ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కరపత్ర యుద్ధానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN Master plan)సిద్ధమవుతున్నారు. బ్రిటీష్ కాలంనాటి జీవో నెంబర్ 1 విడుదల చేసి చంద్రబాబు రోడ్ షోలను అడ్డుకున్నారు. ఆయనకు వస్తోన్న ప్రజాదరణ కు బ్రేక్ వేయడానికి చీకటి జీవోను వైసీపీ ప్రయోగించింది. ప్రతిగా చంద్రబాబు వినూత్నంగా ఏపీ ప్రభుత్వంపై దండయాత్రకు(CBN Master Plan) క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అవినీతి, అక్రమాలను తెలియచేస్తూ కరపత్రాలను(pamphtes) ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వంపై దండయాత్రకు(CBN Master Plan)
ఇటీవల మంత్రులకు సంబంధించిన ఛార్జిషీట్ పత్రాలను ( pamphtes) చేసిన సందర్భంగా వచ్చిన అనూహ్య స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో మంత్రులు కొందరు చేసిన దందాలను బయట ప్రపంచానికి టీడీపీ తెలియచేసింది. ఫలితంగా కొందరు మంత్రులను క్యాబినెట్ 2.0 నుంచి తప్పించారు. వాళ్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారని వైసీపీ నుంచి అంతర్గతంగా వినిపించింది. అదే తరహాలో ఛార్జిషీట్ లను నియోజకవర్గాల వారీగా ప్రిపేర్ చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చంద్రబాబు చేశారని తెలుస్తోంది.
Also Read : CBN Kuppam : కుప్పం పర్యటనపై పోలీస్ జులుం! కర్ణాటక, ఏపీ బోర్డర్లో హై టెన్షన్!
వాస్తవంగా ఈనెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జనసేన మీటింగ్ ఉంది. దానికి వైసీపీ సర్కార్ అనుమతి ఇస్తుందా? చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అడ్డుకున్న విధంగా వ్యవహరిస్తుందా? అనే అంశంపై ఏపీ రాజకీయం కన్నేసింది. ఆ ఎపిసోడ్ ముగిసిన తరువాత కరపత్రాల పంపిణీ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఇళ్ల పట్టున ఉంటారు. ఆ సమయంలో కరపత్రాలను పంచిపెడితే స్పందన బాగా ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవంగా ఈనెల 27న లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభం కానుంది. ఆ యాత్ర సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేయాలని ప్రాథమికంగా టీడీపీ భావిస్తోంది. అయితే, జీవో నెం 1 కారణంగా ఆ యాత్రపై సందేహాలు ఉన్నాయి.
చంద్రబాబు సభలకు జనం తండోపతండాలు
`ఇదేం ఖర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ద్వారా చంద్రబాబు పెట్టిన సభలకు జనం తండోపతండాలు హాజరయ్యారు. కందుకూరు, గుంటూరు సభల్లో వరుసగా జరిగిన దురదృష్టకర సంఘటనలను చూపుతూ జీవో నెంబర్ 1ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే, ప్రత్యామ్నాయ మార్గాల వైపు చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ప్రజల నుంచి ఆదరణ వస్తున్నందున బ్రేక్ లేకుండా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే పాదయాత్రలకు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : CBN Power : వచ్చే ఎన్నికల్లో `తెలుగుదేశం`దే అధికారం! `ఆత్మసాక్షి`కండిషన్స్ అప్లై.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించి కరపత్రాలను ముద్రించి ప్రతి ఇంటికి అందించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా టిడిపి ప్రజా క్షేత్రంలో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతుంది. తెలుగుదేశం పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్లి, అసంతృప్తితో ఉన్న నేతలను తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నం చేయాలని కూడా అధినాయకత్వం ప్రయత్నిస్తుంది. ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన చాలా మంది మాజీ మంత్రులు టచ్లో ఉన్నారని టీడీపీ లీకులు ఇస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోనూ చంద్రబాబు
ఖమ్మం జిల్లా సభ సక్సెస్ కావడంతో టీడీపీకి కంచుకోటగా ఉండే జిల్లాలలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించడానికి చంద్రబాబు సన్నద్ధమయ్యారు. అంతేకాదు బస్సు యాత్రలు, పాదయాత్రకు కూడా తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడపగడపకు మన టిడిపి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంటికి చేర్చాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇరు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందించడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో వినూత్నంగా టీడీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుందన్నమాట. వైసీపీ అవినీతి పాలనపై చార్జిషీట్ లు వేయడం ద్వారా ఏపీలోనూ,గతంలో చేసిన అభివృద్ధిని తెలుపుతూ తెలంగాణలోనూ గ్రామ స్థాయి యుద్ధానికి దిగాలని టీడీపీ యోచిస్తోంది. సంక్రాంతి తరువాత చంద్రబాబు ఇచ్చే దిశానిర్దేశం మేరకు క్యాడర్ దూకుడుగా ముందుకు కదలనుంది.
Also Read : CBN in surveillance : చంద్రబాబు సభలపై ఢిల్లీ నిఘా నేత్రం!