మార్చుతానని చంద్రబాబు చెప్పే మాటల్ని నమ్మాలి. ఎందుకంటే, విజన్ 2020 ఫలాలను చూస్తున్నాం. పీ 4ను నమ్మడమా? నమ్మకపోవడమా? అనేది ఏపీ ప్రజల విజ్ఞతకు చంద్రబాబు వదిలేశారు.
Also Read : TDP Scheme : మగువకు `మహాశక్తి` చంద్రబాబు