Site icon HashtagU Telugu

CBN : కలుద్దాం అంటూ.. సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..

Cmcbn Revanth

Cmcbn Revanth

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM CHandrababu)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) కి లేఖ రాసారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఇచ్చిన విభజన హామీల పరిష్కారం కోసం కలిసి చర్చించుకోవడమే మంచిదని, పరస్పర సహకారం… తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమవుతోందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా లో చంద్రబాబు లేఖ ను పోస్ట్ చేశారు.

” తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.” అని చంద్రబాబు లేఖలో రాసుకొచ్చారు.

Read Also : Amaravati : అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు బాబు సిద్ధం