CBN Manifesto 2.0 : టీడీపీ మేనిఫెస్టో 2.0 సిద్ధం! ప్ర‌చారానికి బ‌స్సు యాత్ర‌!!

టీడీపీ రెండో మేనిఫెస్టో (CBN Manifesto 2.0) సిద్ద‌మ‌వుతోంది. దాన్ని ప్ర‌చారం చేయ‌డానికి బ‌స్సు యాత్ర‌కు బ్లూ ప్రింట్ రెడీ అవుతోంది.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 01:32 PM IST

తెలుగుదేశం పార్టీ రెండో మేనిఫెస్టో (CBN Manifesto 2.0) సిద్ద‌మ‌వుతోంది. దాన్ని ప్ర‌చారం చేయ‌డానికి బ‌స్సు యాత్ర‌కు బ్లూ ప్రింట్ రెడీ అవుతోంది. క‌నీసం 120 స్థానాల‌కు త‌గ్గ‌కుండా బ‌స్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని సీనియ‌ర్ల‌ను ప్రాంతాల వారీగా ఎంపిక చేసి యాత్ర‌కు పంప‌నున్నారు. దానికి ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెంనాయుడు సార‌థ్యం వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే తొలి మేనిఫెస్టో ప్ర‌కంప‌న‌ల‌ను సృష్టిస్తోంది. దానికి అనుసంధానంగా మేనిఫెస్టో 2.0 రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది.

తెలుగుదేశం పార్టీ రెండో మేనిఫెస్టో (CBN Manifesto 2.0)

(CBN Manifesto 2.0) మినీ మేనిఫెస్టోను(Mini manifesto) రాజ‌మండ్రిలో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌గా ప్ర‌క‌టించిన విషయం విదిత‌మే. దానిలో యువ‌త‌, మ‌హిళ‌, బీసీ, రైతుల‌ను ఆక‌ట్టుకునేలా తాయిలాలు ప్ర‌క‌టించారు. వాటిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా తీసుకెళుతున్నారు.6 వ‌జ్రాల పేరుతో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. వాటిలో మొద‌టిది పేదలను ధనవంతులు చేయడం పూర్ టూ రిచ్ అని దీనికి పేరుపెట్టారు. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని టీడీపీ పేర్కొంది. ఇక బీసీలకు రక్షణ చట్టం తీసుకురావ‌డం ద్వారా అన్ని విధాలా అండగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అండ‌గా నిలుస్తానని టీడీపీ ప్రకటించిన రెండో వ‌జ్రం. మూడో వ‌జ్రం కింద చంద్ర‌బాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని పేర్కొంది.

  రాజ‌మండ్రిలో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌గా మినీ మేనిఫెస్టోను..

వ్య‌వ‌సాయాన్ని ఆదుకోవ‌డానికి అన్న‌దాత పేరుతో నాలుగో వ‌జ్రాన్ని చంద్ర‌బాబు మినీ మేనిఫెస్టోలో(Mini manifesto) ప్ర‌క‌టించారు. ప్రతి రైతుకు ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాన‌మైన ఐదో వ‌జ్రం మ‌హిళా `మహా శక్తి`పేరుతో ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేల సాయం అందిస్తామ‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న మ‌హిళాలోకాన్ని ఆలోచింప‌చేస్తోంది.

ప్ర‌చారం చేయ‌డానికి సీనియ‌ర్ల‌తో కూడిన బ‌స్సు యాత్ర‌కు

ఇక 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారికి నెలవారీ పెన్షన్లు అందించేందుకు ఈ పథకం పెట్టారు. కేటగిరినీ బట్టి రూ.2250 నుంచి రూ.10వేల వరకూ పెన్షన్ ఇస్తారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు , స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు (Free bus journey)సౌకర్యం క‌ల్పిస్తూ మ‌రో ఐదో వ‌జ్రాన్ని మ‌హిళ‌ల‌కు ఇచ్చారు. ఇక యువ‌గ‌ళం పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఒక వేళ ఉద్యోగం లేక‌పోతే ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు రూ. మూడు వేల ఆర్థిక సాయం అందిస్తామ‌ని ఆరో వజ్రం కింద యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌క‌టించారు.

Also Read : CBN Kuppam : ల‌క్ష మోజార్టీకి రూట్ మ్యాప్, చంద్ర‌బాబు కుప్పం టూర్ జోష్

మ‌హానాడులో ప్ర‌క‌టించిన ఆరు వ‌జ్రాలు ప్ర‌జ‌ల్లో బాగా వెళ్లాయ‌ని టీడీపీ భావ‌న‌. దానికి కొన‌సాగింపుగా మేనిఫెస్టో 2.0 సిద్ధ‌మైయింది. చంద్ర‌బాబు ప్ర‌క‌టించే ఫుల్ మేనిఫేస్టో (CBN Manifesto) కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. కేవ‌లం ప్ర‌క‌టించ‌డమే కాదు, దాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయ‌డానికి సీనియ‌ర్ల‌తో కూడిన బ‌స్సు యాత్ర‌కు(Bus yatra) త్వ‌ర‌లోనే శ్రీకారం చుట్టేలా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. మొత్తం మీద చంద్ర‌బాబు ఈసారి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓడించే మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌న్న‌మాట‌.

Also Read : TDP Twist : ముగ్గురి ముచ్చ‌ట‌! విజ‌య‌వాడ ఎంపీగా బాల‌య్య‌?