Site icon HashtagU Telugu

CBN-LN : తండ్రీ కొడుకుల హ‌వా!,యువ‌గ‌ళం, `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..`హోరు!

Cbn Ln

Cbn Ln

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను(CBN-LN) అడ్డుకోవ‌డానికి తొలి రోజు నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) స‌ర్కార్ చేస్తోన్న ప్ర‌య‌త్నం అంద‌రికీ తెలిసిందే. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన‌ప్పుడు ఒక్కోలా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చ‌ట్టం, నిబంధ‌న‌ల‌ను ఒక‌టిగా ఉన్న‌ప్ప‌టికీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల ఆదేశాల ప్ర‌కారం పోలీసులు న‌డుచుకుంటున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంటోంది. ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 1 విడుద‌ల చేస్తూ తొలి రోజు నుంచే ఆంక్ష‌లు పెట్టింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ను  అడ్డుకోవ‌డానికి టెన్ష‌న్(CBN-LN)

మైకును లాక్కోవ‌డం, ప్ర‌చార ర‌థాన్ని సీజ్ చేయ‌డం తొలి రోజుల్లోనే చూశాం. ఇప్పుడు ఆయ‌న రోడ్డు షో ఎక్క‌డ చేయాలి? ఎంత మందితో చేయాలి? అనేదానిపై (Jagan) ఆంక్ష‌లు పెడుతున్నారు. రోజు రోజుకు ఆయ‌న ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ చూసి ఏదో ఒక ర‌కంగా ప్ర‌జ‌ల్ని ఆపాల‌ని చూస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర పై(CBN-LN) కొనసాగుతున్న పోలీసు జులుం కొన‌సాగుతోంది.శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనం చేసుకోవడానికి లోకేష్ కి అనుమతి లేదని పోలీసులు చెప్ప‌డం టీడీపీ క్యాడ‌ర్ కు ఆగ్ర‌హాన్ని క‌లిగిస్తోంది. అనుమతి నిరాక‌రించిన పోలీసుల మీద మండిప‌డుతున్నారు. అంతేకాదు, దేవుడి గుడికి సమీపంలో ఎక్కడా బస చెయ్యడానికి వీలు లేద‌ని పోలీసులు ఆంక్ష‌లు పెట్టారు. కనీసం 5 కిలోమీటర్ల దూరం ఉండేలా. బస ఏర్పాటు చేసుకోవాల‌ని పోలీసులు సూచించారు. మాజీ మంత్రి బొజ్జ‌ల‌ గోపాలకృష్ణా రెడ్డి కి చెందిన ప్రైవేట్ స్థలంలో కూడా బస చెయ్యడానికి వీల్లేద‌ని అనుమ‌తి నిరాక‌రించారు. దేవుడి దర్శనం లో విష‌యంలోనూ ఆంక్ష‌లు ఏమిట‌ని టీడీపీ(CBN-LN) ప్ర‌శ్నిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా యువ‌గ‌ళం మీద దాడి

ఒక వైపు లోకేష్ పాద‌యాత్ర గ‌త నెల 27వ తేదీ నుంచి కొన‌సాగుతోంది. ఆయ‌నకు ప్ర‌జాద‌ర‌ణ రావ‌డానికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప్ర‌భుత్వం ఆంక్ష‌లు ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. డ‌జ‌ను మంది మంత్రులు రంగంలోకి దిగి లోకేష్ మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా యువ‌గ‌ళం మీద దాడి చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకు లోకేష్ వెళుతున్నారు. ఇప్పుడు శ్రీకాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం చేసుకోవ‌డాన్ని కూడా ప్ర‌భుత్వం వివాద‌స్పదం చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ లోకేష్ యువ‌గ‌ళం విజ‌య‌వంతం అయింద‌ని చెప్ప‌డానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి.

Also Read : Yuvagalam : ఊరుకో విల్లా, న‌గ‌రికి 5 ఎమ్మెల్యేలు, రోజాకు జ‌బ‌ర్ద‌స్త్ లోకేష్ కౌంట‌ర్

ఇక చంద్ర‌బాబునాయుడు(CBN-LN) తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం స‌భ‌ను చూసి వైసీపీ లీడ‌ర్లు కంగుతిన్నారు. అక్క‌డ వ‌చ్చిన జ‌నాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఏ మాత్రం డ‌బ్బు, త‌ర‌లింపు కార్య‌క్ర‌మాలు లేకుండా చంద్ర‌బాబుకు వ‌స్తోన్న జ‌నాన్ని చూసి తాడేప‌ల్లి కోట‌రీ చిర్రెత్తి పోతుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, గెలుపు కోసం చంద్ర‌బాబు వేస్తోన్న ఎత్తుగ‌డలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jagan) చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయ‌ని వైసీపీలోని కొన్ని వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అంతేకాదు, అధికారంలోకి టీడీపీ రాబోతుంద‌న్న సంకేతం బ‌లంగా వెళ్లింది. దీంతో అధికార‌, అన‌ధికార‌, వైసీపీలోని లీడ‌ర్లు ర‌హ‌స్యంగా చంద్ర‌బాబు వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. మూడు రోజుల చంద్ర‌బాబు రోడ్ షో లు ఎప్ప‌టి మాదిరిగానే సూప‌ర్ హిట్ అయింది. తూర్పు గోదావ‌రి జిల్లా వ్యాప్తంగా జ‌న‌సంద్రం క‌నిపించింది.

లోకేష్ పాద‌యాత్ర‌ను మానిట‌ర్ చేసిన చంద్ర‌బాబు(CBN-LN)

రెండు వారాల పాటు లోకేష్ పాద‌యాత్ర‌ను మానిట‌ర్ చేసిన చంద్ర‌బాబు(CBN-LN) ఇప్పుడు ఆయ‌న కూడా రంగంలోకి దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్ష‌న్ చూసిన త‌రువాత లోకేష్ యాత్ర హిట్ గా చంద్ర‌బాబు భావించారు. యువ‌గ‌ళం యాత్ర‌ను సెట్ రైట్ చేసిన త‌రువాత `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ కు తిరిగి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. జీవో నెంబ‌ర్ 1 జారీ చేసిన తొలి రోజుల్లో చంద్ర‌బాబును అడ్డుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ప్ర‌భుత్వం ఇప్పుడు కొంత సైలెంట్ అయింది. ప్ర‌జాగ్ర‌హం పెల్లుబుకుతోన్న సంగ‌తిని గ్ర‌హించింద‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లోని టాక్‌. అందుకే, జీవో నెంబ‌ర్ 1 అమ‌లు చేయ‌డానికి పోలీసులు ఉన్న‌తాధికారులు కూడా సందేహిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తిరుగులేని విధంగా అటు లోకేష్ ఇటు చంద్ర‌బాబు రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

Also Read : Yuvagalam : ఏపీ పోలీస్ ఓవ‌రాక్ష‌న్‌! లోకేష్ పాద‌యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ‌!!