CBN-NTR : చంద్ర‌బాబు స‌మేత నంద‌మూరి ఫ్యామిలీ! రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో ఈనెల 28న సంద‌డి!!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స‌మేత నంద‌మూరి కుటుంబం (CBN-NTR) ఈనెల 28న ఢిల్లీ వెళ్ల‌నుంది.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 01:36 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌మేత నంద‌మూరి కుటుంబం (CBN-NTR) ఈనెల 28న ఢిల్లీ వెళ్ల‌నుంది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో స‌ర్గీయ ఎన్టీఆర్ చిత్ర‌ప‌టంతో కూడిన రూ. 100 నాణెం విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆ రోజున రాష్ట్ర‌ప‌తి ముర్ము నాణెంను విడుద‌ల చేయ‌నున్నారు. ఆ సంద‌ర్భంగా ఎన్డీఆర్ కుటుంబీకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, స‌హ‌చ‌రులు కొంద‌ర్నీ రాష్ట్ర‌ప‌తి భ‌వన్ ఆహ్వానించింది. ఆ మేర‌కు నంద‌మూరి కుటుంబంతో పాటు ప‌లువురు హాజ‌రు కావ‌డానికి ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

చంద్ర‌బాబు స‌మేత నంద‌మూరి కుటుంబం  ఈనెల 28న ఢిల్లీ(CBN-NTR)

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌లు ఏడాది మొత్తం చేయాల‌ని (CBN-NTR) టీడీపీ నిర్ణ‌యించింది. ఆ మేర‌కు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. అలాగే, స్వ‌ర్గీయే ఎన్టీఆర్ సేవ‌ల‌ను కేంద్రం గుర్తించింది. అందుకే, ఆయ‌న గుర్తుగా ఎన్డీఆర్ బొమ్మ ఉండేలా  రూ. 100 నాణెంను   త‌యారు చేసింది. దాన్ని ఈనెల 28న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ లీడ‌ర్ల‌కు ఎన్టీఆర్ సుప‌రిచ‌యం. అంతేకాదు, బీజేపీతో ఎన్డీఆర్ కు రాజ‌కీయ అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అంటే మోడీకి ఎన‌లేని గౌర‌వం. తొలి నుంచి నంద‌మూరి కుటుంబం మీద మోడీకి స‌దాభిప్రాయం ఉంది. అందుకే, 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా బాల‌క్రిష్ణ‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప‌లు సంద‌ర్భాల్లో ఎన్డీఆర్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ చిత్ర‌ప‌టంతో కూడిన రూ. 100 నాణెం విడుద‌ల

కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ‌కే కాదు, రాజ‌కీయాల్లోనూ ప్ర‌త్యేక గుర్తింపు పొంద‌ని యుగ‌పురుషుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్. ప్ర‌త్య‌ర్థులు సైతం సినిమాల్లో వేలెత్త‌చూపలేని న‌ట‌న ఆయ‌న సొంతం. ఎన్నో సంచ‌ల‌నాల‌ను సినిమా ప‌రిశ్ర‌మలో సృష్టించారు. రివార్డులు, అవార్డులు ఆయ‌న ముందు దిగ‌తుడుపే. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమునిగా వెండితెర‌మీద నిలిచారు. అదే త‌ర‌హాలో రాజ‌కీయ రంగంలోనూ పెన సంచ‌ల‌నాల‌ను సృష్టించారు. పార్టీ పెట్టిన ఆరు నెల‌ల్లోనే కాంగ్రెస్ పార్టీ కూక‌టివేళ్ల‌ను క‌దిలించారు. ఆత్మ‌గౌర‌వం నినాదంతో ఇందిర గాంధీ లాంటి ఐర‌న్ లేడీని వ‌ణికించారు. రాజ‌కీయ సంస్క‌ర‌ణ‌ల‌కు  (CBN-NTR) పునాదులు వేశారు.

Also Read : CBN IIIT Celebration : ట్రిపుల్ ఐటీ వేదిక‌గా చంద్ర‌బాబులో మార్పు.!

స‌మాజమే దేవాల‌యం, ప్ర‌జ‌లే దేవుళ్లు అంటూ రాజ‌కీయాన్ని ప్ర‌జ‌ల చెంత‌కు తీసుకెళ్లిన మొట్టిమొద‌టి లీడ‌ర్ స్వ‌ర్గీయ ఎన్టీఆర్. చైత‌న్య ర‌థం మీద ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లారు. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన లీడ‌ర్లు లేరు. ప్ర‌జ‌లే లీడ‌ర్ల వ‌ద్ద‌కు వ‌చ్చే ఆనవాయితీ ఉండేది. దాన్ని తిర‌గ‌రాసిన మ‌హోన్న‌త వ్య‌క్తి నంద‌మూరి తార‌క రామారావు. ఆయ‌న ప్ర‌క‌టించిన రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, జ‌న‌తా వ‌స్త్రాలు, ప‌క్కా గృహాలు స‌మ‌కాలీన రాజ‌కీయాల్లోనూ ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నాయి. కూడు, గుడ్డ‌, నీడ అనే మూడు నినాదాలు గ‌ర్జించిన ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాసిన రికార్డులో ఎన్నో. కేవ‌లం తెలుగు రాష్ట్రానికే కాదు, జాతీయ స్థాయిలో రాజ‌కీయాల‌ను న‌డిపారు. నేష‌న‌ల్ ఫ్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్ ఆద్యుడు ఎన్డీఆర్. వాటి ప్ర‌తిరూపమే ప్ర‌స్తుత ఎన్డీయే. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తిస్తూ ఎన్డీయే  (CBN-NTR) ప్ర‌భుత్వం రూ. 100ల నాణెంను త‌యారు చేసింది.

Also Read : TDP-BJP Alliance: టీడీపీ ఎన్డీయే పొత్తుపై బాబు క్లారిటీ

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో జ‌రిగే ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌త్యేక నాణెంను విడుద‌ల చేయ‌నున్నారు. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి చంద్ర‌బాబు  (CBN-NTR) ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈనెల 28న ఆ కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లుసుకుంటారు. రాష్ట్రంలోని వాలంటీర్ల వ్య‌వ‌హారంపై నివేదిక ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ తొల‌గించిన ఓట్ల మీద ఫిర్యాదు చేయ‌బోతున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో వైసీపీ చేయ‌బోయే అరాచ‌కాల‌పై ఫిర్యాదు చేయ‌డానికి ఎన్నికల క‌మిష‌న్ తో భేటీ కానున్నారు. ఇప్ప‌టికే అక్ర‌మంగా కొన్ని ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించారు. దానిపై ఆధారాల‌తో స‌హా టీడీపీ బ‌య‌ట‌పెట్టింది. మ‌రిన్ని ఆధారాల‌తో ఎన్నిక‌ల కమిష‌న్ ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబు ఈనెల 27న ఢిల్లీ చేరుకుని 28వ తేదీ వ‌ర‌కు అక్క‌డే ఉంటారు. ఎలాంటి కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో గ‌మ‌నించ‌డానికి ప్ర‌త్య‌ర్థి పార్టీలు సైతం ఆస‌క్తిగా చూస్తున్నాయి.

ల‌క్ష్మీపార్వ‌తిలేని రాష్ట్ర‌ప‌తి ఆహ్వానం

స్వర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల సందర్భంగా విడుద‌ల చేసే రూ. 100ల నాణం విడుదల కార్యక్ర‌మానికి ల‌క్ష్మీపార్వ‌తికి ఆహ్వానం లేదు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి ఆహ్వానం అంద‌క‌పోవ‌డంపై ఆమె స్పందిస్తూ లేఖ రాశారు. భ‌ర్త ఎన్డీఆర్ ను గుర్తిస్తూ కేంద్రం విడుద‌ల చేసే నాణెం కార్య‌క్ర‌మంకు దూరంగా పెట్ట‌డాన్ని ప్ర‌శ్నించారు. కానీ, రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ మాత్రం సానుకూలంగా స్పందించ‌లేదు. అంటే, భార‌త ర‌త్న అవార్డ్ ను త్వ‌రలో ఎన్డీఆర్ కు ప్ర‌క‌టిస్తార‌ని ఈ ప‌రిణామం తెలియ‌చేస్తుంద‌ని ఎన్టీఆర్ అభిమానులు విశ్వ‌సిస్తున్నారు.