CBN P4 Formula :విజ‌న్ 2047కు చంద్ర‌బాబు పీ4 ఫార్ములా

పేద‌రికంలేని స‌మాజాన్ని చూడాల‌ని(CBN P4 Formula) చంద్ర‌బాబు త‌లపోస్తున్నారు. ఆ దిశ‌గా ఏపీ కోసం విజ‌న్ 2050ని రూపొందించారు.

  • Written By:
  • Updated On - May 30, 2023 / 04:14 PM IST

పేద‌రికంలేని స‌మాజాన్ని చూడాల‌ని(CBN P4 Formula) చంద్ర‌బాబు త‌లపోస్తున్నారు. ఆ దిశ‌గా ఏపీ కోసం విజ‌న్ 2050ని రూపొందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతోన్న విజ‌న్ 2047 కు మ‌ద్ధ‌తు ప‌లుకుతూ 2029 ను ఏపీకి ప్రాథ‌మికంగా బ్లూ ప్రింట్ ర‌చించారు. అందుకే, పీ 4 ఫార్ములాను మ‌హానాడు(Mahanadu 2023) వేదిక‌గా వినిపించారు. పూర్, ప‌బ్లిక్, ప్రైవేట్, పార్ట‌న‌ర్ షిప్ (పీపీపీపీ) ఫార్ములాను ఏపీ అభివృద్ధి కోసం అమ‌లు చేయ‌డానికి సిద్ద‌మయ్యారు.

పేద‌రికంలేని స‌మాజాన్ని చూడాల‌ని  చంద్ర‌బాబు (CBN P4 Formula)

ఏపీ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తవ్యంగా ఉంది. విభజన సమస్యలు, ఆర్ధికసమస్యలు, నిరుద్యోగం, సున్నా అభివృది, అప్పుల కుప్పగా రాష్ట్రం తయారు అయ్యింది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని నడిపే నాయకుడు ఎవ్వరు? ఒక వేళ‌
నాయకుడు దొరికినా పాలనా ఎలా? సంపద ఎలా సృష్టించాలి? దానిని ఎలా పంచాలి? అనేది ఏపీ ప్ర‌జ‌ల్లోని ప్ర‌శ్న‌లుగా (CBN P4 Formula) ఉండిపోయాయి. కేవలం ఆస్తులు తాకట్టు, బాండ్లు తాక్కట్టు పెట్టి అప్పు తెచ్చి ప్రజలకు పంచ‌డం సరిపోతుందా? అదేనా పాలించడం అంటే..కానే కాదు. అలా చేసుకుంటూ పోతే, సంక్షేమం, అభివృద్ధి రెంటికి మనుగడ ఉండదు. రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వ‌స్తుంది.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు

ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర ఆదాయం లేకపోతే మొదటగా అప్పు చేస్తాడు. తర్వాత ఆస్తులు తాకట్టు పెడతాడు. తర్వాత దొంగతనం చేస్తాడు. ఈ మూడింటిలో ఏపీ ప‌రిస్థితుల్లో ఉందో గమనించాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌హానాడు (Mahanadu) వేదిక‌గా చంద్రబాబు ప్రకటించిన తొలి విడ‌త మేనిఫెస్టో 1.మహిళల కోసం మహా శక్తీ 2.యువత కోసం యువగళం 3.రైతుల కోసం అన్నదాత 4.ఇంటింటికి నీరు 5.BC రక్షణ చట్టం 6. పూర్ టూ రిచ్ వీటితో భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతో చంద్రబాబు విడుదల చేసారు . ఇందులో సంక్షేమ పధకాలు 80% ఉన్నాయి. ఖజానా ఖాళీ ఉండగా అమలు ఎలా సాధ్యం అని ప్రశ్న రావ‌డం స‌హ‌జం. నిజానికి 6 వ‌జ్రాలు అమలు చేయటం చాలా కష్టం. ప్రజలకు సంక్షేమము ముఖ్యం కాబట్టి అమలు చేయవలసిందే. అందుకే సంపద సృష్టించాలి. అందుకు మన శక్తిని మనం గమనించి కష్టపడాలి.

చంద్రబాబు పీ 4 అంటే ఏమిటి..?

స్మార్ట్ థింకింగ్‌, అద్బుత ఫలితాలు కావాలి. అందుకు రాష్ట్ర ఆస్తులు, వాటి ఆదాయం మీద నిర్ధిష్టమైన పాద‌ర్శ‌క‌త‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌ ఉండాలి. రూపాయి సంపాదనే కాకుండా, ప్రభుత్వ ఆస్తుల వినియోగం ( ఇసుక, మైన్స్, వ్య‌వ‌సాయం, కాంట్రాక్టులు, ప‌రిశ్ర‌మ‌లు) అనేది కూడా ముఖ్యమైన అంశం. అందుకే చంద్రబాబు పీ 4 (CBN P4 Formula) అనే విధానాన్ని ప‌రిచ‌యం చేశారు. అసలు ఈ పీ 4(PPPP) అంటే ఏమిటి..?పూర్ ప‌బ్లిక్ ప్రైవేట్ పార్ట‌న‌ర్ షిప్ (పీపీపీపీ). ఇది పీ3 కి అనుసంధానముగా ఆలోచన చేసారు. మనకు తెలిసిన పీ3 అంటే ప్రైవేట్‌ వ్యక్తులు లేదా వ్యవస్థల నుండి పెట్టుబడులు తెచ్చి ప్ర‌భుత్వం సేవ‌ల కోసం పనులు చేస్తారు. దీని వలన ప్ర‌భుత్వానికి కి టైమ్ ప్ల‌స్ వ‌న‌రులు ఆదావుతాయి. పాద‌ర్శ‌క‌త‌, అంకిత‌భావంతో పనులు పూర్తివుతాయి. దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ప్ర‌భుత్వం పని తో పాటు ప్రైవేటు వ్యక్తి / వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుంది. దీనికి ఇప్పుడు పూర్ ( పేదలను ) కూడా భాగస్వామ్యం చేస్తారు.

Also Read : CBN: పబ్లిక్ పాలసితోనే ప్రగతి: చంద్రబాబు

ఉదాహరణకు ప్ర‌భుత్వానికి కావలసిన పనులు వెబ్ సైట్ లో జాబితా చేసి వాటిని పేదలకు చేరెలా రాయితీలు, బ్యాంకు సహాయం తో ప్రోత్సాహిస్తారు. ఇక్కడ పేదలు అని ఎందుకు మాటిమాటికి ప్ర‌స్తావిస్తున్నారో అర్ధం చేసుకోవాలి. నిజానికి మన అందరికి మన కెరీర్ లో ప‌దోన్న‌తులు, అద‌న‌పు స‌హాయం, అలవెన్స్ త‌దిత‌రాలు ఉంటాయి. కానీ రోజువారీ కూలి, అసంఘ‌టిత కార్మికుల‌కు ప్రభుత్వ సంక్షేమాలు మాత్రమే అందుతుంటాయి. అందుకే పీ4 లో (CBN P 4 Formula) చేరటం వలన వారు ఎదగటానికి ఒక అవకాశం, ఆదరణ వస్తుంది. జీవన విధానము,సామాజిక గుర్తింపు మెరుగైన‌ పేదరిక నిర్మూలనకు ఒక మార్గం దొరికుతుంది.

చంద్రబాబు విజ‌న్ 2047 కి  పీ 4 (CBN P4 Formula)విధానము ఒక ఫార్ములా ఇదే దేశం మొత్తము అవలంభించాలి అనేది అయన కోరిక. చంద్రబాబు ఒక అంచనా, నిర్ధిష్ట మైన ప్రణాళికలు తోనే మ‌హానాడు వేదిక‌గా తొలి విడ‌త మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. దాని మీద అధికార‌ప‌క్షం విమ‌ర్శ‌లు చేస్తోంది. కానీ, రుజు మార్గంలో చెప్పిన మాట త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు ప‌క్కాగా అధ్య‌య‌నం చేశారు. 6 వ‌జ్రాల‌ను అమ‌లు చేయ‌డానికి ఎలాంటి అడ్డంకులు ఉండ‌వ‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తున్నారు.