తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధిక బిజీ షెడ్యూల్, తరచూ జరుగుతున్న రాజకీయ పర్యటనలు, ప్రజాసంబంధ కార్యక్రమాలు పవన్ శారీరకంగా అలసటకు దారితీశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనను కోరుతున్నారు.
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఎన్నిసార్లు ఫైనల్ జరిగింది?
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల వద్ద తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం పట్ల పవన్ చేస్తున్న కృషిని గుర్తుచేసుకుంటూ, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కొన్ని ప్రభుత్వ, రాజకీయ అంశాలపై కూడా చర్చించుకున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలిసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది “గెట్ వెల్ సూన్ పవన్ అన్న” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. వైద్యుల సూచనల ప్రకారం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని, తిరిగి తన సాధారణ శక్తి, ఉత్సాహంతో ప్రజల మధ్యకి రావాలని ప్రతి వర్గం కోరుకుంటోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.