CBN New Alliance : BJP, జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు జ‌ల‌క్ ?

CBN New Alliance : చంద్ర‌బాబు బీజేపీ నేత‌ల రాజ‌కీయాల‌తో  విసిగిపోయారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్యాల‌పైనా ఆలోచిస్తున్నారు.

  • Written By:
  • Updated On - July 20, 2023 / 04:31 PM IST

CBN New Alliance : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ నేత‌ల రాజ‌కీయాల‌తో  విసిగిపోయారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్యాల‌పైనా ఆలోచిస్తున్నారు. వారాహి వాహ‌న యాత్ర సంద‌ర్భంగా ప‌వ‌న్ ఉప‌యోగించిన ప‌ద‌జాలం జ‌నంలో చుల‌క‌న భావాన్ని క‌లిగించిన‌ట్టు టీడీపీ భావిస్తోంది. ఆ పార్టీల‌తో కలిసి వెళితే నష్టం త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తోంది. అందుకే, వ్యూహాత్మ‌కంగా బీజేపీ, జ‌న‌సేన‌కు దూరంగా ఉంటూ ఒంట‌రి పోరుకు సిద్ధం కావాల‌ని చంద్ర‌బాబు అంత‌ర్గ‌త టీమ్ కు సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

క‌మ్యూనిస్ట్ లు, ఎంఐఎంతో క‌లిసి టీడీపీ వెళ్లాల‌ని..(CBN New Alliance)

ఎన్డీయే సమావేశానికి టీడీపీకి ఆహ్వానం లేక‌పోవ‌డం మంచికేనంటూ పార్టీ శ్రేణుల్లోనూ ఉంది. తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పైనా బీజేపీకి వ్య‌తిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీయేతో క‌లిసి వెళితే, రాష్ట్రంలో న‌ష్ట‌పోతామ‌న్న భావ‌న శ్రేణుల్లో బ‌లంగా ఉంది. అంతేకాదు, సీఎం రేస్ లో ఉన్నానంటూ ప‌వ‌న్ చేసిన కామెంట్ల త‌రువాత టీడీపీలోని కీల‌క లీడ‌ర్లు వ్యూహాల‌ను (CBN New Alliance)మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. జ‌న‌సేన పార్టీ వ‌ల‌న ఎన్నిక‌ల్లోనూ,ఆ తరువాత‌ ప్ర‌భుత్వ‌ ఏర్పాటులోనూ కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావిస్తోంది.

జ‌న‌సేన‌కు దూరంగా ఉండాల‌ని టీడీపీ కీల‌క నిర్ణ‌యం

సీఎం ప‌ద‌వి మీద ఆశ పెట్టుకున్న ప‌వ‌న్ ఏ క్ష‌ణ‌మైనా  మైండ్ మార్చుకుంటారు. ఒక రోజు ఉన్న‌ట్టు మ‌రో రోజు ఆయ‌న వాల‌కం ఉండ‌దు. ఒక వేళ జ‌న‌సేన మ‌ద్ధ‌తుతో సంకీర్ణం ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు విజ‌న్ ప్ర‌కారం ఏమీ చేయ‌కుండా ప‌వ‌న్ అడ్డుప‌డే అవ‌కాశం ఉంది. లేదంటే బీజేపీ ఆడుతోన్న గేమ్ ప్ర‌కారం ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌డానికి కూడా ప‌వ‌న్ వెనుకాడ‌రు.ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించిన త‌రువాత జ‌న‌సేన‌కు దూరంగా ఉండాల‌ని టీడీపీ కీల‌క నిర్ణ‌యం. (CBN New Alliance) తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌ను వ‌దిలించుకోవాల‌ని తాజాగా టీడీపీ

ప్ర‌స్తుతం దేశంలో మారుతోన్న ప‌రిణామాలు, రాజకీయ ఈక్వేష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి చంద్ర‌బాబు తీసుకుంటున్నారు. వాటిని రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితులు, భ‌విష్య‌త్ కు అన్వ‌యిస్తున్నారు. ప్ర‌స్తుతం వామ‌ప‌క్ష పార్టీలు టీడీపీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నాయి. ఎన్డీయేకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఎంఐఎం రెడీగా ఉంది. అందుకే, క‌మ్యూనిస్ట్ లు, ఎంఐఎంతో క‌లిసి టీడీపీ వెళ్లాల‌ని మ‌రో ఆలోచ‌న.(CBN New Alliance) చేస్తున్న‌ట్టు వినికిడి. ఆ త‌ర‌హా కూట‌మి ఏర్పాడితే, ముస్లిం ఓటు బ్యాంకును సాలిడ్ గా పొందొచ్చ‌ని చంద్ర‌బాబు తాజా వ్యూహంగా తెలుగుదేశం వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : TDP Jumping Leaders : అమ‌రావ‌తి నేత‌ల పోటు!?

సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ ఏపీ ఎన్నిక‌ల్లో బ‌లంగా ప్ర‌భావం చూపుతుంది. ఆ కోణం నుంచి స‌మీక‌ణాల‌ను మార్చేస్తున్నారు చంద్ర‌బాబు. ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలోని విప‌క్ష కూట‌మిలో స‌మాజ్ వాజ్ పార్టీ ఉంది. ఆ పార్టీ యాద‌వ సామాజిక‌వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌దు. అలాగే, ఎన్డీయేకు వ్య‌తిరేకంగా బీఎస్పీ కూడా ప‌నిచేసే అవ‌కాశం ఉంది. అప్పుడు ఎస్సీలు కూడా మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డానికి ఛాన్స్ ఉంది. ఇక ఎంఐఎం రూపంలో ముస్లిం ఓటు బ్యాంకు వ‌స్తుంద‌ని అంచ‌నా. వామప‌క్షాల ద్వారా పోలింగ్ బూత్ ల‌లో వైసీపీ ఎదిరించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా అన్ని కోణాల నుంచి ఆలోంచిన త‌రువాత బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌ను వ‌దిలించుకోవాల‌ని తాజాగా టీడీపీ ఆలోచిస్తుంద‌ట‌.

Also Read : CBN Fight : ఢిల్లీ వ‌ర‌కు చంద్ర‌బాబు పోరుబాట